అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుడితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదమే. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత ముఖ్యమనే విషయాన్ని అటకెక్కించి పలువురు సెల్‌ఫోన్లు చూస్తూ... మాట్లాడుతూ గురువారం ఉదయం అనంతపురం నగర రహదారులపై రయ్యిమంటూ దూసుకెళ్లారు. ఇందులో పోలీసులు సైతం ఉండడం గమనార్హం. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడడం, వీడియోలు చూడడం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం వంటి చర్యలు ప్రమాదకరమైనవే కాకుండా శిక్షార్హమైనవి అని అందరూ చెబుతుంటారు. అయితే పాటించడాన్ని మాత్రం అటకెక్కిస్తుండడం గమనార్హం.






