బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,780 వద్ద ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
''1990లో ఒక కేజీ బంగారంతో.. మారుతి 800 వచ్చేది. 2000లో మారుతి ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చ్యూనర్, 2019లో బీఎండబ్ల్యు ఎక్స్1, 2025లో డిఫెండర్, 2030 నాటికి రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఒక కేజీ బంగారం కొని 2040 వరకు వేచి ఉండండి.. మీరు ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయగలుగుతారు'' అని వివరించారు.
ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
ఈ రోజు రేటు ప్రకారం.. ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ రూ. 1,43,78,000. ఈ ధరలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధరలు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఒక కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఒకవేళా గోల్డ్ రేటు తగ్గితే.. అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.
Interesting Economics & Observation:
1990 .....1KG gold = Maruti 800
2000......1KG gold = Esteem
2005......1KG Gold = Innova
2010......1KG Gold = Fortuner
2019.....1KG Gold = BMW X1
2025…..1Kg #Gold = Defender
2030….. 1kg #Gold = Rolls Royce
Keep 1 KG #gold & wait till…— A K Mandhan (@A_K_Mandhan) January 15, 2026


