తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదు: వైవీ సుబ్బారెడ్డి | YV Subba Reddy Comments On Chandrababu Government | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదు: వైవీ సుబ్బారెడ్డి

Mar 6 2026 2:15 PM | Updated on Mar 6 2026 3:16 PM

YV Subba Reddy Comments On Chandrababu Government

సాక్షి, ప్రకాశం: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ ఛైర్మన్‌పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. రిజెక్ట్‌ చేసిన 4 ట్యాంకర్‌లు దొడ్డిదారిలో తీసుకున్నారు. సీబీఐ కూడా రిపోర్టులో అదే చెప్పిందని వైవీ అన్నారు.

‘‘వెంకటేశ్వరస్వామిపై వైఎస్‌ జగన్‌కు పూర్తి నమ్మకం ఉంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి చిత్తశుద్ధితో మొక్కుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘బాలిలేని మాటలకు నేను స్పందించడం ఏంటి? జిల్లా నాయకులు ఉన్నారు. ప్రస్టేషన్‌తో బాలినేని ఏదో మాట్లాడితే నేనెందుకు దానిపై కామెంట్ చేయాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటాడు

Advertisement
 
Advertisement
Advertisement