కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు: రోజా | RK Roja Accuses Alliance Leaders of Using Low Level Language ve | Sakshi
Sakshi News home page

కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు: రోజా

Mar 6 2026 4:49 PM | Updated on Mar 6 2026 5:27 PM

RK Roja Accuses Alliance Leaders of Using Low Level Language ve

సాక్షి, భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలిపిందని మాజీ మంత్రి రోజా అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన తర్వాత కూడా సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మంత్రి కూడా దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఇవాళ భీమవరంలో రోజా మాట్లాడుతూ.. ‘శాసన మండలిలో కూడా చైర్‌పర్సన్‌ మోషన్‌రాజు కులం గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూటమి నేతలు లేనిపోనివన్నీ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా సక్రమంగా మాట్లాడారా?

కూటమి నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్థావన తీసుకురాకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రజలకు మంచి చేయండి.. లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి’ అని అన్నారు.

గాడిదల అడ్డంగా పెరిగావ్.. చెంప పగల కొడతారు జాగ్రత్త..!
 

ఇదీ చదవండి:  నేపాల్‌ ఎన్నికల ఫలితాలు భారత్‌కు ఎందుకింత కీలకం?

Advertisement
 
Advertisement
Advertisement