ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు | gold theft at Vijayawada durgamma temple today | Sakshi
Sakshi News home page

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. మహిళ బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

Mar 6 2026 11:23 PM | Updated on Mar 6 2026 11:23 PM

gold theft at Vijayawada durgamma temple today

విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై  చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.  హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్‌లో ఉన్న బంగారు చోరీకి గురైంది.

దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement