నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్‌లు.. | Cyber Crime Police Arrest Man For Morphing Woman’s Photos And Issuing Online Threats, More Details Inside | Sakshi
Sakshi News home page

నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్‌లు..

Mar 6 2026 1:04 PM | Updated on Mar 6 2026 3:00 PM

fake facebook id used to harass married woman

విశాఖపట్నం జిల్లా: నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతో ఓ వివాహితకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని నగర సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వివాహితకు ఒక వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. అనంతరం ఆమె ఖాతాలోని ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి మారి్ఫంగ్‌ చేశాడు. 

ఆ ఫొటోలను ఆమెకు పంపిస్తూ, తనతో చాటింగ్‌ చేయకపోతే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని కొబ్బరితోటకు చెందిన గరుబిల్లి భాస్కరరావుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్‌ మీడియాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే అంగీకరించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement