శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత | YSRCP Leader Botsa Satyanarayana Feels Unwell In Legislative Council, Doctors Say Condition Stable | Sakshi
Sakshi News home page

శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత

Mar 6 2026 4:38 PM | Updated on Mar 6 2026 6:06 PM

YSRCP Leader Botsa Satyanarayana Mild Discomfort in AP Council

విజయవాడ:  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.  బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో  సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్‌రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స.

	ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement