breaking news
botsa satyanarayana
-
కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై బొత్స కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: తన కుమార్తె రాజకీయ ప్రవేశంపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేస్తుందని బొత్స వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స.. ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడించారు.కాగా, అంతకుముందు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించిందని.. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్న బొత్స.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది. సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి. 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటూ పార్టీకి లేదు. ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది’’ అంటూ బొత్స మండిపడ్డారు. -
స్పీకర్‌కు మీరు సలహాలిస్తారా..? నాదెండ్ల మనోహర్‌పై బొత్స ఫైర్
-
ఇంత అహంకారమా?.. మండలి పరిణామాలపై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార కూటమి సభ్యులు, మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై చర్చకు పట్టుబడుతుండగా.. సమాధానం చెప్పలేక మంత్రులు అసహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. చివరకు సభను ఎలా నిర్వహించాలో చైర్మన్‌కే సూచనలు చేసే స్థాయికి మంత్రుల తీరు వెళ్లిందని ధ్వజమెత్తారు.బుధవారం శాసన మండలిలో.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చినా చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఒక్కరికే కాకుండా అందరికీ సమానంగా వర్తించాలని బొత్స పేర్కొన్నారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..వైఎస్సార్సీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి మంత్రులు గట్టిగా మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయడం సరికాదని బొత్స అన్నారు. సభలో మంత్రుల తీరు చూస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం స్పష్టమవుతోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు.చైర్మన్‌నే ఆదేశిస్తారా?సభను నిర్వహించే విషయంలో మంత్రులు చైర్మన్ కొయ్యే మోషేనురాజుపై అసహనం వ్యక్తం చేయడాన్ని బొత్స తప్పుబట్టారు. “మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా?” అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పార్థసారథి వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై చైర్మన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని బొత్స తెలిపారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ మంత్రులకు స్పష్టం చేయడం.. అధికార పక్షం వ్యవహారశైలికి అద్దం పడుతోందన్నారు.చైర్మన్ సీటును గౌరవించాలిచైర్మన్ స్థానాన్ని మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని బొత్స హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలిని తాను చాలాసార్లు గమనించానని.. ఆయన చైర్మన్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రొసీజర్ బుక్ తీసుకొచ్చి తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాదెండ్ల సమర్థించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. పొరపాటు జరిగితే చెప్పాలి కానీ.. చైర్మన్‌కే హితబోధ చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.కూటమి ఎమ్మెల్సీల తీరుపైనా..మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కూటమి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని కూడా బొత్స తప్పుబట్టారు. సభలో అధికార పార్టీ సభ్యులు లేకపోవడం సరికాదని, ఇది శాసనసభా సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అన్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలు తెలిపారు.“మండలిలో వెన్నుపోటు పార్టీ నేతల తీరు బాధాకరం. ఆ పార్టీ వైఖరి మరోసారి బయటపడింది. అధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవపరిచారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో అధికార పక్షం లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర చరిత్రలో ఎన్నాడూ ఇలా జరగలేదు” అని బొత్స విమర్శించారు. ‘‘అధికార పక్షానికి అహంకరం పనికి కాదు. డిప్యూటీ చైర్మన్‌కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నీతులు చెప్పడమేనా? పాటించడం తెలియదా?. కూటమి సభ్యులు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు’’ మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందిప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని బొత్స స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంతో పాటు అన్ని ప్రజా సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార పక్షం ఇప్పటికైనా అహంకార వైఖరిని విడనాడి ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
శాసన మండలిలో ‘మెగా’ ప్రతిష్టంభన!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండో రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియమకాలలో అవకతవకలపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ చైర్మన్ పోడియం ముందుకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీలో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక దానిపై చర్చకు వీలు కాదంటూ శాసనమండలి చైర్మన్ మోషన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభించడంతో చైర్మన్ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యల ఆందోళన మధ్యే ఐదు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఉదయం సభ ప్రారంభమైన 27 నిమిషాలకే పదిన్నర గంటల సమయంలో వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పునఃప్రారంభమైన వెంటనే తిరిగి బుధవారానికి వాయిదా పడింది. రైతులపై ప్రేమ అసెంబ్లీలో ఏమైంది?: బొత్సమరోవైపు.. మండలిలో ప్రతిపక్ష నేత బొత్య సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. ‘మెగా డీఎస్సీపై, దాంట్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగాలని, విచారణ జరపాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. చర్చకు రెడీ అంటూ అన్ని చోట్లా మాట్లాడుతున్నారు. మరి శాసన మండలిలో మేం అడుగుతున్నాం కదా..? సమాధానం చెప్పండి..’ అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. దీనిపై మంత్రి కేశవ్ స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్సీపీకి ప్రజల అజెండా పట్టదని ఆరోపించారు. దీనికి బొత్స తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘అసెంబ్లీలో ముందుగా డీఎస్సీపై చర్చించాకే కరువుపై చర్చించారు కదా? మరి రైతులపై ఈ ప్రేమ అక్కడ ఏమైంది? ఇక్కడే వచ్చిందా?’ అంటూ నిలదీశారు. వ్యవసాయం– కరువుపై చర్చించాలని అడిగింది కూడా వైఎస్సార్సీపీనే అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎప్పుడూ లేని వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ అంశంపై కూడా చర్చ జరగాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వ్యవసాయం – కరువు పరిస్థితులపై చర్చించేందుకు మరో రెండు రోజుల పాటు సమావేశాలు పొడిగించవచ్చు కదా?’ అని బొత్స ప్రశ్నించారు. సమావేశాలను పొడిగించండి.. రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిద్దామంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో చైర్మన్ జోక్యం చేసుకుంటూ దీనిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ సూచించారు. బొత్స, మంత్రి పయ్యావుల సంవాదం కొనసాగుతున్న సమయంలో సభ ఉదయం పదిన్నర గంటల సమయంలో తాత్కాలికంగా వాయిదా పడింది.డీఎస్సీ పేరెత్తితే ప్రభుత్వం పారిపోతోంది⇒ మండలిలో విపక్ష నేత బొత్స ధ్వజం⇒ మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలి ⇒ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి ⇒ డీఎస్సీ అక్రమాలపై మండలిలో పూర్తిస్థాయిలో చర్చించాల్సిందే ⇒ అప్పటిదాకా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందిసాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం రెండో రోజు కూడా భయపడి పారిపోయిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు దాటవేత ధోరణిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని పత్రికల్లో గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలిస్తూ ఇచి్చన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్లో గానీ అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇలాంటి చర్యలతో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. తప్పు జరిగిందని మీరే ఒప్పుకున్నారు..! మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ జరగకపోతే ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని బొత్స ప్రశ్నించారు. టీచర్ ఉద్యోగాల కోసం సెల్ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. ప్రభుత్వం శాసనసభలో ఏవో మాటలు చెప్పడం మినహా మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు దానిపై సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్ విసిరారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ డీఎస్సీపై మాట్లాడారు. ఎలాంటి తప్పు జరగకపోతే విచారణకు సిద్ధమని ఎందుకు అనడం లేదు? డీఎస్సీలో తప్పులు జరిగినట్లు అసెంబ్లీలోనే నారా లోకేశ్ ఇన్ డైరెక్ట్‌గా ఒప్పుకున్నారు. డీఎస్సీ మార్కులు తాము కన్సిడర్లోకి తీసుకోవడం లేదని లోకేశ్ ప్రకటించారు. పీవీ సింధుకు ఉద్యోగం విషయంలో లోకేష్ చెప్పింది తప్పు. ఆమె అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె ఒక్కరికే ఉద్యోగం వచి్చంది. మీకు లాగా అందరికీ ఒకే మాదిరిగా ఇవ్వలేదు. వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్ నా శాఖ మార్చి సీబీఐ విచారణ చేయించారు’ అని బొత్స పేర్కొన్నారు.రైతు సమస్యలపై చిత్తశుద్ధి కరువురాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం, రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ‘రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని కోరిందే మేం. ఈ రోజు సభకు వ్యవసాయ మంత్రి రాలేదు. కానీ దీనిపై చర్చ మాత్రం చేస్తామంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కరువు తాండవిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చారు.. ఎల్‌నినో వచ్చింది’ అని బొత్స వ్యాఖ్యానించారు. -
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
-
రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఎటు పోతుంది...?
-
రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది: బొత్స
విజయవాడ: ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు భయపడి ప్రభుత్వం మళ్లీ పారిపోయిందని ఆక్షేపించారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీస్త్ర శాసనమండలి సమావేశాలు వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్దలు చర్చ కోరితే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలకు ఆధారాలున్నా స్పందించడం లేదని బొత్స మండిపడ్డారు. అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని అడిడితే సమాధానం లేదన్నారు. ‘ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారు. రెండులరోజులు పొడిగించైనా చర్చిద్దామంటే మాట్లాడటం లేదు. డీఎస్సీలో అక్రమాల పై విచారణకు భయపడపతున్నారంటేనే అనుమానాలు బలపడుతున్నాయి. డీఎస్సీలో 3% కోటా ఇచ్చారు. జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపారు. ఆ తర్వాత జీవోలు రద్దు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ప్రాధాన్యం లేకుండా చేశారు. మా ప్రశ్నలు కరెక్ట కాదంటే చర్చకు రండి. చర్చ కోసం అడుగుతూనే ఉన్నాం. చర్చ పెట్టండి అర్ధరాత్రైనా మేం సభలోనే ఉంటాం. డీఎస్సీ పై చర్చ జరగాలి. మా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాల పై సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవసాయ మంత్రి లేకుండానే వ్యవసాయం పై సభలో చర్చిస్తారట. మా డిమాండ్ సమంజసమో కాదో ప్రజలే చెప్పాలి. చంద్రబాబు ,వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు కరువు కవల పిలల్లు. వ్యవసాయమే దండగ అన్న పార్టీ వెన్నుపోటు పార్టీ. ఆ పార్టీ నేతలకు వ్యవసాయమంటేనే నచ్చదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ లేనే లేదు...శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తామన్నారు. ఇద్దరు ఎస్ఐ లు గంజాయితో దొరకడం సిగ్గుచేటు. గంజాయి తగ్గడం కంటే ఇంకా పెరిగిపోయింది. మొక్కుబడిగా సభ పెట్టడం కరెక్ట్ కాదు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ పై సీబీఐ విచారణ జరిపించండి’ అని డిమాండ్ చేశారు. -
AP అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. YSRCP ఎమ్మెల్సీల ర్యాలీ
-
LIVE: శాసనమండలిలో టెన్షన్ టెన్షన్!
-
ఏపీ శాసన మండలి వాయిదా
డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.AP అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ముగిసిన బీఏసీ సమావేశం.. మండలి వాయిదాశాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదాడీఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వం తర్జన భర్జనచర్చకు సిద్ధమంటూనే.. డేట్, టైం ఫిక్స్ చేయని వైనంఎల్నినో చర్చ తర్వాత డీఎస్సీ చర్చపై చర్చిస్తామంటున్న కూటమిముందే చర్చించాలని పట్టుబడుతున్న వైఎస్సార్సీపీడిప్యూటీ చైర్మన్ పోస్ట్‌కి నామినేషన్ వేసిన తుమాటి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లుఎన్నికల బరిలో వైఎస్సార్సీపీనామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుఅసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలుపాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీ లు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంమీడియా పాయింట్ వద్ద తోట త్రిమూర్తులు కామెంట్స్.. డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబడుతుంటే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు..సభలో చర్చించి నోట్ ఇచ్చిన చప్పట్లు కొట్టుకొన్నారు..లోకేష్ చంద్రబాబు ని, చంద్రబాబు లోకేష్ ని సభలో పొగుడుకొన్నాడు.డీఎస్సీపై అక్రమాలపై ప్రశ్నించేది ఎవరు?మండలి లో మేము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావడం లేదు..డీఎస్సీ అక్రమాలపై జగన్ ఆధారాలతో బయట పెట్టారు..అవినీతి జరకపోతే చర్చించండి..6నెలలకు అసెంబ్లీ జరపాలి కాబట్టి మామ అనిపిస్తున్నారు..రైతులు కష్టాలపై మేము ప్రశ్నిస్తున్నాం..ప్రజలకు చెప్పేది ఎమ్ లేక ప్రతిపక్షం లేని సభలో చప్పట్లు కొట్టుకొంటున్నారు..టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగిటే 10 మంది కూడా ఉండడం లేదు..ఆడబిడ్డ నిది ఎక్కడని మహిళలు, రైతు భరోసా కోసం రైతులు గ్రామాల్లో అడుగుతున్నారు..ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొహం చాటస్తున్నారు..అమరావతి లో దాచుకు తింటున్నారు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు..మొండితోక అరున్ కామెంట్లు..DSC పై చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చాం..గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వొచ్చారు.. Dsc పై చర్చిస్తరని ఆశించం.లోకేష్ కాదు.. లీకేష్ తన మంత్రులతో పారిపోయాడు.స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేదని అబద్ధం చెప్పావ్..పీవీ సింధూకి పరీక్ష నిర్వహించకుండా ఇచ్చామమని లోకేష్ చెప్పాడు.సరేగానీ చర్చిద్దాం అంటే లీకేష్ ముందుకు రావడం లేదుసత్యం రామలింగ రాజు మేనేజ్మెట్ కోటాలో చదివాడో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే జాబ్ లు ఇచ్చాడు..హోమ్ శాఖ ఏవిధంగా కేంద్ర గణాంకాలులో దిగజారిందో అలాగే విద్యా శాఖ కుడా దిగజారుతుంది..మూడేళ్లు లీకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ర్యాంక్ కూడా పడిపోతుంది..డీఎస్సీతో పాటు మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపిద్దాంఅవకతవకలు జరిగినట్లు కనిపిస్తోంది కాబట్టి లీకేష్ రాజీనామా చేయాలి..లీకేష్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చిన 400స్పోర్ట్స్ కోట సీట్లు రద్దు చేయాలి..4 రోజులు సభ పెడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకి వస్తాయి..లీకేష్ స్కామ్ పై జనసేన, బీజేపీ మాట్లాడాలి..వాళ్ల స్టాండ్ ఏంటో బీజేపీ, జనసేనలు చెప్పాలి..ప్రశ్నించానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఈ లీకేజ్ పై లీకేష్ ని ప్రశ్నించాలి..బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చించాలని పట్టుబడుతున్నాం..వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు: మంచ నాగమల్లేశ్వరికూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఫైర్అసెంబ్లీ వేదిక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.బొత్స సత్యనారాయణ పై మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..మంత్రిగా విఫలమైన అచ్చెన్నాయుడు కంటే దద్దమ్మ మరొకరు లేరు.బొత్స సత్యనారాయణ కు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లేదంటే అచ్చెన్నాయుడు ఇంటిని ముట్టడిస్తాము..అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..బొత్సా సత్యనారాయణ కు లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉంది.బొత్స సత్యనారాయణ విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్ర విద్యార్ధులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు..దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.540 మంది రైతులు కూటమి పాలనలో చనిపోయారు.వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు.నారా లోకేశ్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి సవాల్నారా లోకేశ్‌కు సవాల్ విసిరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారుముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పుదుర్గయ్య నీతో చర్చకు సిద్ధం అంటున్నాడు..నువ్వు సిద్ధమా..?పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి..ఆ తర్వాత ఆ జీవో రద్దు చేశారునిన్న అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసిందిఅంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణంమీ కోన రవి, భరత్ ఇచిన సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన వారు..పీవీ సింధు ఒకటేనా...?నీతో చర్చకు జగన్ అవసరం లేదు...మా పేర్ని నాని వస్తున్నారునీకు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధమా..?చరిత్రలో ఎన్నడూ లేని అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుకోర్టులో ఉన్న అభ్యర్ధుల కేసులే నీకు ప్రశ్నలు..వాటికి సమాధానం చెప్పు లోకేష్టెట్ సమస్యపై మాతో పాటు ఉపాధ్యాయులు కేంద్రమంత్రిని కలిస్తే వేధింపులా...?టీచర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి...లేదంటే వారికి అండగా మేము ఉద్యమిస్తాండీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్సీపీశాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలుమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుమండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తినాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలుఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలుమండలి చైర్మన్‌కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తిఎల్నినోపై చర్చ అవసరం లేదా?ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేంఅసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండిపయ్యావుల పక్కనే లోకేశ్అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పయ్యావుల పక్కనే గప్‌చుప్‌గా కూర్చున్న లోకేశ్ లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరంమండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీతకౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్సమేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండిడీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదుప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాంఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలిమంత్రి లోకేశ్ రాజీనామా చేయాలిశాసన మండలిలో గందరగోళండీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంతిరస్కరించిన మండలి చైర్మన్సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం -
‘ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తావ్ చంద్రబాబూ?’
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వెన్నుపోటు పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మండలి సమావేశాల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నదే మా డిమాండ్. అందుకు కూటమి నేతలు సమాధానం చెప్పడం లేదు. కౌన్సిల్లో మేము చర్చకు రావాలని కోరాం. కానీ తప్పు చేసిన ప్రభుత్వం చర్చకు రాకుండా తోక ముడిచింది. చర్చకు రాకుండా సవాల్ చేయటం ఎందుకు?. డీఎస్సీ కమిషనర్‌గా ఇతర అధికారిని ఎందుకు నియమించ లేదు?అధికారులు లేక రాష్ట్రం ఏమైనా గొడ్డుపోయిందా?.కృష్ణా జిల్లా టాపర్ నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?. అతను ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది?. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. ఉద్యోగాలను అమ్ముకున్నట్టు వచ్చిన ఆడియో, వీడియో టేపులపై విచారణ ఏదీ?. వాళ్లను పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేవి కదా?.అందుకే మేము సీబిఐతో విచారణ చేయమని అడిగాం. గ్రూప్1 మీద కూడా సీబీఐతో విచారణ చేయించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంతమందిని వెన్నుపోటు పొడుస్తారు చంద్రబాబూ?.లక్షా 30 వేల ఉద్యోగాలను ఎలాంటి అక్రమాలు లేకుండా ఒకేసారి మా హయాంలో ఇచ్చాం. చంద్రబాబు 16 వేల పోస్టులకు అక్రమాలు చేశారు.ఈ మొత్తం వ్యవహారాలపై సీబిఐతో విచారణ చేయాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వం బెదిరించడం వల్లే డీఎస్సీ టీచర్లు కర్నూలు, విజయవాడలో ర్యాలీ చేశారు. ర్యాలీలకు రాకపోతే ఉద్యోగం తొలగిస్తామని బెదిరించారు. డీఎస్సీ అక్రమాలను రాజకీయ కోణంలో చూడవద్దు. అర్హులందరికీ న్యాయం జరగాలి. అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’అని స్పష్టం చేశారు. -
మేము ఏ చర్చకైనా రెడీ..! దమ్ముంటే రా... లోకేష్ కు బొత్స ఛాలెంజ్
-
దద్దమ్మ.. ఎద్దులా పెరిగితే సరిపోదు... అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్
-
మనిషి పెరిగితే సరిపోదు.. అచ్చెన్నకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఈ అంశంపై మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన క్రమంలో.. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిందే అని అన్నారు. ‘‘ఎద్దులా పెరిగితే తెలితేటలు రావు. మాటలు మంచిగా రావాలి. ఎరువులు లేకుండా రైతులు ఎలా చనిపోతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఛైర్మన్ పరిశీలించాలి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన అచ్చెన్నాయుడు.. కుర్చీలోంచి లేని బొత్స వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దద్దమ్మ అనడం అన్‌పార్లమెంటరీనా? అంటూ అచ్చెన్న గట్టి గట్టిగా అరిచారు. క్షమాపణలు చెప్పమంటే చెబుతానని.. దానికే అంతలా రియాక్ట్ కావాలా? అంటూ బొత్సను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనగా.. చైర్మన్ మళ్లీ మండలిని వాయిదా వేశారు.అంతకు ముందు.. డీఎస్సీ అక్రమాల పై సమాధానం చెప్పలేక మంత్రులు ఎదురుదాడికి దిగారు. పదేపదే వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను కించపరిచేలా మాట్లాడారు. -
మండలిలో బొత్స పై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
-
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి
సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనండీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ముగిసిన బీఏసీ సమావేశం.. నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. శాసనమండలి మీడియా పాయింట్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..నేడు ఏపీ చరిత్రలో చీకటి రోజునారా వారి స్కాంలో డీఎస్సీ స్కాం ఒకటిడీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వాయిదా తీర్మానం ఇచ్చాంవెన్నుపోటు పార్టీ సభను వాయిదా వేయించిందినారా లోకేష్ అసమర్ధుడు.. పనికిరాని వాడని వెన్నుపోటు పార్టీకి తెలిసిపోయిందిఅందుకే డీఎస్సీపై చర్చ జరగకుండా అడ్డుకున్నారువైఎస్ జగన్ ఒకే ఒక్క సంతకంతో లక్షా25వేల సచివాలయం ఉద్యోగాలిచ్చారు.పట్టుమని పదిహేను వేల ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది.సెప్టెంబర్ ఒకటి ప్రపంచ వెన్నుపోటు దినంచంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది సెప్టెంబర్ ఒకటినే.ఆరోజు నుంచి నేటికీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడుడీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో చర్చించేందుకు మేం సిద్ధంమీరెందుకు భయపడుతున్నారు?డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి ముగిసిన బీఏసీ సమావేశంనాలుగు రోజులు పాటు సమావేశాలు జరపాలని నిర్ణయం బీఏసీ సమావేశం..స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం.బీఏసీ భేటీకి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, విష్ణుకుమార్ రాజు, జీవీ ఆంజనేయులుఅసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేయనున్న బీఏసీమంత్రుల అసహనం..శాసనమండలి..డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక మంత్రుల అసహనంవైఎస్సార్సీపీపై, విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడుబొత్స సత్యనారాయణను దద్దమ్మ అంటూ నోరుపారేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడుగొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన అసెంబ్లీశాసన మండలి వాయిదా.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసనడీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మండలిలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..డీఎస్సీలో విచారణ జరిపించాల్సిందేడీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదుప్రభుత్వం పారదర్శకంగా ఉండాలిడీఎస్సీలో పారదర్శకత లేదుఅందుకే డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలిమూడు లక్షల మంది అభ్యర్ధులను ఏ రకంగా మోసం చేశారన్న విషయంపై చర్చ జరగాలిడీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారుప్రారంభమైన శాసనమండలి సమావేశాలుడీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, రామ చంద్రారెడ్డివాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభండీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ పట్టుడీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్సీలు నినాదాలుఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి కామెంట్స్..డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి.డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే లోకేష్ రాజీనామా చేయాలి.మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి.మంత్రి లోకేష్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడమేంటి?. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీస్పోర్ట్స్ కోటా పేరుతో డీఎస్సీలో అక్రమాలు చేశారు.మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే.కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు లోకేష్ కూడా చేయాలి. 👉ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ఏపీ డీఎస్సీ అక్రమాలపై పోరాటానికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సిద్ధమైంది. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.👉శాసన మండలిలో దీనిపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు రెడీ అయ్యారు. ప్రదర్శనగా శాసనమండలిలోకి ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్సీ లు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, రామ చంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. -
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో నేడు పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష శ్రేణులు, ప్రజలపై అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపలిల్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడటం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూడటం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.పౌరులకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, సమానత్వపు హక్కులు ఏ ముఖ్యమంత్రో ఇచ్చినవి కావని, అవి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం పూర్తి కాదని, ఎన్నికల మధ్య కాలంలోనూ ప్రజల గొంతుకు విలువ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి రక్షణ, ప్రతి అర్హుడికి సంక్షేమం అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర స్ఫూర్తి సాకారమవుతాయని అన్నారు. నిజమైన స్వాతంత్య్రం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లని చెప్పారు.పాలకుల అధికారం శాశ్వతం కాదని, కేవలం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే శాశ్వతమని గుర్తుచేస్తూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. సమాజంలో వివక్ష, అణచివేత, పేదరికం లేని వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి, వారి హక్కుల సాధన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఏపీలో బ్రిటిష్ పాలన కంటే దారుణ పరిస్థితులు: బొత్స
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలి. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతోంది. రాజకీయ కోణంలో చూసి సంక్షేమ పథకాలు అందించడం సరికాదు. మనవాడా.. కాదా అని చూసి సంక్షేమం అందించడం పద్ధతి కాదు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే కేసులు అన్నట్లుగా పాలన సాగుతోందని ఆరోపించారు.ప్రస్తుత పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. “ఇలాంటి స్వాతంత్ర్యం కోసమా మన పూర్వికులు పోరాడింది?” అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నేతల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, అవి రాజ్యాంగం కల్పించిన హక్కులని అన్నారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలని, అదే నిజమైన పరిపాలన అని పేర్కొన్నారు.రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని అన్నారు. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందాలని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లని, పేదరికం లేని రాష్ట్రం కావాలని సూచించారు. వైఎస్ జగన్ హయాంలో ఇదే లక్ష్యంతో పాలన సాగిందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. -
డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి,అమరావతి: ‘మెగా డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధమా’ అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నింంచారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవకతవకలపై సమాధానం చెప్పడంతోపాటు మంత్రి లోకేశ్‌తో రాజీనామా చేయించి, డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పోస్టుల పేరుతో లక్షల్లో బేరసారాలు జరిగిన ఫోన్ సంభాషణలు బయటకొచ్చినా ఆ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నింంచారు. ‘ఎవరు డబ్బులు అడిగారు. ఎవరితో మాట్లాడారు. ఎక్కడ బేరసారాలు జరిగాయన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డీఎస్సీ అవకతవకలపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. జీవోలు, కాల్ రికార్డింగులు, మెరిట్ లిస్టు జాబితాలు, తదితర అన్ని ఆధారాలతో ప్రభుత్వాన్ని శాసనమండలిలో నిలదీస్తాం. డీఎస్సీ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండాపోతోంది. బేరసారాలకు సీఎం చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అన్ని ఆరోపణలకు శాసనమండలిలో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే’ అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ‘రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైతు పెట్టుబడి పెట్టిన తర్వాత అకస్మాత్తుగా నీళ్లు ఇవ్వలేమని చెప్పడం సరికాదు. ముందుగానే పరిస్థితులను ప్రకటించి రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో పంటల బీమా ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన పీపీపీ విధానం కూడా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేదు. దానిపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఉద్యోగ సంఘాలు సమస్యలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బలహీన వర్గాల నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ అంశాలన్నింటినీ శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, వెన్నుపోటు పార్టీ నాయకులకు మాత్రమే అభివృద్ధి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. మేమే ప్రధాన ప్రతిపక్షం. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉన్నాయి. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం పోరాడతాం. బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చంద్రబాబు వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలి’ అని బొత్స సత్యనారాయణ కోరారు. -
మా అధినేత మాటల్లోనే మేము నడుస్తాం
-
“ప్రజా సమస్యలపై పోరాడతాం”.. వైఎస్ జగన్ వ్యూహంతో వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజా సమస్యలపై చట్టసభలో గళం విప్పాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టసభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీటింగ్ సారాంశాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు..డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని చట్టసభలో నిలదీస్తామని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.అభివృద్ధిపై వైఎస్సార్సీపీ విమర్శలురాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శలు చేసింది. ప్రజల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులపై కూడా సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాయని, వారి సమస్యలపై కూడా పార్టీ తరఫున మాట్లాడతామని తెలిపారు.ప్రతిపక్ష హోదాపై పోరాటంఅసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు.. మూడోది లేదు కదా. అలాంటిది 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అలాగని చట్టంలో ఉంటే డిస్క్వాలిఫై చేయాలని బొత్స కోరారు.‘‘రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నాం. ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఫేక్ పోలీసులతో నడిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం మన ఖర్మ. అందరి తరఫున అడుగుతాం. అన్ని ఆధారాలు చూపిస్తాం. అన్ని విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని బొత్స తెలిపారు. మండలి వరకే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై నిరసనగా వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ఇక మండలిలో పార్టీ తరఫున డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. -
ర్యాలీని అడ్డుకున్న పోలీసులకు ఇచ్చిపడేసిన బొత్స కూతురు
-
ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్
-
‘చట్టం ఏమైనా మీ చుట్టమా?’
విజయనగరం: నిరంకుశ పాలన సాగిస్తున్న కూటమి సర్కారును మరోసారి ఉతికి ఆరేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడితే అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. ‘కొత్త జీవోలో డైరెక్ట్‌గా ఉద్యోగాలు ఇచ్చే వెసులబాటు ఉందా లేదా అని అడుగుతున్నాం.. ఆటలు రాక పోయినా సర్టిఫికెట్లు ఇచ్చారు. లీకేజీ అయింది. అందులో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది.శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసన చేసేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకోవడం ఏంటి?, కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చట్టం ఏమైనా మీ చుట్టమా?, ఇదేనా కూటమి పరిపాలన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై గత 74 రోజులుగా తాము చేస్తున్న పోరాటాలతో పాటు ఈరోజు(సోమవారం, ఆగస్టు 10వ తేదీ) చేపట్టిన ఏపీ వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయన్నారు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు థర్డ్ పార్టీ విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స. -
ఎన్ని అడ్డంకులున్నా నేడు ర్యాలీలు ఆగవు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేస్తూ సోమవారం (ఆగస్టు 10న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వైఎస్సార్సీపీ చేపట్టనున్న ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రయోగించడాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు నిరాకరించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే హక్కును కూడా కాలరాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ ఉద్యమాలు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచాయి. అయినా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై శాంతియుతంగా గొంతెత్తితే పోలీసులతో అణిచివేయాలని చూడటం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం.నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు ఎన్నికలకు ముందు యువతకు పెద్దఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయకుండా మోసం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, యువత, ప్రతిపక్షంపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. డీఎస్సీ ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ కోరుతుంటే ప్రభుత్వం పోలీసు నోటీసులతో గొంతునొక్కుతోంది. అరెస్టులు, కేసులు, నోటీసులతో ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించలేరు. ఎన్ని ఆటంకాలు కల్పించినా సోమవారం వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీలు జరుగుతాయి. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పార్టీ వారి తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది. -
ముద్రగడ సంస్మరణ సభలో బొత్స స్పీచ్
-
అరుదైన నాయకుడు ముద్రగడ: వైఎస్సార్సీపీ నాయకులు
సాక్షి, కాకినాడ: ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు వైఎస్సార్సీపీ నేతలు. అరుదైన రాజకీయ నాయకుడు ముద్రగడ. ఆయనను స్పూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రగడకు ఎంతో గౌరవం ఉందన్నారు.నేడు కిర్లంపూడిలో మద్రగడ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, గుడివాడ అమర్నాధ్, కరణం ధర్మశ్రీ, తానేటి వనిత, వేణుగోపాల కృష్ణ, వంగా గీతా, దవులూరి దొరబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘ముద్రగడుకు ఆయనకు ఆయనే సాటీ. ఏ కార్యక్రమం చేసిన ఒక ధృడ సంకల్పంతో చేశారు. తాను చనిపోయాక ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులను ఒప్పించి సంస్మరణ సభ నిర్వహించాం. ముద్రగడ సంస్మరణ సభ రాజకీయ సభ కాదు. రాజకీయాల కంటే కాపు ఉద్యమంలోనే ముద్రగడతో నాకు ఎక్కువ సన్నిహిత సంబంధం ఉంది. ముద్రగడ ఒక శక్తి. రంగాను పోగొట్టుకున్నాము ముద్రగడను పోగొట్టుకోలేమని దాసరి ఆనాడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముద్రగడకు ఎంతో గౌరవం ఉంది.అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఏ విషయం తీసుకున్నారో దానిని సాధించుకునేంత వరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు. అరుదైన రాజకీయ నాయకుడు ముద్రగడ. పదవులు ఆయన్ను వరించాయి తప్ప.. ఆయన పదవుల కోసం పాకులాడలేదు. ముద్రగడ రాజీనామాలు స్పూర్తినిచ్చాయి. ముద్రగడను స్పూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలన్నారు.జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘రాజకీయాల్లో ముద్రగడ విలువలతో కూడిన శాసనం. ఆతిథ్యం పేరు చెబితే ఏపీలో ముద్రగడను మించిన వారు లేరు. ముద్రగడ కోసం ఎంత మాట్లాడిన తక్కువే. పట్టుదల విషయంలో ముద్రగడ ఆయనకు ఆయనే సాటి. కాపు నేతగా ముద్రపడ్డా.. కులాలకు, మతాలకు అతీతంగా ముద్రగడ రాజకీయాలు చేశారు. ముద్రగడ లేరు అనే బాధ ఎక్కువగా ఉంది. ముద్రగడను అనుసరించిన ఆయన ఇల్లాలు పద్మావతికి నమస్కారం. ముద్రగడ ప్రతీ ఉద్యమంలో ఆయన సతీమణీ పద్మావతి ముద్ర ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
జైలులో సీదిరి కుటుంబంతో బొత్స
-
‘నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు’
సాక్షి, విజయనగరం: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ఆటలాడుతోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జీవోలు ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు’’ అని బొత్స నిలదీశారు.‘‘డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకత లేదు. కేంద్రంలో కూడా నీట్ పరీక్షలు లీక్‌పై ఇలాంటి కబుర్లు చెప్పారు. అక్కడ ఏమైంది?. విద్యా దీవెన పథకం వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. వైఎస్ జగన్ ఇస్తామంటే ఎన్నికలు వచ్చాయని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. అందుకే బకాయి ఉంది. అవి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? లేదా?..స్పోర్ట్స్ కోటాలో నచ్చిన వ్యక్తులకు డీఎస్సీలో నచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామకాలు అయిపోయాక ఆ జీవోను రద్దు చేశారు. ఏ ఒక్కరికి అయిన నిరుద్యోగ భృతి ఇచ్చారా?. విద్యార్థులు, నిరుద్యోగులను వేదిస్తున్నారు. నాడు-నేడు స్కూళ్లను కొనసాగించాల్సిన బాధ్యత లేదా?. పిల్లలు చెట్లు కింద చదువు కుంటున్నారు. ఎంత అప్రతిష్ట.. ఒక పక్కన విద్యాదీవెన లేదు, నిరుద్యోగ భృతి లేదు, డీఎస్సీలో అక్రమాలు.. ఇంత దారుణమా?..భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ఏమైనా ఉద్దారించారా?. విభజన చట్టం ప్రకారం భోగాపురం ఎయిర్ పోర్ట్‌కి అనుకూలమని కేంద్రం అనుమతులు ఇచ్చారు.. ఎయిర్‌పోర్ట్‌కి చంద్రబాబు 15 వేలు ఎకరాలు కావాలని అన్నారు. ఆ తరువాత 5 వేల ఎకరాలు లాక్కోవాలని చూశారు. మేం పోరాటం చేసాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక 2203 ఎకరాలకు కుదించి అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి...విజయవాడ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా విస్తరణ పూర్తి చేయలేదు. ప్రధాని మోదీ పర్యటన తరువాత భోగాపురంలో మేము సభ పెట్టి అన్ని వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. ఎయిర్పోర్ట్ భూసేకరణ చేయలేకపోయారు. జిల్లా వైఎస్సార్సీపీ ఆఫీస్ విషయంలో అశోక్ గజపతి రాజు జోక్యం చేసుకోవడం తగదు. గురివింద గింజ సామెత గుర్తు పెట్టుకోండి.. మీ గౌరవం కాపాడుకోండి’’ అని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
మహిళలకు భద్రత ఇవ్వలేని చెత్త ప్రభుత్వం.. కూటమి పై బొత్స కూతురు ఫైర్
-
వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)
-
‘కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది’
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సైతం తల్లికి వందనంలో కోత విధించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీరు చెప్పిన మాటలకు బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులకు ఏమైనా సంబంధం ఉందా?.బడ్జెట్లో కేటాయింపులకు ఎంత మార్చారు. ఎంత రిలీజ్ చేశారో దేవుడికే తెలియాలి. కూటమి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది.. మోసం చేస్తోంది. తొలి ఏడాదిలోనే అమ్మకు వందనం డబ్బులు ఎగ్గొట్టారు. ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్ధుకుంటుందనే చెబుతున్నాం. విద్యార్థుల తల్లులు చెప్పిన మాటలనే మేం మాట్లాడుతున్నాం’అని అన్నారు. -
మీకు దండం పెడుతున్న... ముద్రగడ మరణంపై బొత్స ఎమోషనల్
-
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతల దిగ్భ్రాంతి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్సీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి పట్ల బొత్స సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పోరాటం అద్భుతమని చెప్పారు. కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.వైవీ సుబ్బారెడ్డి సంతాపం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుజూపూడి ప్రభాకరరావు దిగ్భ్రాంతిముద్రగడ పద్మనాభం మృతిపై దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రముఖ ప్రజానేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సంతాపంకాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం పట్ల మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ప్రజల కోసం,ప్రత్యేకించి కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.రాజకీయాల్లో ఆయన నిబద్ధత,నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా,ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు వెలంపల్లి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుముద్రగడ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుముద్రగడ్డ పద్మనాభం మరణవార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, నగర రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ నగరంతో ముద్రగడ్డ పద్మనాభంకు దశాబ్దాల కాలంగా ఎంతో విడదీయరాని, ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత తరం నాయకుల్లో ఆయనలాంటి నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని చూడటం చాలా అరుదు అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మి, దానికి కట్టుబడి జీవించిన ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతి వైఎస్సార్సీపీకితీరని లోటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక మంచి ఉద్యకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. కేకే రాజు సంతాపంముద్రగడ పద్మనాభం మృతిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు సంతాపం తెలిపారు. రాష్ట్రం అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ జీవిత కాలం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.-- -
బారికేడ్లు పెట్టి పోలీసులు ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన బొత్స
-
ఇది విజయనగరం ఆత్మగౌరవం గవర్నర్ కు బొత్స లేఖ
-
ఏపీ గవర్నర్‌కు బొత్స లేఖ..
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ గురజాడ-విజయనగరం తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బొత్స సత్యనారాయణ తన లేఖలో కోరారు.జేఎన్టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు బొత్స లేఖ రాశారు. ఈ లేఖలో బొత్స.. స్నాతకోత్సవానికి ఆహ్వానం అందించినందుకు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయనగరం జిల్లా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయని లేఖలో తెలిపారు.ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రజల గౌరవం, ఆనందం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగర ప్రజల అభిప్రాయాలను గౌరవించి, జేఎన్టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని గవర్నర్‌ను కోరారు. విజయనగరం ప్రజల అసంతృప్తి, నిరసనలను ఈ లేఖ ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకువస్తున్నట్టు బొత్స తెలిపారు. -
గల్లంతైన మత్స్యకారులలో ఒక్కరి ఆచూకే లభించింది: బొత్స
విశాఖ: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతు కావడం బాధాకరమని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో.. కేవలం ఒక్కరి ఆచూకీ మాత్రమే లభించిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ని కనుగొనాలని అన్నారు. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాగా, వైఎస్సార్సీపీ నేతల బృందం ఆదివారం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి పరిశీలించింది. బాధిత మత్స్యకార కుటుంబాలను విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైసీపీ నేతలు పరామర్శించారు.ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ‘‘గల్లంతయిన వారికోసం ప్రభుత్వం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా చేయాలి. సమాచారం అందిన వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే మత్స్యకారుల ఆచూకీ దొరికేది. బాధిత మత్స్యకార కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని మత్స్యకారులు చెబుతున్నారు’’ అని తెలిపారు. -
జర్నలిస్టులు ప్రశ్నిస్తే కక్ష సాధింపులెందుకు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం, పాలనను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఇందుకు నిదర్శమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మండిపడ్డారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తద్వారా మహిళల్ని చంద్రబాబు కించపర్చారని ఆయన ఆక్షేపించారు. మీడియా సమావేశంలో బొత్స ఇంకేమన్నారంటే..ప్రశ్నించిన వారిపై కూటమి సర్కార్ కక్షసాధింపులుఅసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపులకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లాకప్ డెత్ లు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో జనం నరకం అనుభవిస్తున్నారు. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. యూరియా దొరకని పరిస్ధితులు ఉన్నాయి.ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వ్యక్తుల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, అసలు హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారు. జరిగిపోయిన వాటికే మళ్లీ మళ్లీ శంకు స్థాపనలు, భూమిపూజలు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యల్ని మాత్రం గాలికొదిలేశారు. రెండేళ్ల పాలన దాటిపోయింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేశామని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా ? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో శంఖుస్ధాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మళ్లీ భూమిపూజలు చేస్తున్నారు.రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారుఎంతసేపూ వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకం అమలు చేయలేదు. ఈ డబ్బంతా ఎటు పోయిందో తెలియదు. మహిళల్ని బస్సులు ఎక్కించారు కానీ సున్నా వడ్డీలు మాత్రం ఎగ్గొట్టారు. ఆ బస్సులు సైతం స్ధానికంగా తిరగడానికి మాత్రమే, దూర ప్రాంతాలకు కాదు. కేంద్ర విద్యా మంత్రి స్కూళ్లకు వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి ప్రశంసించారంటే కారణం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే.కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇంకా స్కూల్ కిట్లే ఇవ్వలేదు. అమరావతిలో అవినీతి జరుగుతోంది, మావిగనే మా విధానం అని మా నాయకుడు వైఎస్ జగన్ చెప్పారు. అది నిజం. రాజధాని అంటే హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఎన్ని లక్షల చదరపు మీటర్లో ఉందో చూడండి. అంత పెద్ద రాజధాని. అమరావతి మాత్రం గీత గీసుకుని కూర్చున్నట్లుంది. అందుకే మావిగన్‌ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు.మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించే తీరిక లేదా?గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందంటే మేం అంతా సంతోష పడ్డాం. కానీ ఇప్పుడు ఆమె రాష్ట్రానికి వస్తే స్వాగతం చెప్పకపోవడానికి ముఖ్యమంత్రి వెళ్లకపోవడం మహిళల్ని కించపర్చడం కాదా? రాష్ట్రపతిని స్వాగతించి వెళ్లిపోవచ్చు కదా. గవర్నర్, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం కచ్చితంగా వెళ్లాలి. ఆరోగ్యం బాగోలేకపోతే అది వేరు. కానీ రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు వెళ్లలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడి ఉపముఖ్యమంత్రి మీటింగ్‌లో ఉన్నారు.రాజ్యాంగ పదవిలో ఉన్న వారు వచ్చినప్పుడు గౌరవించాలన్న మర్యాద కూడా లేదు. వీళ్లు రాష్ట్రం గురించి, న్యాయం, ధర్మం గురించి, గౌరవాల గురించి బాధపడిపోతూ ఉంటారు. పాలన గాలికొదిలేసి ఎంతసేపూ కక్షసాధింపులకు దిగుతున్నారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోవాలి కానీ భావప్రకటన స్వేచ్ఛనే కాలరాస్తామంటే ఎలా ? అవే మాటలు మనం మాట్లాడితే ఒప్పు, ఇతరులు మాట్లాడితే తప్పంటే ఎలా ? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి? గవర్నర్ పదవే ఆయనకు చివరిది. రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవం ఎందుకు తగ్గించుకుంటున్నారు? చంద్రబాబు విశాఖలో సింగపూర్ టౌన్ షిప్‌ను అక్కడి మీ పార్ట్‌నర్స్‌తో కడతారా లేక అక్కడి ప్రభుత్వంతో కడతారా చెప్పాలి. గతంలో అమరావతిలో సింగపూర్ సహకారంతో ఏదో చేస్తానన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రభుత్వాన్ని అడిగితే మాకూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు సింగపూర్ టౌన్ షిప్ ఎవరి సహకారంతో చేపడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నమోదు 36 శాతం దాటలేదు కాబట్టి, గడువు మరో నెల పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. -
గుర్తుపెట్టుకో... చేసిన దానికి అనుభవించక తప్పదు..!
-
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
-
రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రభుత్వ అతిధి గృహంలో బస చెయ్యాలి. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?. ఇది ప్రైవేట్ సంస్థకి దోచి పెట్టడం కాదా?. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు లేవా?. ఈ నిర్ణయం మన ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వ భవనాలను రాష్ట్రపతి వాడుకోవాలి. అవసరం అనుకుంటే భవనాలను ఆధునీకరణ చేసుకోవాలి. మన దేశం పరువు, ప్రతిష్ట ఏం కావాలి అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉందని.. మాపై కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీతో పాటు, పోలీసుల మీద కూడా దాడి జరిగింది. మా పార్టీ నేతలపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో ఆటవిక పరిపాలన చేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై హత్యా ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా కొట్టారు. ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మధ్య ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. అమరావతికి వెళ్తే తప్పేంటి?. రాజకీయ విమర్శలు చెయ్యాలనుకుంటే చేయండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు బయట పడతాయని భయంతో ఉన్నారు. అమరావతి దోపిడీని చూస్తే తప్పేంటి?. దోపిడీ కాదు అమరావతిలో జరుగుతుంది అభివృద్దే అనుకుంటే మీకు భయమెందుకు?. ప్రభుత్వం మీ చేతిలో ఉందని మా నాయకులపై కేసులు పెడుతున్నారు.మన సంస్కృతికి విరుద్దంగా చీచుల్లో బార్లు పెడుతున్నారు. ఎయిర్పోర్టుల్లోనూ ప్రభుత్వం బార్లు ఓపెన్ చేస్తున్నారు. విదేశీ సంస్కృతి వేరు.. మన సంస్కృతి వేరు. బార్లు పెట్టడమే సంపద సృష్టా?. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం సబ్సిడీ మీద మామిడి కొంటుంది. మీరు దేనికీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అన్ని పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అనే నాడుడి బాబు సార్ధకం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట నష్టపోయేది రైతులే. మీకు ఓటేసిన పాపానికి ఇదేనా మీ పాలన. కూటమి నేతలు మాట్లాడితే అవి సూక్తులు.. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ సమయం ఆసన్నం అయ్యింది. విశాఖలో విలువైన భూములన్నీ పప్పు బెల్లల్లా పంచేస్తున్నారు. ఉపాధి కల్పన ఎక్కడా లేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకి దారి లేదు.. నీరు లేదు. అలాంటి విమానాశ్రయంలో బారు పెడతా అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే మళ్ళీ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మా నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి రైతులు వారి సమస్యలు మాకు చెప్పుకున్నారు. అమరావతి రావాలని ఇబ్బంది పడ్డ రైతులే ఆహ్వానించారు. ‘మావిగన్’ మా విధానం అని స్పష్టం చేశారు. -
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
-
ఆస్పత్రిలో ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.ముద్రగడ అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.ఈ సందర్భంగా నాయకులు ఇద్దరూ ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును అక్కడి వైద్యులను అడిగి ఆరా తీశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే. -
ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదు: బొత్స
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఆదివారం వైఎస్సార్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విశాఖ, తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. నేటి సమావేశం తమ బాధలు పంచుకోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండేందుకేనని చెప్పారు.‘‘ఎక్కడ సమస్య వస్తే నాయకులమంతా అక్కడికి వెళ్తాం. చట్టానికి మేం వ్యతిరేకం కాదు. మేమంతా చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయాల్లో రివేంజ్ నిర్ణయాలు పనికిరావు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కుల్ని కోరుతున్నాం. కాపులకు 3.000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కాపునేస్తం ఇచ్చాం.. ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు సహకారం అందించాలి. ఉన్న వాటిని తీసేస్తే ఊరుకునేది లేదు. రానున్న రెండు-మూడేళ్లలో కాపు జాతికి గౌరవం పెరిగేటట్టు ప్రయత్నించాలి. ఇది పార్టీలకు పరిమితం కాదు. రాజకీయ పార్టీలో గౌరవం కోరుకుంటాం. కూటమి పార్టీలో కాపులకు అది దక్కటం లేదు. కులంలో ఉన్న వారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడటం సరికాదు.. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదు. ముద్రగడ కూడా సమావేశానికి హాజరు రావాల్సి ఉంది. ఆరోగ్యం బాగాలేక రాలేదు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని తీర్మానంగా రూపొందించాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ముందుకు వచ్చినా అందరూ కలిసి అక్కడ వెళ్లి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు 50 వేల రూపాయలు చొప్పున వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి అందించాలి. రాజకీయం కాదు ఒక కుటుంబానికి అందించే సాయం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటివరకు చంపిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఇదే వేరే కులంలో జరిగితే ఊరుకుంటారా. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇస్తుంది. మేము మీకు అండగా ఉంటాము అని కాపులందరికీ భరోసా కల్పిస్తుంది’’ అని బొత్స తెలిపారు. సమావేశంపై ఆరోపణలుసమావేశంలో రూపొందించిన తీర్మానాలను సభకు కురసాల కన్నబాబు వివరించారు. ముద్రగడ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నారు. ఈ సమావేశం గురించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే కాపులను చీల్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొందరు ఆరోపణ చేసేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘నాకు మహిళల పట్ల గౌరవం ఉంది. ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో మాత్రమే మాట్లాడాను. మహిళలందరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు. ఎక్కువగా కుల ప్రస్తావన చేసింది పవనే’’ అని తెలిపారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి : బొత్స
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు. ఆధారాలతో సహా మేం చెబుతున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేపర్ సెట్ చేసిన దగ్గర్నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ అంతా అక్రమమే. డీఎస్సీని పూర్తయ్యాక మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం ఆవనాయితీ కానీ ఎక్కడా మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదు.ఆరోపణలు విమర్శలు వచ్చాక లిస్ట్‌ను వెబ్సైట్లో పెట్టారు. నేనే సాక్ష్యం. స్వయంగా నేను నలుగురు డీఈవోలతో మాట్లాడా.తప్పు జరగనప్పుడు దాపరికం దేనికి. ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇలా చేశారు. పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. క్లబ్‌లలో ఆడే పేకాట బ్రిడ్జి గేమ్‌ను కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారు. బ్రిడ్జి గేమ్‌ను గత ప్రభుత్వం పెట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయండి. అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. సీబీఐ విచారణతోనే అక్రమాలు బయటపడతాయి. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. సమగ్రవిచారణ జరిపించాలని గవర్నర్ ను కోరాం. విద్యార్ధుల భవిష్యత్, మనోభావాలాతో ఆడుకోవద్దని ఒక సెక్షన్ మీడియాను కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై ఎలాంటి నమ్మకం లేదు.అవసరమైతే అధికారులు రండి. మేం చర్చకు సిద్ధం. సిబిఐ విచారణ జరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తాం. లోకేష్‌వి పిల్ల చేష్టలు. మంత్రిగా ఉండి లోకేష్ మాట్లాడే మాటలు సరికాదు. మీ ఇంటికొస్తాం..మాకు 200 మీటర్లేనని లోకేష్ మాట్లాడుతున్నారు. గతంలో ఇదే మాట మాట్లాడిన జోగి రమేష్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు.గవర్నర్ ఇంటి ముందే మేం ఉన్నాం..రమ్మనండి లోకేష్‌ని. అవగాహనలేని మాటలతో చేసేవన్నీ పిల్లచేష్టలే.మేం మొదటి నుంచి మంత్రి లోకేష్ ను డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ పై స్పందించాలని కోరాం. ఇన్నాళ్లకు లోకేష్ గుర్తొచ్చిందా. 2004లో మంత్రిగా ఉన్న నాపై వోక్స్ వ్యాగన్ డబ్బులు తినేశారని ఆరోణలు వచ్చాయి. సీబీఐ విచారణ జరిపించాలని మేమే కోరాం. ఆరోజు సిబిఐ విచారణ జరిగింది కాబట్టే మేం ఆరోపణల నుంచి బయటపడ్డాం. అందుకే డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ కోరుతున్నాం. లాకప్ డెత్ ..విషయంలో పార్టీలు కాదు..మానవత్వం చూడాలి. ఒక అధికారిని బలిచేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఈ హత్యకు కారకులైన అందరినీ శిక్షించాలి. గాదె సాయికృష్ణ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి’అని డిమాండ్ చేశారు. -
లోకేశ్‌కు అందుకే ఆ శాఖ అప్పగించారా?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.‘‘విద్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్‌కు ఆ శాఖ అప్పగించారా? ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉందా? కూటమి ప్రభుత్వ వెన్నుపోట్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్లలో ఏదో సాధించినట్లు వెన్ను పోటీ పార్టీ చెప్పుకుంటోంది. ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా? సూపర్-6, సూపర్-7 పథకాలు అన్నారు.. ఏమయ్యాయి?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘ఏపీలో ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చాలా బేల మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడపమంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, ప్రజలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోరాటంలో పాల్గొన్నారు.. పార్టీ నాయకులు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఆడబిడ్డ నిధి పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. బంగారు కుటుంబం అన్నారు.. ఇత్తడి కుటుంబం కూడా లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలకు ఇంతటి ప్రజాధరణ వచ్చింది. అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న దళారులు బాగుపడుతున్నారు.సామాన్యులు కొనే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేశ్ ఛాలెంజ్ లు దేనికి విద్యా శాఖను బాగు చెయ్యడానికా? నాశనం చెయ్యడానికా..? పాఠశాలల ప్రారంభం నాటికే పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ రంగానికీ మంచి జరగడం లేదు. రైతుకు మద్దతుగా ధర లేదు. జొన్న, మామిడి వంటి వాటికి కూడా ధర లేదు. మా హయాంలో ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా చేశాం. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది.. ఆక్వా రంగంలో ఉన్న వారు కూడా రోడ్డెకుతున్నారు. ఇది వెన్నుపోటు పార్టీ విధానం’’ అన్నారు.మాధవ్‌వి తప్పుడు వ్యాఖ్యలు.. ఇక పవన్‌వి..ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘మీ కేంద్ర మంత్రే మా వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి మాటలు అబద్దమా..? లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రధానిని స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగారు.. పవన్ కల్యాణ్.. ఒకరోజు తెలంగాణ.. మరో రోజు ఏపీ అంటారు.పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు రెండేళ్లలో చేశారు. మా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేదు. డీఎస్సీని నిర్వహించలేని ప్రభుత్వం ఇది. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పాదర్శకంగా ఇచ్చాం.. నేనే మానిటరింగ్ మినిస్టర్ గా ఉన్నాను గర్వంగా చెబుతున్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా యూరియా దొరకడం లేదు. ఒడిశా నుంచి యూరియా తెచ్చుకొని దాచుకుంటున్నారు. అది కూడా అధిక ధర రూ. 600 కు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైతులు చెప్పిన వాస్తవాలు ఇవి. భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని రైతులు భయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం.. టీడీపీది వెన్నుపోటు పార్టీ’’ అని తెలిపారు. -
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం వెనుక కుట్ర కోణం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు జరుగుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం జరిగిందని, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపును ఆపాలని కోరారు. విశాఖ కేజీహెచ్‌లో మృతుల కుటుంబ సభ్యులను మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైఎస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖ వస్తున్నారని చెప్పారు.వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి, అనంతరం ప్లాంట్ యూనియన్ నేతలతో మాట్లాడతారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ నేత రవిరెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం దురదృష్టకరం : బొత్స సత్యనారాయణ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్¯హిల్స్ ఆస్పత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆస్పత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వారి తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్లను ఆపాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. కార్మికుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ తరఫున రాజీలేని పోరాటం చేస్తాం.లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు మృతిచెందిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్... సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. రాజకీయం చేస్తున్నారా మీరు..? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా..?అంటూ మంత్రి మాట్లాడడం దారుణం. తోటి కార్మికులు చనిపోయారనే బాధ, ఆవేదనతో కార్మికుల పక్షాన ప్రశ్నించినందుకు కార్మిక సంఘాల నాయకులతో లోకేశ్ మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. అధికారంలో ఉన్న వారికి ఓపిక, సహనం, బాధ్యత ఉండాలి కదా..? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక సంఘాల నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం. ఇంత పెద్ద ఘటన జరిగితే సీఎం చంద్రబాబు స్పందించకపోవడం, పరిహారం ప్రకటించకపోవడం మరింత బాధాకరం. శోకసంద్రంలోనూ అబద్ధాలే..లోకేశ్, పవన్ దిగజారుడు వ్యాఖ్యలువిశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న వైఎస్సార్సీపీ ప్లాంట్ పరిరక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక కార్మికుల తొలగింపు, ఆంక్షలు, వేతన కోతలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం 8 మంది కార్మికులను బలితీసుకుని.. యావత్ దేశాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది. ఇంతటి విషాదంలోనూ టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే పాకులాడారు. పరామర్శల పేరుతో ప్లాంట్ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ విషాద సమయంలోనూ అబద్ధాలతో రాజకీయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్‌ప్లాంట్‌ని అమ్మేయాలని చూశారని.. తాము అధికారంలోకి వచ్చాకే విశాఖ ఉక్కును కాపాడామని నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. వారి మాటల్ని విన్న ఉక్కు కార్మికులు ‘చంద్రబాబు తరహాలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం వీళ్లకూ అలవాటైనట్టు ఉంది’ అంటూ చర్చించుకోవడం కనిపించింది. అసెంబ్లీలో తీర్మానం చేసిన వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన అలుపెరగని పోరాటం విశాఖ ఉక్కు కార్మికులందరికీ తెలిసిందే. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న వెంటనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యల్ని వాయిదా వేసుకుంది. ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు, సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయిస్తే ప్లాంట్ దానంతట అదే నిలబడుతుందని ప్రధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే లేఖలు రాశారు. తమ ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణను ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉక్కు కవచంలా నిలబడింది. ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, ఇప్పుడు ఉక్కు పరిరక్షణను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వచ్చాకే.. పతనం అంచుకు.. ‘మేం వచ్చి ప్లాంట్‌ను కాపాడాం’ అని గొప్పలు చెబుతున్నా.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పతనం అంచుకు చేరుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లు, ఉత్పత్తి యూనిట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీశారు. దశాబ్దాలుగా ఉక్కు కర్మాగారాన్నే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేశారు. ఉన్న కార్మికులపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా.. ఇచ్చినా 50 శాతం కోతలు విధిస్తూ ఉద్యోగులు, కార్మికుల పొట్టగొట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ నిపుణులైన ఉద్యోగుల్ని, అధికారుల్ని వేధింపులకు గురిచేశారు. ఇలా.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, కార్మికుల పట్ల ఉన్న చిన్నచూపు కారణంగానే స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆరి్థక, మానసిక సంఘర్షణ నడుమ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. శోకసంద్రంలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన కూటమి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడాన్ని కార్మికులు తప్పు పడుతున్నారు.‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మేం రోడ్లపైకి వచ్చి కొట్లాడాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆగింది’ – డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకుంది’ – మంత్రి నారా లోకేశ్ -
కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్ చర్యలను ఆపాలి’’ అన్నారు.మంత్రి లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్‌కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. -
స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ
-
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
డీఎస్సీ ‘మెగా’ మోసం!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తప్పిదాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలతో సహా డీఎస్సీ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు. ‘ఫస్ట్ ర్యాంకర్‌కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? డీఎస్సీ–2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?’ అని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. గతంలో డీఎస్సీ మెరిట్ లిస్టులు కలెక్టర్ కార్యాలయాల్లోనే వెరిఫై చేసేవారని, ఈదఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్‌లు పంపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. డీఎస్సీలో డొల్లతనంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు వెలువడటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ దీన్ని ఎండగట్టడం.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ఉలిక్కిపడిన బాబు సర్కారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి తూతూమంత్రంగా ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొనే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలను సర్వత్రా నిలదీస్తుంటే విద్యాశాఖ మంత్రి మాత్రం అంతా పారదర్శకమని తన ‘ఎక్స్’ ఖాతాలో బుకాయించడం విస్మయం కలిగిస్తోందన్నారు. మెరిట్ కలిగి ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులను బుజ్జగించేందుకు విద్యాశాఖ మంత్రి రాజకీయాలు చేయడం ఏమిటన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా అదే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అంటూ పాలసీ, జీవోలను సవరించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.తప్పించుకునేందుకు ‘శాప్’ ఆపసోపాలు..ప్రభుత్వం వివరణ: శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవం, నిరాధారమైనవి.ఇదీ వాస్తవం: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులు పొందారని, అనర్హులకు పోస్టుల దక్కాయని.. అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిదంటూ ఎందరో అభ్యర్థులు ‘శాప్’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమాచార హక్కు–2005 ప్రకారం అర్హులైన అభ్యర్థులు కోరిన సమాచారాన్ని ‘శాప్’ ఇంత వరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఏదైనా నోటిఫికేషన్ తర్వాత పోస్టు భర్తీ చేస్తే ఆ పోస్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఉద్యోగి ఏ అర్హతతో ఉద్యోగం పొందారో సమాచారం ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. దీనిని శాప్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? టీచర్ పోస్టులకు బేరాలు పెడుతూ నంబర్‌తో సహా ఫోన్ కాల్ రికార్డింగ్స్ బహిర్గతమైతే వాటిపై శాప్ విచారణ చేయడం మానేసి మౌనం దాల్చడం వెనుక మతలబు ఏమిటి?ప్రభుత్వం వివరణ: 3,600 మంది అభ్యర్థులు దాఖలు చేసుకున్న 5,326 దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించి పోస్టులు భర్తీ చేసింది.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులైన డీఎస్డీవోలను ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా తయారీ వరకు ఎందుకు కొనసాగించలేదు? ప్రాథమిక ఎంపిక జాబితాను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ప్రదర్శిస్తే కచ్చితంగా అభ్యంతరాలు వచ్చేవి. కానీ శాప్‌లో ఒక్క అభ్యంతరం కూడా ఎందుకు నమోదు కాలేదు? అంటే, అసలు ప్రాథమిక జాబితా ప్రదర్శించకుండానే తుది జాబితా సిద్ధం చేసేశారు. చివరికి ఫలితాల రోజు అనర్హురాలైన విజయనగరానికి చెందిన ఓ క్రీడాకారిణికి ఉద్యోగం రావడం గమనించి అర్హులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే శాప్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షిలో ‘డీఎస్సీ డీల్స్’ కథనం వెలువడగానే సదరు క్రీడాకారిణిపై విచారణ చేస్తున్నట్లు శాప్ పేర్కొంది. ఇప్పటికీ నెల రోజులు దాటినా విచారణ ఎందుకు ముగించడం లేదు? అంటే ప్రభుత్వమే వాస్తవాలు బయటపడకుండా అడ్డుకుంటోంది కదా!తాను ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు తెలిపిన నవీన్ సర్కారు అబద్ధాల వివరణలపై అభ్యర్థుల మండిపాటు..డీఎస్సీ–2025లో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా ప్రకటించిన పి.నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి డీఎస్సీలో ప్రశ్నలను ఆన్లైన్ చేసే బాధ్యతలు అప్పగించారు. డీఎస్సీ ఫలితాల అనంతరం అతడికి టాప్ ర్యాంకులు వచ్చాయని గుర్తించిన అధికారులు మొత్తం ఎంపిక ప్రక్రియనే మార్చేశారు. అబద్ధాల వివరణలతో ప్రభుత్వం వరుసగా కట్టు కథలు వినిపిస్తోందని టీచర్ అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న పలు సందేహాలు, ప్రభుత్వ వివరణలు ఇలా ఉన్నాయి..!ప్రభుత్వం వివరణ: డీఎస్సీ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి.నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నింటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతడిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినా వెరిఫికేషన్‌కు హాజరు కాలేదు. ఇదీ వాస్తవం: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26న కాల్ లెటర్లు విడుదల చేశారు. వీటిని ఆయా అభ్యర్థులు తమ డీఎస్సీ నంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే, నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తారా?ప్రభుత్వం వివరణ: నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు.ఇదీ వాస్తవం: నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడో చెప్పలేదు. తాను డీఎస్సీ ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశానంటూ కోర్టుకు ఇచ్చిన పిటిషన్లో అతడు పేర్కొన్నాడు. మరి వ్యక్తిగత కారణాలతో ఎప్పుడు రాజీనామా చేశాడు?ప్రభుత్వం వివరణ : డీఎస్సీ రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డుల నుంచి తొలగించాం. ఇదీ వాస్తవం: అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతడి ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలంపాటు సాగిన డీఎస్సీ ప్రక్రియలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్‌ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్‌లో మొదటి ర్యాంకు, జోన్–2 టీజీటీలో ఆరో ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతడికి పోస్టు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడికి పోస్టు కేటాయింపును రద్దు చేశామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు?ఉర్దూ మీడియం పోస్టుల్లోనూ తప్పిదాలు..!ప్రభుత్వం వివరణ: అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ) రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని, ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ గల మెరిట్ అభ్యర్థిని నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. ఇందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదు.ఇదీ వాస్తవం: అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించారు. ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్టు ఇవ్వాలి. కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ(షేక్) వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపిక అయిన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డీఎస్సీల్లో ‘బీసీ’గా నమోదు చేసుకున్నాడు. 2025 నాటికి ‘ఓసీ–ఈడబ్ల్యుఎస్’గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డీఎస్సీలో ఓసీగా ఎలా మారిపోయాడు?ఇదేనా పారదర్శకత?డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే నిజమైతే టెట్ మార్కుల సవరణకు పలు పర్యాయాలు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి మెరిట్ జాబితాను విడుదల చేశాక సవరణతో రెండోసారి జాబితా ఎందుకు ఇచ్చారు? అనంతరం వాటిని ఆన్లైన్ నుంచి తొలగించి నేరుగా ఎంపిక జాబితాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎంపికైనట్లు కొందరు అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపి, ఆ తర్వాత కాదని చెప్పడం నిజం కాదా? అమరావతిలో వేడుకలకు ఆహ్వానించి ఆ తర్వాత మీరసలు టీచర్ పోస్టులకే ఎంపిక కాలేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? జూలై–2024 టెట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారిని డీఎస్సీ కన్వీనర్‌గా నియమించామని చెబుతున్నారు. మరి ప్రారంభంలో ఆయనకే బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? అప్పటికే ఉన్న డీఎస్సీ కన్వీనర్‌ను ఎందుకు తొలగించారు?ప్రభుత్వం వివరణ: క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఇచ్చాం.ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అత్యంత రహస్యంగా సాగింది. ఇందులో ఎక్కడా క్రీడా సంఘం, ఫెడరేషన్‌కు సంబంధించిన వ్యక్తులు లేరు. శాప్ తయారు చేసిన తుది జాబితా లిస్టు ప్రకారం ఆయా క్రీడా సంఘాల నుంచి సమ్మతి లేఖలు తీసుకుని ‘మమ’ అనిపించింది. జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీలో ఫెడరేషన్లకు చెందిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేపట్టడం ఆనవాయితీ. క్రీడాకారుల టీమ్ ఫొటోలు, మెడల్స్ లాంటివి స్వయంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? డిగ్రీ లేకున్నా ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అనర్హులు టీచర్ ఉద్యోగాలు పొందారు. ఆ డిగ్రీలకు సంబంధించి శాప్ ఇతర రాష్ట్రాల వర్సిటీలను ఎందుకు సంప్రదించలేదు?ప్రభుత్వం వివరణ: మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశాం.ఇదీ వాస్తవం: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా 97 శాతం పోస్టులు నింపేశారు. డీఎస్సీ ముగిసిన 8 నెలల తర్వాత క్రీడా పాలసీ, 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ హఠాత్తుగా ఎందుకు మారింది? ఈ డీఎస్సీలో రాత పరీక్షల అవసరం లేకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఆయా శాఖలు నిర్వహించే రాత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాలని ఎందుకు సవరించారు? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం తప్పయితే.. 2025 డీఎస్సీ పూర్తిగా తప్పిదమే. అది సక్రమమే అయితే.. ఇప్పుడు రాత పరీక్షను తప్పనిసరి ఎందుకు చేశారు? కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీ పోస్టును భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్ పోస్టు ఎలా భర్తీ చేస్తారు? దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తే శాప్ 2002 తర్వాత జరిగిన సవరణలను దాచిపెట్టి కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు–1975 అంశాలను మాత్రమే కోర్టుకు ఎందుకు నివేదించింది?జవాబు చెప్పలేక జగన్‌పై వ్యక్తిగత విమర్శలా?విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరగడం ముమ్మాటికీ నిజమని.. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం తప్పు అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా లోకేశ్ చూపలేకపోయారని పేర్కొన్నారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని, పది వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న లోకేశ్ ఎక్కడా తప్పు జరగలేదని చెప్పే ధైర్యం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ–2025లో జరిగిన దారుణాలు ఆధారాలతో సహా కళ్లముందే కనిపిస్తున్నా దర్యాప్తు చేస్తామని ఒక్కమాట అనేందుకు లోకేశ్ సాహసించలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 200 కేసులు వేయించారని జగన్‌పై నిరాధార ఆరోపణలతో బురద చల్లారని మండిపడ్డారు. వాస్తవానికి డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన వారంతా ప్రతిభ కలిగిన టీచర్ అభ్యర్థులేనని, వారిలో పరీక్ష రాయని వారు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. ‘వారికి పోస్టులు ఇవ్వాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రక్రియను హడావుడిగా ముగిస్తూ ప్రభుత్వం ఫలితాలు ప్రకటన, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్‌లు ఇచ్చేశారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిజం కాదా? ఈ విషయం తెలిసి కూడా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? అర్హులకు ఎందుకు న్యాయం చేయలేదు? డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆడిన అవినీతి క్రీడతో 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి అభ్యర్థులకు న్యాయం చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్సు డీఎస్సీలో జరిగిన స్కామ్‌పై ‘సాక్షి’లో కథనం వెలువడిన నెల రోజుల తర్వాత అబ్బే.. తప్పు జరగలేదంటూ ‘శాప్’ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవటాన్ని బొత్స తప్పుబట్టారు.ఈ ప్రశ్నలకు జవాబేది చినబాబూ..1. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?2. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?3. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్‌లో టాపర్‌గా వచ్చిన ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పి.నవీన్ ఎంపిక జాబితాలో తనకు పోస్టు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా?4. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్ృలోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా?5. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?6. రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? వారు ఏయే క్రీడల్లో ప్రతిభ చూపారు? వారికి ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?7. టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి?8. మెగా డీఎస్సీ పేరుతో అమరావతిలో నిర్వహించిన నియామకపత్రాల ప్రదానోత్సవానికి కొందరు డీఎస్సీ ఉద్యోగార్థులను పిలిచి, తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిన మాట వాస్తవం కాదా? -
ఓటర్ లిస్ట్‌పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్‌లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్‌లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్‌కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు మోసాలపై పుస్తకాలు రాయొచ్చు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వ్యవస్థల మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్ హిట్ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?కోవిడ్ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్:కోవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్‌గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్ టాపర్ వచ్చాడని తెలిసి ఆన్ లైన్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్ డోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్ మావిగన్ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్ జరిగి మెరిట్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. -
జగన్ చేస్తే వినాశనం.. టీడీపీ చేస్తే అభివృద్ధా?
ఎంవీపీ కాలనీ (విశాఖ): విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయిందని జనసేన మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేస్తే విధ్వంసం, టీడీపీ చేస్తే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతోందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కట్టడాల కోసం రుషికొండపై నిర్మాణాలు చేస్తే టీడీపీ నానాయాగి చేసిందని.. రుషికొండను బోడిగుండు చేసేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిందన్నారు. అయితే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో శ్రీ వరాహ నృసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కొట్టేస్తూ అభివృద్ధి అని చెబుతోందన్నారు. విశాఖకు రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేయడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిందన్నారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపేందుకు అవసరమైతే నగర ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
కూటమి ప్రభుత్వం.. జిత్తులమారి సర్కార్: బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి సర్కార్.. జిత్తులమారి ప్రభుత్వం.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రజలను మోసం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన గజపతినగరంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి కొంతమంది మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు.సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అమ్మ ఒడి జాడ లేదు. వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదు. ‘‘నేడు గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా?. నేడు పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా?. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే పేదవాడి ఆరోగ్యం ఏమవ్వాలి? నాడు వైఎస్ జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చారు’’ అని బొత్స గుర్తు చేశారు. -
YSR మరణం తరువాత సంతకాలు? నిజాలు బయటపెట్టిన బొత్స
-
బొత్స కంటతడిపై వెంకట్ రెడ్డి రియాక్షన్
-
అచ్చెన్నా.. ఆ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా!
ఎంవీపీకాలనీ (విశాఖ): మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. రాజకీయ ఉనికి కోసం, ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా అంటూ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆనాడు వైఎస్సార్ మరణవార్త తెలిసి తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయని బొత్స చెప్పారు. వైఎస్సార్ మరణం వెనుక జగన్ ఉన్నాడని, మరణించిన సమయంలో ఆయన రాష్ట్రంలో లేడని తాను స్వయంగా చెప్పినట్లు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పడం అతడి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి కొంచమైనా సిగ్గనిపించలేదా అని ప్రశ్నించారు. అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా.. టీడీపీలో ఉనికి కోసం, మంత్రి పదవి కోసం ఇలాంటి నీచరాజకీయాలకు ఒడిగడతావా అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని గుర్తుతెచ్చుకుని బొత్స కంటతడి పెట్టారు. తనకు వైఎస్సార్తోను, ఆయన కుటుంబంతోను ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుల్లో వైఎస్సార్ ఒకరన్నారు. అలాంటి వ్యక్తి మరణాన్ని ఆయన పాదయాత్ర ముగించిన చారిత్రాత్మక సమయాన్ని స్మరించుకునేప్పుడు రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ అక్కడే ఉన్నారన్నారు. తాను, తన భార్య కలిసి క్యాంపు ఆఫీసు నుంచి స్వయంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. చరిత్ర తెలియకుండా అచ్చెన్నాయుడు రాజకీయ లబ్ధికోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారని చెప్పారు.మావిగన్ పేరు వినిపిస్తే కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని బొత్స చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోందన్నారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మావిగన్ నిలిచిందని పేర్కొన్నారు. దీంతో మావిగన్ పేరెత్తితో కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఈ దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. తనకు నచ్చితే రేణుకా చౌదరి మాదిరిగా కమ్మరావతి బ్యాండ్ కట్టుకోవాలని సూచించారు. సత్తా ఉంటే రాష్ట్రంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. అంతేతప్ప ఇలాంటి నీచవ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. జగన్‌ను ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మావిగన్ పేరు ఎత్తితే కూటమి నాయకులకు అంత ఉలికిపాటు ఎందుకని బొత్స నిలదీశారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, విశాఖ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స
-
కంటతడి పెట్టిన బొత్స
-
వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న బొత్స
సాక్షి, విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్సార్ గురించి మాట్లాడుతూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ బొత్స మండిపడ్డారు. వైఎస్సార్ మరణంపై అచ్చెన్న దిగజారి మాట్లాడారు. కావాలనే వైఎస్ జగన్‌పై బురద జల్లుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ మాట్లాడిన మావిగన్.. కూటమి నేతలకు నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది. మావిగాన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. రాజకీయ అవసరాలు కోసం అచ్చెన్నాయుడు జగన్ పై మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు బొక్క లేదు అనే మాటలను మర్చిపోయావా?. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. వైఎస్సార్ మరణం వెనక జగన్ ఉన్నాడని నేను నీతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతావా?’’ బొత్స ధ్వజమెత్తారు.‘‘మాకు వైఎస్సార్‌కు విడదీయరాని సంబంధం ఉంది. రాజకీయాలు కోసం పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయకు.. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయి. అచ్చెన్నాయుడు పదవులు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు వైఎస్సార్ గురించి మాట్లాడావు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. వైఎస్సార్ చనిపోయినప్పుడు వైఎస్ జగన్ అక్కడే ఉన్నారు. నేను నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాము. చనిపోయిన వైఎస్సార్‌ను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు...సభ్యత సంస్కారం లేని వ్యక్తి అచ్చెన్నాయుడు. మా చరిత్ర మీకు తెలుసు. మీ చరిత్ర మాకు తెలుసు. మావిగన్ అంటే అందుకు అంత ఉలిక్కి పడుతున్నారు.. మావిగన్ ఎందుకు నోరు మెదపడం లేదు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నాను. మావిగన్‌కు వస్తున్న స్పందన చూసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేను బాధపడను. వైఎస్ మరణం తరువాత జరిగిన సంతకాలకు జగన్‌కు సంబంధం లేదు. ఈ విషయం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు తెలుసు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేస్తూ వాటిని దాచిపెట్టి చట్టసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్లోనూ, బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు చేస్తూ వాస్తవ వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. చట్ట సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను మోసగించడమేనని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బొత్స బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలతో పాటు శాసన మండలి సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ గవర్నర్‌కు లేఖ రాశారు. అప్పులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడమంటే ఆర్థిక శాఖ అధికారులు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సభకు సమాధానం ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా, జవాబుదారీతో ఉండాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులకు గట్టిగా చెప్పాలని ఆ లేఖలో బొత్స విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టారు.. 2024–25, 2025–26లో రాష్ట్ర అప్పుల వివరాలపై మండలి గత సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ తప్పుడు గణాంకాలతో సమాధానం ఇచ్చిందని బొత్స లేఖలో పేర్కొన్నారు. 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని ‘కాగ్’ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మార్చి 6వ తేదీన సభకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిందని, అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం 2024–25లో అప్పు రూ.60,485.40 కోట్లుగా పేర్కొన్నారని బొత్స గవర్నర్ దృష్టికి తెచ్చారు. మరోవైపు 2025–26 ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల్లో రూ.85,269.19 కోట్లు అప్పులు చేస్తే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం రూ.53,878.71 కోట్లుగా> సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టి తక్కువగా చూపించినట్లు తేలిందన్నారు. కాగ్ నివేదికతో పాటు బడ్జెట్ డాక్యుమెంట్లలో 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 2024–25, 2025–26లో బడ్జెటేతర అప్పుల వివరాలను వెల్లడించాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయంలో కూడా తప్పుడు సమాచారాన్ని సభకు సమర్పించినట్లు తెలిపారు. రూ.53,878.71 కోట్లు మినహా 2025–26లో ప్రభుత్వం మరే ఇతర రుణం తీసుకోలేదని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. పలు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు చేస్తున్నా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ అధికారి ఇలా చట్టసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఆ శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. తప్పుడు సమాధానాలు ఆర్థిక శాఖ సమగ్రతకు హాని కలిగించమే కాకుండా చట్ట సభ స్థాయిని దిగజార్చి కించపరచడమే అవుతుందని బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బడ్జెటేతర అప్పులను మాత్రమే సమాధానంలో ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పులను దాచి పెట్టడం ద్వారా ఆర్థిక శాఖ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికారులు రాజకీయ వైఖరితో సమాధానాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. జవాబుదారీతనంతో చట్టసభలకు వాస్తవ సమాచారాలను అందించాల్సిన కార్య నిర్వాహక వర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడమేనని బొత్స స్పష్టం చేశారు. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..
సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్‌ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపాయాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు? రాష్ట్రానికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశామని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్ ఇంజన్‌గా మారే అవకాశమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్ ట్రిక్స్‌కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనలో తప్పేంటి?‘మా నాయకుడు వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఉన్నారు. -
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
బొత్సకు అంబటి రాంబాబు పరామర్శ
-
బాబు ఆలోచన విధానమే దోపిడీ మేం వస్తే మీకేంటి ఇబ్బంది..
-
బొత్సకు ఎమ్మెల్సీల పరామర్శ
విజయనగరం: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదివారం విజయనగరంలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల మండలి సమావేశాల్లో అస్వస్థతకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బొత్సను ఎమ్మెల్సీలు పరామర్శించి.. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. బొత్సను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, టి.మాధవరావు, కేఆర్జే.భరత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, రుహుల్లా, సిపాయి సుబ్రమణ్యం, పి.చంద్రశేఖర్‌రెడ్డి, నర్తు రామారావు, ఇందుకూరి రఘురాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు తదితరులున్నారు. -
బొత్సను పరామర్శించిన YSRCP నేతలు
-
విశాఖలో భూ ఆక్రమణలు: బొత్స సత్యనారాయణ
విశాఖ: కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విశాఖను దోచుకు తింటున్నారని తెలిపారు. ఉద్యమ కార్యచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీతో ఉన్న కార్పొరేటర్లకు సాధ్యమైనంత వరకు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. -
కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్
-
ఏపీలో ఆర్థిక మందగమనం.. పయ్యావులపై బొత్స సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కాగ్ రిపోర్టు డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీలో ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కల్పిత జీఎస్డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నారంటూ కాగ్ లెక్కలను బహిర్గతం చేశారు. తప్పుడు లెక్కలపై బొత్స మండిపడ్డారు.విపక్షనేత బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి, మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా, మీరు కాగ్ వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు మీరు సిద్ధంగా లేరన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 23 రాష్ట్రాలకు సంబంధించిన CAG MKI నివేదికలను ఈ ట్వీట్‌కు జతపరుస్తున్నాము. అలాగే వృద్ధి రేట్లు ఎలా గణించారో వివరింగా తెలియజేసే స్లైడ్స్‌ను కూడా ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాం. (https://tinyurl.com/teswmtu2)రాష్ట్రం ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మీ ప్రభుత్వం కల్పితమైన GSDP గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పిస్తోంది.2024–25లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% (నామినల్ GSDP) వృద్ధి సాధించిందదని మీ ప్రభుత్వం చెప్తోంది. కాని అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8% మాత్రమే. అలాగే 2025–26లోకూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 10.75% వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. కాని దేశ వృద్ధి రేటు 8.0%గానే అంచనా వేశారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09%గా వస్తుంది. అదేవిధంగా రియల్ GSDP వృద్ధిలో ఈ సంవత్సరం రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉందని మీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.అయితే మీ ప్రభుత్వం తరఫున మీరు ఇస్తున్న అంకెలు, గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావు. ఇవన్నీచంద్రబాబుగారి కార్యాలయం తయారు చేసిన గణాంకాలు, కాకిలెక్కలు. ఈ గణాంకాలు నిజమైతే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాల్లో కూడా వృద్ధి కనిపించాలి. CAG ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు సంబంధించి విడుదలచేసిన గణాంకాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR మాత్రమే పెరిగాయి.11.09% GSDP వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం, కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించడం ఎలా సాధ్యమో ప్రపంచంలోని ఆర్థిక శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు చెప్పుకుంటున్నట్టుగా ‘విజనరీ నాయకత్వం’ కింద తయారుచేసిన కల్పిత గణాంకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి 9 నెలలకు సంబంధించి 23 రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలకు సంబంధించిన ఖాతాలనుకూడా CAG అప్లోడ్ చేసింది.ఆ రాష్ట్రాలతో పోల్చి చూస్తే పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. 23 రాష్ట్రాలలో పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది — అంటే కిందనుంచి రెండవ స్థానం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం అదే కాలంలో 9.64% పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయి.🚨 #CAGExposedCBNరాష్ట్ర ఆర్థిక శాఖమంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి ( @PayyavulaOffl ),మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా, మీరు CAG వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్… pic.twitter.com/iaDv2RTCSM— YSR Congress Party (@YSRCParty) March 7, 2026కానీ, మీరు ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మించి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధ్యత గల విపక్షంగా వాస్తవాలను మేం శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు, రాష్ట్రం చూపుతున్న ఈ నిరాశాజనక ఆర్థిక పనితీరుపై ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా, మేం సభద్వారా ప్రజలముందు ఉంచిన ఈ గణాంకాలను ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంతో వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మేము జతపరిచిన అన్ని పత్రాలను మీరు పూర్తిగా పరిశీలించి, మేము చేసిన ఆరోపణలను ఖండించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం (State’s Own Tax Revenues) వృద్ధి రేటు CAGR 1.97% కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పగలరా?. పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 22వది కాదని, అంతకంటే మెరుగైన స్థానంలో ఉందని మీరు నిరూపించగలరా?. ఈ గణాంకాలను మీరు ఖండించకపోతే, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భావించినట్టే! అని పోస్టులో పేర్కొన్నారు. -
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ దాచడానికి లేదని శాసనమండలి సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కుండబద్దలు కొట్టారు. బడ్జెట్‌ను పూర్తి పారదర్శకంగా తీసుకు వస్తున్నామని, ఇందులో ఏమీ దాచడం లేదని రాష్ట్రంలో అప్పులు తప్ప ఇక దాచడానికి ఏమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను దాస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి పరోక్షంగా అంగీకరించారు. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2026–27 బడ్జెట్ పత్రాల్లో బడ్జెట్ బయట చేసే అప్పులు (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) దాచిన విషయంపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు పేర్కొనలేదని, బడ్జెట్లో పేర్కొన్న రెవెన్యూ, ఆర్థిక లోటులను ఏ విధంగా పూడ్చుకుంటారన్న విషయాలు ఎక్కడున్నాయంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ ఆర్థికమంత్రి కేశవ్ పేర్కొంటున్నారని, కానీ ఈ అప్పులు బడ్జెట్ పత్రాల్లో ఎక్కడ అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ పత్రాల్లో చూపించకుండా అప్పులు ప్రభుత్వం విడుదల చేసిన వైట్‌పేపర్‌లో ఉన్నాయంటూ ఎలా చెపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాగ్ గణాంకాల ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయార్జనలో 22వ స్థానంలో ఉందని, ఆయా రాష్ట్రాల కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. వాస్తవాలు లేకుండా ఈ బడ్జెట్‌ను పూర్తిగా అంకెలగారడీగా మార్చేశారంటూ దుయ్యబట్టారు.సూపర్ సిక్స్‌లో మూడు సిక్స్‌లు ఔట్సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీలకు బడ్జెట్లో ఒక్క రూపాయికూడా కేటాయించలేదంటూ బొత్స ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్‌లో మూడు సిక్స్‌లను ఎగరగొట్టేసి సూపర్ హిట్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారంటూ దుయ్యబట్టారు. కనీసం ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పకుండా అమలు చేసేశామంటూ మభ్య పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడేసి మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ఆర్జీఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా పెట్టకుండా కేంద్రం ఇస్తున్న రూ.8,500 కోట్లను చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడవడానికి ద్రవ్యవినిమయ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో బడ్జెట్లో పేర్కొన్న అంకెల గారడీని నిరసిస్తూ మౌనంగా సభలోనే ఉంటామంటూ బొత్స ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలకు, కేటాయించిన నిధులకు సంబంధం లేదన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. కాగా, వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ వైఎస్సార్సీపీ సభ్యులు మండలిలో విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపునకు 2024 జనవరిలోనే అప్పటి తమ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బొత్స ప్రకటించారు. -
ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
-
శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్‌రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. -
అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్
-
Health Condition : తన ఆరోగ్యంపై బొత్స క్లారిటీ
-
లడ్డూపై చర్చ.. కూటమి సర్కార్ పారిపోయింది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అసెంబ్లీ మీడియా పాయింట్..ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కామెంట్స్..తిరుమల లడ్డుపై చర్చ జరగకుండా స్టేట్మెంట్లు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందిప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయో వినే ఓపిక లేదా మీకు?మా అభిప్రాయం చెప్పనివ్వకుండా మా గొంతు నొక్కొద్దుబుధవారం నాడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి.ఎమ్మెల్సీ కుంభారవి కామెంట్స్..చంద్రబాబు లడ్డు అపవిత్రంగా మారిపోయిందని ఆరోపణలు చేశారుఇలా మాట్లాడటం చాలా దురదృష్టం..రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు తెలపాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉందిచంద్రబాబు శ్రీవారి లడ్డులో పంది కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశారుచంద్రబాబు ప్రభుత్వం సీబీఐ నివేదికతో డిఫెన్స్‌లో పడింది.సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారుఇందాపూర్, వైష్ణవి సంస్థలకు హెరిటేజ్‌కు ఉన్న సంబంధాలు ఏంటి350 రూపాయలు ఉన్న నెయ్యిని.. 650కి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారుమండలిలో మేము ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేక తోక ముడిచింది ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కామెంట్స్..శాసన మండలిలో లడ్డు గురించి స్వల్పకాలిక చర్చపై కూటమి ప్రభుత్వం భయపడిందిస్వామి వారి కీర్తిని.. ప్రతిష్టను రాజకీయం చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబుతిరుమల వెంకన్నను అవమానించిన నాయకుడు చంద్రబాబుహిందువులను రెచ్చగొట్టి వైఎస్ జగన్‌కు దూరం చేయాలని చంద్రబాబు చూశారునోటితో కూడా మాటలు రాని విధంగా విష ప్రచారం చేశారుసిట్ రిపోర్టు వచ్చాక.. కొత్త కెమికల్ అని హడావిడి చేశారుదేవదేవుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది చంద్రబాబు.రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకోవడం మానేయండి..ఇప్పటికైనా స్వామి వారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలిహెరిటేజ్పై సీబీఐ విచారణ జరిపించాలి..శాసనమండలిలో లడ్డుపై చర్చ జరిగే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదుఎమ్మెల్సీ అప్పిరెడ్డి కామెంట్స్ఈరోజు శాసనమండలిలో కూటమి నేతల తీరు ప్రజాస్వామ్యం తలదించుకునేలా ఉందితిరుమల తిరుపతి లడ్డు అంశంలో ఇందాపూర్, హెరిటేజ్ బంధాలు బయటపడ్డాయిచంద్రబాబు మాట్లాడిన మాటలు హిందువులు కూడా మాట్లాడటానికి ఇష్టపడరుచంద్రబాబు తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడారునాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి.. దౌర్భాగ్యంగా మాట్లాడారురాజకీయ స్వలాభం కోసం వైఎస్సార్సీపీపై బురద వేయాలని ఆలోచనతో చంద్రబాబు మాట్లాడారు..చంద్రబాబు రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రయోజనాల ఉద్దేశించి మాట్లాడారు.ఇందాపూర్‌ను ముందుంచి హెరిటేజ్‌కు కోట్లాది రూపాయలు దోచి పెట్టేందుకు చేసిన కుట్ర ఇది.కూటమి తప్పుడు ప్రచారంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.కూటమి సర్కార్‌కు ధైర్యం ఉంటే ఎందుకు చర్చించడం లేదు. మండలిలో మూడు గంటలుగా మేము నిరసనలు తెలిపాం.కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన అసెంబ్లీ..అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనలడ్డుపై చర్చ జరుపనందుకు ఎమ్మెల్సీల నిరసనరోడ్డు మీద బైఠాయించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..చర్చకు అంగీకరించని ప్రభుత్వం.. అట్టుడుకుతున్న శాసన మండలి.చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ.చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ సభ్యుల పట్టు. లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..చర్చకు అంగీకరించని ప్రభుత్వం, అట్టుడుకుతున్న శాసనసమండలి, చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైయస్ఆర్ సీపీ. చర్చ జరగాల్సిందేనని వైయస్ఆర్ సీపీ పట్టు. నిన్న చర్చ ప్రారంభమైన తర్వాత ఉద్దేశ పూర్వకంగానే అధికారపక్షం అడ్డుకుంది, ఇవాళ ఆ చర్చను కొనసాగించాలి,… pic.twitter.com/HcJNFtPbxJ— YSR Congress Party (@YSRCParty) February 27, 2026 బీఏసీ మీటింగ్ బాయ్‌కాట్..శాసనమండలి..బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.లడ్డు ప్రసాదంపై చర్చ జరపాలని ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.మీడియా పాయింట్..ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కామెంట్స్..మంత్రి సభను ఆపించారు..చైర్మన్‌కి తెలియకుండా మంత్రి స్టేట్మెంట్ చదువుతామని అన్నారు..ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నాం..చర్చకి వస్తామని చెప్పారు..చర్చకి మాత్రం రాలేదు..చర్చకు కూటమి నేతలు భయపడుతున్నారు.చర్చకి వచ్చే వరకు పట్టుబడతాం.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..ప్రభుత్వం చర్చకి భయపడుతుంది..చర్చకి వస్తామని చెప్పి వాయిదా వేయించారు..టీడీపీలో అక్రమాలు బయట పడతాయని పారిపోతున్నారు..హెరిటెజ్, ఇందాపూర్, వైష్ణవి మధ్య సంబంధాలు బయట పడతాయని భయపడుతున్నారుతన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డుపై కామెంట్స్ చేసారు..చర్చ సాగే మా పోరాటం కొనసాగుతుంది..బడ్జెట్‌పై కూడా చర్చ జరగాలి..ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కామెంట్స్..నిజాలు బయటకి వస్తాయని వాయిదా వేశారు..ఇందాపూర్, హెరిటెజ్పై సంబంధం బయట పడుతుంది అని భయపడ్డారు..రాయలసీమ ఎత్తిపోతలని కూటమి ఆపేసింది..రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి సభలో గందరగోళం మధ్య మండలి వాయిదా.. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్.అధికార పక్షం సభలో చర్చను అడ్డుకోవడం సరికాదన్న చైర్మన్.మండలిలో లడ్డూపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం.అవసరమైతే 4, 5 తేదీల్లో చర్చిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు. లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సభ వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం..లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పునః ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్ళీ మొదలు పెట్టాలనటం సరికాదు.మంత్రి పయ్యావుల కేశవ్ నాపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం..నేను సంతకం చేశానని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు.. అంటూ ఆగ్రహం అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలి..మీరు రాజకీయాలు చేసుకోండి.. కానీ, కుర్చీని అవమానించవద్దు. 👉శాసన మండలి సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీఅసెంబ్లీ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధర్నాఅసెంబ్లీ బయట రోడ్డుపై ధర్నా చేసున్న ఎమ్మెల్సీ లుతిరుమల లడ్డుపై చర్చ చేపట్టాలని ధర్నామండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంతిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యంచర్చ కొనసాగించాలి: బొత్సశాసన మండలితిరుమల లడ్డు పై చర్చ కొనసాగించాలన్న ప్రతిపక్ష నాయకుడు బొత్ససభలో చర్చ ప్రారంభించిన తరువాత వాయిదా పడిన కారణంగా..ఈరోజు కూడా చర్చ కొనసాగించాలని నిన్న మండలి చైర్మన్‌కు, సెక్రటరీ జనరల్‌కు బొత్స విజ్ఞప్తి -
బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు
-
తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స
-
లడ్డూ కల్తీపై చర్చ జరగాలంటే ఎందుకు పారిపోయారు?: బొత్స
సాక్షి, అమరావతి: ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నీ.. నేను చెప్తే చంద్రబాబు ఆపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇది వాస్తవమా? కాదా? అని మండలిలో ప్రశ్నించాం. దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదు’’ అంటూ శాసనమండలి విపక్ష నేతబొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేదే తమ డిమాండ్ అంటూ స్పష్టం చేశారు.‘‘తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఖండించలేదంటే ఆర్థిక శాఖ మంత్రి దానికి వత్తాసు పలికినట్టే.. అధికారం ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విలువలను తాకట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్దం అని ఎందుకు చెప్పటం లేదు?. వ్యక్తిగత స్వార్థాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం.. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి.. అవి అనుబంధం వరకే. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని బొత్స నిలదీశారు.‘‘రాజమండ్రిలో కల్తీ పాలపై ప్రభుత్వం చర్చ జరపడం లేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. లడ్డులో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పారు.. కోర్టు వేసిన సిట్ నిగ్గు తేల్చింది. 329 రూపాయలకు హిందూపూర్ డెయిరీ ఉంటే.. ఈరోజు టీటీడీ 650 రూపాయలు కొంటుంది.. హిందూపూర్ డెయిరీకి.. హెరిటేజ్‌కి ఉన్న సంబంధం అదే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు కో యూనిట్ అంటున్నారు.. డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఈరోజు ఎందుకు చర్చించలేదు...ఆ దేవదేవుడు కూడా ఇటువంటి దోపిడీలను క్షమించడు. ఈ దోపిడిని అరికట్టాలి. వైఎస్సార్ ఏడుకొండలు జీవో ఇచ్చారు. ఏడుకొండలపై ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. 2016లో.. మజ్జిగ సైతం హెరిటేజ్‌లో కొనాలని జీవో ఇచ్చారు. చంద్రబాబు బుర్ర ఏ విధంగా పనిచేస్తుందో అనేదానికి ఇదే నిదర్శనం. మండలిలో ఎందుకు చర్చించడం లేదు...విజయవాడలో పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు ఎన్ని గుళ్లు కూల్చేశారు. శ్రీశైలంలో లాఠీఛార్జి జరిగింది.. ఎవరిని సస్పెండ్ చేశారు. మీకు దేవుడిపైన దేవాలయాల పైన నమ్మకం లేదు.. కేవలం రాజకీయాలు కుర్చీలపైనే. ప్రజలను దగా చేయడం మోసం చేయడమే మీ ఎజెండా. చంద్రబాబు ధన దాహం కోసం దేవదేవుడు ప్రసాదాన్ని సైతం అవమానించారు. దేవదేవుడు ప్రసాదంపైనే అపోహలు సృష్టించారు...చంద్రబాబు నీ వయసుకి గాని ఆ ముఖ్యమంత్రి పదవి గాని న్యాయమా ఇది.. తప్పుని ఒప్పుకోకుండా ఎన్డీబీ రిపోర్ట్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే నాలుగు ట్యాంకులు పట్టుకోలేదా?. సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం. చంద్రబాబు మాయ మాటలు, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం. మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు’’ అంటూ బొత్స మండిపడ్డారు.మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్: లేళ్ల అప్పిరెడ్డిఈరోజు మండలిలో చీకటి రోజు.. ఇవాళ చర్చజరుపుతామని ఎజెండాలో పెట్టి.. లఘు చర్చలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతుంటే.. మంత్రి మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటున్నారు... ఇంతకన్నా దుర్దినం ఉందా?. హెరిటేజ్‌కి సంబంధించి కంపెనీ ఉత్పత్తులను ఏ విధంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. 1998లోనే హెరిటేజ్ తిరుపతి లడ్డూ నెయ్యి టెండర్లలలో పాల్గొన్నదని సమాచారం ఉంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. మండలిలో చర్చ జరగాలి. తిరుమల ఏడుకొండల అంశంలో వైఎస్సార్‌పై చంద్రబాబు అభాండాలు వేస్తున్నాడు. ప్రజా కోర్టులో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ -
లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం
-
లడ్డూపై చర్చ.. మండలిలో టీడీపీ యూటర్న్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..శాసన మండలిమండలిలో లడ్డు ప్రసాదం చర్చపై టీడీపీ యూ టర్న్మండలి ఎజెండాలో లడ్డుపై స్వల్ప కాల చర్చగా పేర్కొన్న సెక్రెటరీ జనరల్తీరా చర్చ వచ్చే సరికి మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారంటూ యూ టర్న్మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ మంత్రి పయ్యావుల పట్టుస్వల్ప కాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసిన మండలి చైర్మన్ఏపీ శాసనమండలి ప్రాంగణంలో బొత్స కామెంట్స్..తిరుమల లడ్డూ అంశంపై చర్చకు ఎందుకు భయపడుతున్నారు?.అబద్ధాలు, దుష్ప్రచారం, దోపిడీ చేసిన వారిని దేవదేవుడు క్షమించరు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చి చెప్పింది.సభ ప్రారంభమైన మొదటి నుంచి చర్చకు డిమాండ్ చేస్తున్నాం.లడ్డూపై చర్చించాలని వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చాం.చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే పారిపోయారా?.తిరుమల లడ్డూపై ఎప్పుడైనా చర్చకు సిద్దమని చెప్పారు.తీరా చర్చ పెట్టాక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడమేంటి?.హెరిటేజ్-ఇందాపూర్ మధ్య సంబంధం ఉందా? లేదా?.మీ దోపిడీని ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరు.టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా తొక్కిసలాట జరిగిందా?.ఎప్పుడైనా టీటీడీలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారా?.సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ద.. దేవుడు, దేవాలయాలపై లేదు. మండలిలో లడ్డూపై మాట మార్చిన కూటమి సర్కార్.. మండలిలో లడ్డూ అంశంపై మాట మార్చిన ప్రభుత్వం.చర్చ లేకుండా ప్రకటన మాత్రమే చేసేందుకు ప్రయత్నం.లడ్డూ అంశంపై ప్రకటన చేస్తామన్న మంత్రి పయ్యావులచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు.మంత్రి ప్రకటనకు సంబంధించి తనకు సమాచారం లేదన్న చైర్మన్.లఘు చర్చలో ప్రతిపక్షానికే తొలి ప్రాధాన్యత అన్న చైర్మన్.స్టేట్మెంట్ తర్వాతే చర్చ చేపట్టాలన్న మంత్రి పయ్యావుల.స్టేట్మెంట్ ఇవ్వడంపై చైర్మన్ అభ్యంతరం.గందరగోళం మధ్య మండలిని రేపటికి వాయిదా వేసిన చైర్మన్.మండలిలో మంత్రులపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం.బొత్స కామెంట్స్..లడ్డూపై చర్చ చేయకుండా ప్రభుత్వం పారిపోతోంది.మీ దోపిడీ కోసం దేవదేవుడిని అపవిత్రం చేస్తున్నారు.ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా..మండలిలో గందరగోళం సృష్టించిన అధికార పక్షం.లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ పలాయనం.టీడీపీ నేతల గొడవతో మండలి రేపటికి వాయిదా లడ్డూపై చర్చను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం..మండలిలో లడ్డుపై చర్చ అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నంప్రశ్నోత్తరాల ముగిశాయి అని ఇప్పటికే ప్రకటించిన చైర్మన్లడ్డూపై చర్చ ను ప్రారంభించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డిఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రసంగం అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీల గొడవస్వల్పకాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ ఉండదు అని స్పష్టం చేసిన మండలి చైర్మన్స్టేట్మెంట్ ఇవ్వాలంటే మరోసారి ఇవ్వాలని తెలిపిన మండలి చైర్మన్స్టేట్మెంట్కి అనుమతి ఇచ్చారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వాదనఅసలు ఆ డాక్యుమెంట్ కోసం నాకు తెలియదని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మండలి మరోసారి వాయిదా.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ సభ్యుల అభ్యంతరం.. గాలేరు, నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి..గాలేరు, నగరి ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేయాలి..గత ప్రభుత్వ హయాంలో జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది..గాలేరు, నగరి ప్రాజెక్టుకు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు..ప్రాజెక్టు ఏపాటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలి..మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం..సభ్యులు అడిగిన ప్రశ్నల గురించే మాట్లాడాలి..అడిగిన ప్రశ్నలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగలేదు..వైఎస్సార్సీపీ సభ్యులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటర్..రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి సూటిగా సమాధానం చెప్పాలి..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాస్తవమా.. కదా..కాదు అంటే కాదని చెప్పండి..ఈ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు మొదలు పెడతారు..ఎప్పటి లోపు పూర్తవుతాయి అనేది సమాధానం చెప్పాలి..లేకపోతే తర్వాత చెప్తామని చెప్పాలి.. మంత్రి నిమ్మల రామానాయుడు..వైఎస్సార్సీపీ వాళ్లకు సమాధానాలు వినే ధైర్యం ఉంటే రేపు చర్చిద్దాం..మేం అన్నీ ప్రశ్నలపై సమాధానాలు చెప్పేందుకు సిద్ధం..పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పారు..పొరుగు రాష్ట్రంలో వల్ల రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతారు..అధికారంలో ఉంటే ఒక రకంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతున్నారు..గాలేరు, నగరి సహా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం..మంత్రి నిమ్మల సమాధానంపై వైఎస్సార్సీపీ సభ్యుల అభ్యంతరం..సభలో పెద్దఎత్తున నినాదాలు..బొత్స సత్యనారాయణ కామెంట్స్..రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి..ఆయన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్లకు లేదా?.కాకపోతే ఇది వాస్తవం కాదు అని ఎందుకు చెప్పటం లేదు..సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా..ఎస్ ఆర్ నో సూటిగా సమాధానం చెప్పాలి..మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్..పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మేం తేలేదు..వైఎస్సార్సీపీ వాళ్ళే తెచ్చారు..అధికారంలో ఉన్నప్పుడు ఏం గుర్తు లేదు..అధికారం పోయి 11 సీట్లకు పరిమితం అయినప్పుడు ఇప్పుడు సీమ ప్రజలు అని మాట్లాడుతున్నారు..మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్..ప్రశ్నోత్తరాల సమయం ఇక గంట మాత్రమే..వైఎస్సార్సీపీ వాళ్ళు అది గుర్తుంచుకోవాలి..గత పదిరోజులుగా వైలేషన్ జరిగింది..అది ఎవరి వైపు నుంచి జరుగుతుందో అందరూ చూశారు..బొత్స సత్యనారాయణ కామెంట్స్..ఇద్దరు మాట్లాడుకుని లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలా..ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు మా బాధ్యత..డైవర్షన్ చేయాలనుకోవటం ధర్మమా?.బొత్స మాట్లాడే సమయంలో వాకౌట్ అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు..మేం బయటకు ఎందుకు వెళ్తాం అంటూ బొత్స ఫైర్.. ఏపీ శాసన మండలి మరోసారి వాయిదా.వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు.మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యుల డిమాండ్.రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్న.రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు.లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేసి సీమకు అన్యాయం చేశారు.సీమ లిఫ్ట్ కడతారా? లేదా? ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీ మీడియా పాయింట్.. టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంతా రోడ్డు ఎక్కారుప్రభుత్వం కనీసం వారిని పిలిచి చర్చలు కూడా జరపటం లేదుఉద్యోగుల ధర్నాపై నిర్లక్ష్యం వహిస్తుందిసచివాలయ ఉద్యోగులు అంగన్వాడీలు, టీచర్స్ ఆందోళన బాట పట్టారుఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదుఉద్యోగులకు అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పారుపీఆర్సీలు , ఐఆర్ ఇస్తాం అని మాయమాటలు చెప్పారుఉద్యోగుల సమస్యలు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అధికారం రాగానే మేనిఫెస్టో పక్కన పడేశారుఉద్యోగులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాముఅధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారుఉద్యోగులకు సంబంధించి 35వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అవి చెల్లించరా?పెండింగ్‌లో పెట్టి వాటిని కొండలాగా పెంచుకుంటూ పోతారా?ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఉద్యోగులంతా రోడ్లు ఎక్కారుశాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ.. ఉద్యోగులు లేకుండా నడుస్తాయా?అధికారంలోకి రావటానికి రథ చక్రాలలా ఉద్యోగులు పని చేశారునేడు ఆ చక్రాల కింద పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది..ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉందిఎంతోమంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారువిద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గాని ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరపడం లేదు35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పెట్టారు...ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించి వారి డిమాండ్స్ నెరవేర్చాలి. 👉ఐదు నిమిషాల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిమంత్రి సమాధానంపై బొత్స సీరియస్.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి సమాధానం చెప్పకపోవడంపై బొత్స సీరియస్మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..సభా సంప్రదాయాలు ఉంటాయి..ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా?.దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.మేం మాట్లాడుతుంటే మైక్ సౌండ్స్ తగ్గిపోతున్నాయి.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై శాసనమండలిలో ప్రశ్న..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ భాషా కామెంట్స్..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపు తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకెళ్తున్నారు..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 841 అడుగులకు వెళ్తే కానీ నీళ్లు అందవు..800 అడుగుల లోపు మన వంతుగా నీళ్ళు రావటానికి గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చారు..దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని చెప్పారు..ఒక రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో లాలూచీ పడ్డారు..రాయలసీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా?.లేకుంటే ప్రాజెక్ట్ పనులు ఆపాల్సిన అవసరం లేదు..మీరు ఈ పనులు పూర్తి చేస్తారా.. లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కామెంట్స్..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాంత రైతులకు, ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్..రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి..చంద్రబాబు తో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపించాలని చెప్పారు..అయినా ఇంతవరకు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు..పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు..కానీ ప్రభుత్వం మాత్రం సీమ హక్కుల గురించి పట్టించుకోవటం లేదు..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కామెంట్స్..రాయలసీమ నీటి అవసరాలకు ఎత్తిపోతల పథకాలు చాలా అవసరం..రాజకీయ అవసరాల దాన్ని మూసేస్తున్నారా..దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి..ప్రజల ఆందోళనలు ప్రభుత్వం నివృత్తి చేయాలి..అనంతరం మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం..👉సభలో ఆందోళన..👉పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో సభలో గందరగోళం..👉కొద్దిసేపు విరామం ప్రకటించిన ఛైర్మన్.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రసాభాసమంత్రి సమాధానంపై అభ్యంతరం తెలియజేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతన విజ్ఞప్తి వల్లే రాయలసీమ ఎత్తిపోతలు నిలిపివేశారు అంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిఆయన మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు -
డయేరియా వ్యాప్తికి కారణం అదే దయచేసి చర్యలు తీసుకోండి
-
మరి మీరు అమ్మేది కల్తీనా?.. లోకేష్‌కు బొత్స కౌంటర్
సాక్షి, అమరావతి: నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వెయ్యిలోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘హెరిటేజ్ 750 ఎంఎల్ నెయ్యి రిలయన్స్‌లో 456కి దొరుకుతుంది. హెరిటేజ్‌లో లీటర్ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.‘‘హెరిటేజ్ వెబ్‌సైట్‌ని ఎందుకు మర్చారో లోకేష్ చెప్పాలి. మొదట ఇందాపూర్‌ని మ్యాన్‌ఫాక్చర్ అని చెప్పారు. తర్వాత కో మ్యాన్‌ఫ్యాక్చర్ అని ఎందుకు మర్చారు? అంటూ బొత్స నిలదీశారు.కాగా, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు. -
‘ఇందాపూర్’పై చర్చించాల్సిందే
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో మండలి ప్రారంభం కాగానే టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేయడం, తిరుపతి లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, వై.శివరామిరెడ్డి, పీవీవీ సూర్యనారాయణరాజు వాయిదా తీర్మానం ఇచ్చారు.దానిని తిరస్కరించిన చైర్మన్ మోషేన్‌రాజు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్దే నిలుచుని ఇందాపూర్‌పై చర్చ జరగాలి.. హెరిటేజ్‌పై చర్చ జరగాలి... తిరుపతి లడ్డూపై చర్చ జరగాలి... అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని చర్చకు పట్టుపట్టారు. అదే సమయంలో పలువురు టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ పోడియం ముందుకు వెళ్లి పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో... ప్రారంభమైన ఏడు నిమిషాలకే చైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.సభ ముగిశాక మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోల్ని చెప్పులతో పట్టుకున్నామని సీసీ ఫుటేజ్ సగం తీసుకొచ్చి నానా హడావుడి చేశారు. బీఏసీ మీటింగ్‌లో ఫూర్తి ఫుటేజ్ కావాలని కోరాం. అందులో చూస్తే వైఎస్సార్సీపీ సభ్యులు దేవుని ఫొటో పట్టుకున్నప్పుడు చెప్పులు ధరించలేదని స్పష్టంగా ఉంది. చెప్పులు ధరించినట్లుగా ప్రచారం చేస్తున్న దృశ్యాలు లేవు. కాబట్టి ఈ వీడియోల్ని ఎలా మారి్ఫంగ్ చేశారన్నది చర్చించాలని మండలి చైర్మన్‌ను కోరాం.అలాగే, మండలిలో మేం మాట్లాడేది బయటకి రావడంలేదు. టీడీపీ సభ్యులు మాట్లాడితేనే లైవ్ ఇస్తున్నారు. అసలు మండలిలోని మా ఫొటోలు బయటికెవరు విడుదల చేశారు?’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో చర్చ కోసం మేము చేస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. బీఏసీ సమావేశం సోమవారం జరిగింది.. ఇందులో ఈనెల 26న మండలిలో చర్చ చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబడితే ఇప్పటివరకూ తప్పించుకున్నారు.సీబీఐపై నమ్మకంలేకే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను వేసింది.. అయితే, న్యాయస్థానాలపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. బీఏసీ భేటీలో మూడు అంశాలపై చర్చ చేపట్టాలని కోరాం. ఇందులో మొదటిది.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, రెండోది.. రైతుల ఇబ్బందులు, మూడోది.. లడ్డూ నెయ్యి. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేశారు.. గిట్టుబాటు ధరలేదు.. బీమా లేదు.. పొగాకు, మిర్చి, మొక్కజొన్న, కోకో, మామిడి రైతులు ఇబ్బందిపడుతున్నారు’ అని బొత్స తెలిపారు. విశాఖలో భూదోపిడీపైనా చర్చిస్తాం.. ‘మండలిలో విద్య, సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చిద్దామన్నారు. అందుకు అంగీకరించాం. వైజాగ్‌లో గీతం వర్సిటీ పేరు మీద రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న మొన్న పెట్టిన స్టార్టప్ కంపెనీలకు 99 పైసలకే కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపైనా చర్చ కోరాం. విశాఖలో భూములను చంద్రబాబు కుటుంబం ఎలా దోచుకుంటుందో మండలిలో చర్చిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘హెరిటేజ్ వెనుక ఉన్న ఇందాపూర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో కేజీ నెయ్యి రూ.560 (జీఎస్టీ అదనం)కి అమ్ముతూ.. టీటీడీకి మాత్రం రూ.658కు సరఫరా చేస్తోంది.దీన్నిబట్టి ప్రజలకు కల్తీనెయ్యి అమ్ముతున్నారని అనుకోవాలా? లేక టీటీడీకి ఎక్కువ ధరకు సరఫరా చేస్తూ శ్రీవారి సొమ్మును దోచుకుంటున్నట్లు అనుకోవాలా? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. టీడీపీ కూటమి నేతలకు, వారి సంస్థలకు ధనార్జన ఆశ లేకపోతే దేవుడికి సరఫరా చేసే నెయ్యి రేటు తగ్గించి ఇవ్వాలి కదా?’ అని ప్రశి్నంచారు. కల్తీ పాలు మరణాలు సర్కారు హత్యలే.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడం, 20 మంది వరకూ ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా అర్ధంచేసుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం, దిగువ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడంవల్ల ఈ మరణాలు జరిగాయి. గతంలో కల్తీసారా మరణాలు చూశాం.. కానీ, కల్తీ పాలతో జనం చనిపోవడం ఇప్పుడే వింటున్నాం. అన్ని శాఖల్నీ గాలికొదిలేశారు. పచ్చ మీడియా వాస్తవాలు పక్కనబెట్టి ప్రభుత్వాన్ని మోస్తోంది. రాజమహేంద్రవరంలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. కల్తీ చేసిన వారితో పాటు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే భయం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.బాబు దుర్మార్గాలు బయటకొస్తున్నాయి.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచి్చంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హెరిటేజ్‌కి వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఉన్న బంధం ఏంటో రోహిత్ పవారే బయటపెట్టారు. దీనికి అధికార పక్షం ఏం సమాధానం చెబుతుంది? హెరిటేజ్ సంస్థ పాలు, పెరుగు వ్యాపారం మాత్రమే చేస్తుందని అందరం అనుకున్నాం. కానీ, హెరిటేజ్ ఫిన్‌లీజ్ అనే మరో సంస్థ ద్వారా వీఎస్ఆర్ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు దుర్మార్గాలు ప్రజలకు ఒకొక్కటిగా తెలిసిపోతున్నాయి. -
తిరుపతి నెయ్యి.. రాజమండ్రి పాల ఘటనపై బొత్స స్ట్రాంగ్ రియాక్షన్
-
మార్కెట్లో 560కే ఇంద్రపూర్ నెయ్యి టీటీడీకి మాత్రం 658కి ఎలా?
-
‘అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణం’
విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 23వ తేదీ) మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారుపంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బొత్స మరోసారి స్పష్టం చేశారు. బీఏసీలో మూడు అంశాలపై ప్రస్తావించామని, అందులో రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూడా చర్చ జరగాలని కోరామని, కారు చౌకగా భూములు కేటాయింపులపై కూడా చర్చకు పట్టుబట్టునట్టి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం సభ్యలు.. యూనివర్శిటీ పేరుతో విశాఖలో భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వీడియో ఫుజేట్‌ను మాకు ఇవ్వాలని కోరాంసభలో వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్ చూపించిన ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్‌ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్‌ను కోరామన్నారు బొత్స. -
టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న
శాసన మండలి అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయిప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయిమొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి విడుదల చేయాలిమేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదుప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్‌ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారుఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదుప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నంప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.దేవాలయంగా భావించే సెక్రటేరియట్‌కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారుచంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారుదేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారుమండలి ఛైర్మన్‌ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.బొత్స చిట్‌చాట్..ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నంఅందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాంమేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారుఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలిమేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాంచంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాంమేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయిసాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారుతిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంమేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదుమాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారుమొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్‌ను కోరాంమేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదుమండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారుశాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరంబీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారుతప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చిందిసభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందిసెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారుఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదుప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలిఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలిఅధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టండిమాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారుమరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయినేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండిఈ క్షణమే రాజీనామా చేస్తాహౌస్ మొత్తం ప్రొసీడింగ్స్‌ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందిసభలో ప్రొసీడింగ్స్ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్‌ను విడుదల చేయండిలేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదుకేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదుదళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందిచంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాంమేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాందేవదేవుడంటే మాకు అమితమైన భక్తితిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబులడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబుమండలిలో మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టాలిచంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారుఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాంకానీ చర్చ జరగనివ్వడం లేదుఅందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాంపోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదుమేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారుమండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాంకానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారుమాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాందమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..ఏపీలో శాంతిభద్రతలు లేవుప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారుఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదాలడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుందిమండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారుశాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారుమండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదుమా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.టీటీడీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 👉 శాసనమండలి కాసేపు వాయిదా.. టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్సతిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్సఅసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందిదేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.శాసనమండలిలో గందరగోళంచైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలునినాదాలు చేసిన ఇరుపక్షాలుసభలో గందరగోళ పరిస్థితి..సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్శాసన మండలి చైర్మన్‌తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. -
పని అయిపోయిందా.. ఇది మరో కుట్రా.?
సాక్షి, అమరావతి : మద్యం అక్రమ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకు వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు అరెస్ట్ చేసిందని, ఆయనతో పని అయిపోయిందా లేక ఇది మరో కుట్రా అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జరగని మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం, ఇందుకు వాసుదేవరెడ్డిని ఓ పావుగా వాడుకుందని, ఆయన్ను హింసించి, ప్రలోభపెట్టి వారికి కావాల్సిన విధంగా ఆయన్నుంచి వాంగ్మూలాలు తీసుకుందని బొత్స శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ స్కీమ్ ప్రకారం ఇంత బురదజల్లారని ఆయన ప్రశ్నించారు.అన్యాయంగా ఆఫీసర్లను, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని, వారందరినీ న్యాయస్థానాలు విడుదల చేయడంతోనే ఈ కేసులో అసలు స్కామ్ లేదని అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ ఏ2ను బయట ఉండనిచ్చి, తాము ఎంచుకున్న అధికారులను, నాయకులను అరెస్టులు చేయడాన్ని బట్టే ఇందులో ఏ స్కామ్ లేదని అందరికీ అర్ధమయ్యిందని, ఇదంతా సర్కారు జల్లిన బురదేనని అర్ధమవుతోందని అన్నారు. వరుసగా లడ్డూ కల్తీ వివాదంలో దొరికిపోవడం, హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బయటపడడం, శాసనమండలిలో కనీసం సమాధానం చెప్పలేని దుర్గతి పట్టడంతో.. ఇపుడు ఏదో కొత్త కుట్రకు పదును పెడుతున్నట్లు అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్దపు వాంగ్మూలం ఇచ్చి చంద్రబాబు మద్యం కేసు మూసివేతకు సహకరించిన విషయమూ తెలిసిందేనన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ‘‘వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని పలువురు వైఎస్సార్సీపీ నేతలను, అప్పటి ప్రభుత్వ హయాంలోని కీలక అధికారులను అక్రమంగా అరెస్ట్ చేసి నెలల పాటు జైల్లో ఉంచింది. అయితే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడంతో వారందరూ జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజులు ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు కనీస స్థాయిలో కూడా అభ్యంతరం చెప్పని చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. వాసుదేవరెడ్డి బయట ఉండటానికి వీల్లేదని, ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అందువల్ల ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాస్తవానికి ఇదంతా కూడా ఓ నాటకంలా కనిపిస్తోంది. ఇన్ని రోజులు తమ చెప్పు చేతల్లో ఉన్న వాసుదేవరెడ్డి నుంచి వారికి కావాల్సిన విధంగా వివరాలు తెలుసుకున్న సిట్, ఇప్పుడు అదే వ్యక్తి నుంచి కొత్తగా రాబట్టాల్సిన వివరాలు ఏముంటాయి? అరెస్ట్ సమయంలో ఆయన్ను మధ్యవర్తుల సమక్షంలో విచారించామని, అయితే ఆయన కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సిట్ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు, ఇదే సిట్ అప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్‌లో చేసిన ఏ ఆరోపణను కూడా ఏసీబీ కోర్టు ముందు ప్రస్తావించలేదు. పైపెచ్చు వాసుదేవరెడ్డి తమకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పింది. హైకోర్టులో కూడా ఇదే రీతిలో చెప్పింది. భయపెట్టి.. ప్రలోభపెట్టి వాసుదేవరెడ్డిని లొంగదీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కీలక నేతలపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మద్యం కుంభకోణమంటూ ఓ తప్పుడు కేసు తెరపైకి తెచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ పలువురు వైఎస్సార్సీపీ నేతలను, అప్పటి అధికారులను నిందితులుగా చేర్చింది. ఇందులో వాసుదేవరెడ్డి రెండో నిందితునిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు వాసుదేవరెడ్డిని వేధింపులకు గురి చేసి సిట్ తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంది. అరెస్ట్ బూచిని చూపి ఆయన్ను భయపెట్టింది. ఇలా వాసుదేవరెడ్డిని దార్లోకి తెచ్చుకున్న సీఐడీ, ఆయనకు ప్రలోభాలు చూపింది. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని, రాష్ట్రం నుంచి రిలీవ్ చేసి తిరిగి మాతృశాఖ అయిన రైల్వేకు పంపుతామని హామీ ఇచ్చింది. అరెస్ట్ చేయబోమని, అప్రూవర్‌గా మారి తాము చెప్పినట్లు చేస్తే చాలని వాసుదేవరెడ్డికి చెప్పింది. దీంతో వాసుదేవరెడ్డి పూర్తిగా చంద్రబాబు అండ్ కోకు లొంగిపోయారు. ఇచ్చిన హామీ మేర ఆయన్ను మాతృశాఖ అయిన రైల్వేకు పంపేసింది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలను, విశ్రాంత అధికారులను అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. వాసుదేవరెడ్డి వాంగ్మూలాలను ముందు పెట్టి వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ వచ్చింది. చివరకు వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు మద్దతుగా వాదనలు వినిపించింది. వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా శతవిధాలా ప్రయత్నించింది. ముందస్తు బెయిలిస్తే అప్రూవర్‌గా మారుతానంటూ ఏసీబీ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సిట్ వ్యతిరేకించలేదు. అయితే ముందస్తు బెయిల్ ఇస్తే అప్రూవర్‌గా మారుతానన్న షరతును ఏసీబీ కోర్టు తప్పుపట్టింది. అప్రూవర్‌గా మారే వ్యక్తి కేసు విచారణ మొత్తం పూర్తయి తీర్పు వెలువడేంత వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని, ముందస్తు బెయిల్ అన్న ప్రశ్నే తలెత్తదని ఏసీబీ కోర్టు తేల్చి చెబుతూ, ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్‌గా మారతానని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మద్యం కేసులో సహ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించాల్సిన సిట్, విస్మయకరంగా చెవిరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. తద్వారా పరోక్షంగా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సమర్థించినట్లయింది.’’ అని బొత్స పేర్కొన్నారు. -
Botsa : రండి చర్చకు అంటే తోక ముడిచి పారిపోయారు
-
‘చంద్రబాబు షూ వేసుకుని పూజ చేయడం అపచారం కదా?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేశారని.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం తమ సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారన్నారు.‘‘సీబీఐ ఇచ్చిన రిపోర్టులో చాలా విషయాలు బయటికి వచ్చాయని.. హెరిటేజ్‌తో ఒప్పందం చేసుకున్న ఇందాపూర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. 2015-19 మధ్య కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఇందాపూర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారు. అవే ట్యాంకర్లను దాచి మళ్లీ వినియోగించారు. గోవిందా కూటమి నేతలకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరాం. సభలో చర్చించమని కోరాం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘సభలో టీడీపీ మంత్రులు అవాకులు, చవాకులు మాట్లాడారు. టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదు. కూటమి నేతలకు కావాల్సింది రాజకీయం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చర్చకు రండి. చెప్పులు, బూట్లు వేసుకుని మేం దేవుడి ఫోటోలను పట్టుకుని ఉన్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా మీకు వీలైతే ఆధారాలు చూపించండి. టీడీపీ నేతల వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో మేం ప్రదర్శించిన పేపర్లను నేనే స్వయంగా కలెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టా. చంద్రబాబు లాగా మేం వేంకటేశ్వరస్వామి ఫోటోలను బూట్లు వేసుకుని పట్టుకోలేదు. వాళ్లలాగా మాది నీచబుద్ధి కాదు...మాకు దేవుడంటే ఎంతో విశ్వాసం.. దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది. టీడీపీ నేతలు డైవర్షన్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు టీడీపీ నేతల దుర్భుద్ధిని గమనించాలి. ఇందాపూర్‌తో హెరిటేజ్‌కు ఉన్న సంబంధాలపై చర్చకు కోరాం. మేం రెండు ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడాం. ఆ సంస్థల బదులు ఇంత మంది టీడీపీ మంత్రులు మాట్లాడాల్సిన అవసరమేంటి? టీడీపీ మంత్రులంతా ఆ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా?. మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారు. పదేపదే మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుగా లేదా?. మాకు సభ పట్ల గౌరవం ఉంది. మేం సభలో రాజకీయం చేయలేదు..లడ్డూలో జంతువుల కొవ్వు కలిపామని మేం చెప్పలేదు కదా. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ ద్వారా దేవదేవుడి కానుకలను కాజేయాలనేది వారి ఆలోచన. మేం ఎందుకు క్షమాపణ చెప్పాలి. దేవుడి పవిత్రతను మేం ఏనాడూ దెబ్బతీయలేదు. బూట్లు వేసుకుని దేవుడు ఫోటోలు పట్టుకుని పవిత్రత దెబ్బతీసింది వాళ్లు. ఇందాపూర్‌పై సభలో కచ్చితంగా చర్చించాల్సిందేఏం సమాధానం చెబుతారు?: తోట త్రిమూర్తులుదేవుడిని అవమానించారని ఊగిపోయిన జనసేన, బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకున్నది మీకు కనిపించడం లేదా?. మేం దేవుడి ఫోటోలను సభలో చెప్పులతో పట్టుకున్నట్లు నిరూపించండి. దేవుడి ఫోటోలను చించి, విసిరేశారని మాట్లాడుతున్నారు. మేం ఫోటోలను చించినట్లు రుజువు చేయండి. దేవుడిని రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. దేనికి సభలో మంత్రులు ఊగిపోతున్నారుచర్చకు రమ్మంటే పారిపోతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్డిప్యూటీ సీఎం దుర్గగుడి మెట్లు కడిగారు. కులమతాల మధ్య చిచ్చు రేపేలా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. నాలుగు రోజుల నుంచి చర్చకు రమ్మంటే పారిపోతున్నారు. ఇప్పకైనా సభలో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాంసీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్: తూమాటి మాధవరావుసీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్నటి వరకూ తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఇప్పుడు అన్ని ఆలయాల్లోని ప్రసాదాలపై నిందలు వేస్తున్నారు. కులదైవం అని నీతులు చెప్పే చంద్రబాబు బూట్లు వేసుకుని ధరించి వెంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకున్నారు. మేం దేవుడి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకున్నామని మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తిరుపతి మెట్లు కడిగి క్షమాపణ చెప్పాలి. మేం సభలో చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే కూటమి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా?. అన్నీ భగవంతుడు చూస్తున్నాడు.. కచ్చితంగా శిక్ష అనుభవిస్తారుదమ్ముంటే చర్చకు రావాలి: లేళ్ల అప్పిరెడ్డితిరుపతి లడ్డూ ఎలా తయారు చేశారో చంద్రబాబుని ఎవరు అడిగారు. టీడీపీ కార్యకర్తల మీటింగ్‌లో తిరుపతి లడ్డూ గురించి చంద్రబాబు మాట్లాడాడు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా? లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్నావ్. లడ్డూలో బాత్ రూమ్ కెమికల్స్ కలిపారన్నావ్. మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి అని మాట్లాడావ్. చంద్రబాబు నీ వయసుకి ఇది తగునా? వైఎస్సార్సీపీపై బురద జల్లడానికి దేవుడిని అడ్డంపెట్టుకోవడానికి సిగ్గులేదా?. సోము వీర్రాజు క్షమాపణ చెప్పమని మమ్నల్ని అడగడం కాదు. చంద్రబాబు, పవన్‌ను సోము వీర్రాజు క్షమాపణ కోరాలి. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై సభలో చర్చిస్తేనే కోట్లాది మంది భక్తులకు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సభను తప్పుదోవ పట్టించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దమ్ముంటే చర్చకు రావాలిఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి: మొండితోక అరుణ్ కుమార్నాలుగు రోజుల నుంచి సభలో ఇందాపూర్‌పై చర్చించాలని కోరుతున్నాం. నాలుగు రోజుల నుంచి వాయిదా తీర్మానాన్ని అంగీకరించడం లేదు. మంత్రి లోకేష్ మూడు రోజుల నుంచి సభలో లేడు. ఈ రోజు సభలో హెరిటేజ్ అనే మాట వినగానే లోకేష్ ఊగిపోయాడు. వైఎస్సార్సీపీ హిందువుల వ్యతిరేకి అని లోకేష్ మాట్లాడుతున్నారు. ఏ కల్తీ లేకపోయినా పవన్ దుర్గగుడి మెట్లు కడిగాడు. ఇప్పుడు ఏమైపోయాడయ్యా పవన్ కళ్యాణ్. 42 ఆలయాలు కూల్చిన చంద్రబాబు.. సోము వీర్రాజుకి ఇప్పుడు హిందూ రక్షకుడిగా కనిపిస్తున్నాడా?. ఇదే సెక్రటేరియట్‌కు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో పూజ చేసింది చంద్రబాబు. ఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి. వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా తలనీలాలు అర్పించారా?కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? వరుదు కళ్యాణిఈరోజు సభలో మంత్రులు సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు?. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి ఫ్లెక్సీలు వేసింది ఎవరు?. చంద్రబాబు, కూటమి నేతలు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీబీఐ రిపోర్టు వచ్చాక బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్, బోలేబాబాకు హెరిటేజ్‌తో సంబంధం ఉందని మేం చెప్పడం లేదు.వాళ్ల వెబ్సైట్ లోనే చెప్పారు. దేవుడి సొమ్ముని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కాబట్టే భయపడుతున్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి హోంమంత్రి అనితకు ఉందా?. ఇసుక, పశువుల రవాణా వాహనాల వద్ద పీఏలను పెట్టుకుని వసూళ్లు చేసుకునే స్థాయి మీది. ప్రజల్లోకి రావాలంటేనే జగన్ భయపడుతున్నారంటున్నారు. మీకు తెలియకపోతే మీ పోలీసులను అడగండి. వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే జన సముద్రం ఎలా ఉంటుందో?అధికార మదం, దురహంకారం అని సెర్చ్ చేస్తే అనిత పేరు వస్తుంది. వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే టిడిపి, చంద్రబాబు పేరు వస్తుంది. వెన్నుపోటు అని గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరిపేరు వస్తుందో హోంమంత్రి తెలుసుకోవాలి. ఇందాపూర్‌పై చర్చకు అంగీకరిస్తే మొత్తం అన్నీ తేలుతాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. నెయ్యి టెండర్ల ద్వారా హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చుకున్నారు కాబట్టే డైవర్షన్ కు తెరతీశారు. మేం చెప్పులు విడిచి కౌన్సిల్లో దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ఇందాపూర్ పై చర్చకు అంగీకరించాలిక్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిలడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేని అవాస్తవాలు ప్రచారం చేశారు. తప్పు చేయనపుడు ఎందుకు చర్చకు భయపడుతున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన మీరు ముందు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా టీడీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి. మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను పట్టుకోలేదు. మీకు వీలైతే ఆధారాలతో నిరూరించాలి. ఇందాపూర్‌పై కచ్చితంగా చర్చ జరగాల్సిందే. చర్చ జరిగే వరకూ మేం పోరాడుతూనే ఉంటాంచంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుపతి లడ్డూ పై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. చంద్రబాబు చేసిన పాపాన్ని క్షమించి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరాం. మేం చెప్పులు విడిచి దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. టీడీపీ నేతలు చాలా నీతులు చెబుతున్నారు. సభలో బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గతంలో ఏం చేశారో మర్చిపోయినట్లున్నారు. సభకు తాళబొట్లతో వచ్చిన విషయాన్ని లోకేష్‌కు గుర్తులేదా?. దేవుడి ఫోటోని బూట్లు వేసుకుని పట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. మేం వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకోలేదు. మేం దేవుడి ఫోటోలను చించి విసిరేయలేదు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు.. మీరు. -
హెరిటేజ్ ప్రైవేట్ సంస్థ అయినప్పుడు.. మంత్రులెందుకు చించుకుంటున్నారు లాజికతో కొట్టిన బొత్స
-
నాయుడు.. మీరు టీటీడీకి ఛైర్మన్.. టీడీపీకి కాదు: బొత్స
సాక్షి, అమరావతి: ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచిందని శాసనమండలి విపక్షనేత, బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారు. తమ ధన దాహం, దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు’’ అంటూ బొత్స మండిపడ్డారు.‘‘మాకు లీగల్ నోటీసులివ్వడం హాస్యాస్పదం. చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. మీ ధనదాహం కోసం.. మీ హెరిటేజ్ స్వలాభం కోసం ఇందాపూర్‌తో ఉన్న మీ సంబంధాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. మేం చెప్పింది వాస్తవం కాదా.. దేవదేవుడి ప్రసాదంపై ఎన్ని నిందలు వేశారు. ఇది మహాపాపం కాదా?. నిజంగా తప్పు చేస్తే వారి పై చర్యలు తీసుకోండనే మేం కోరుతున్నాం. సుప్రీంకోర్టు కూడా మేం చెప్పిందే చెప్పింది. ఇందాపూర్‌కు హెరిటేజ్ సంస్థకు ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం తమ ధనదాహం కోసం చంద్రబాబు ఆయన కుటుంబం ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డారు...చంద్రబాబు ఎంత నంగనాచిలా మాట్లాడాడు. చంద్రబాబు, పవన్, కూటమి నేతలు దేవదేవుడిపై నిందలు వేసి మహా పాపం చేశారు. సాక్ష్యాలు ఉంటే చర్చకు రమ్మంటున్నారు. చర్చ చేస్తే సాక్ష్యాలు బయటికి వస్తాయి. టీడీపీ చేస్తున్న మోసానికి టీటీడీ ఛైర్మన్ పత్రికా ప్రకటన ఇవ్వడమేంటి?. ఛైర్మన్ గారు మీరు టీటీడీకి ఛైర్మన్ టీడీపీకి కాదు. మీరు ఇలాంటి ప్రకటనలు చేయాలంటే మీ పదవికి రాజీనామా చేసి మాట్లాడండి. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వివరణలు ఇవ్వడం మానుకోండి. ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇవిగో అచ్చెన్నాయుడు ఆధారాలు చూపిస్తున్నా....మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. మేం చెప్పేది వాస్తవమో అవాస్తవమో హెరిటేజ్ వెబ్సైట్లో చూడమని ప్రజలను కోరుతున్నా. హెరిటేజ్ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. కేరళ ప్రభుత్వం హెరిటేజ్‌ను బ్యాన్ చేయడమేనా అవార్డు. హర్యానా ప్రభుత్వం లక్ష రూపాయలు ఫైన్ వేయడమేనా రివార్డ్. ఇలాంటి సంస్థకు నేను క్షమాపణ చెప్పాలనడం సిగ్గుచేటు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ జరగాలి.. అదే సమయంలో ఇందాపూర్, తిరుపతి లడ్డూపై చర్చ చేయాలి. నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది..దేవదేవుడి పై నిందలు వేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముందు మీరు చేసిన పనికి తప్పు మాట్లాడామని లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పండి. నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. నేను చంద్రబాబు లాగా అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని కాదు. మేం దేవదేవుడి పవిత్రత గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ధనదాహం గురించి మాట్లాడుతున్నారు. నేను వ్యాపారాలు, షేర్ మార్కెట్ గురించి మాట్లాడలేదు. కేవలం ఏడాది కాలంలో హెరిటేజ్ షేర్ వాల్యూ 300 నుంచి 700 కు ఎలా వెళ్లింది. షేర్ మార్కెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. 2021లో ఈనాడు పత్రిక ఇలాంటి నోటీసు ఇచ్చింది. మూడేళ్లు కిందా మీద పడి నోటీసులు వెనక్కి తీసుకుంది ..మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సంస్థ నోటీసులిచ్చింది. ఈనాడు నోటీసులకే దిక్కులేదు.. చంద్రబాబు ఈ నోటీసులు ఏంచేస్తాయి?చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్తిరుపతి లడ్డూ పై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్‌తో హెరిటేజ్ సంబంధంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎస్ఐపీబీ ద్వారా హెరిటేజ్ సంస్థకు 295 కోట్ల రూపాయల రాయితీ ప్రకటించింది. 35 ఉద్యోగాల కోసం 300 కోట్ల రాయితీ ఇవ్వడమేంటి?. తక్షణమే హెరిటేజ్‌కు ఇచ్చిన రాయితీని కేంద్ర క్యాబినెట్ వెనక్కి తీసుకోవాలిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోంది: కల్పలతారెడ్డిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. సభ బయట మంత్రులు చర్చకు సిద్ధమంటున్నారు. మేం కూడా చర్చకు రావాలనే కోరుతున్నాం. కానీ చర్చకు రావడం లేదని కల్పలతారెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు గుట్టు బయటపడటంతోనే చర్చకు రావడం లేదనిపిస్తోంది. లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చింది. ఇందాపూర్ డెయిరీతో సంబంధాలున్నాయని హెరిటేజ్ వెబ్సైట్లో క్లియర్‌గా ఉంది. హెరిటేజ్‌కు సంబంధం ఉంది.. కాబట్టే చంద్రబాబు ఇందాపూర్‌కు నెయ్యి టెండర్లు కట్టబెట్టారు. 300 రూపాయలకు క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చంద్రబాబు, పవన్ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇందాపూర్ కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు మీరు ఒప్పుకుంటున్నారా? మా డిమాండ్ ప్రకారం కచ్చితంగా సభలో ఇందాపూర్‌పై చర్చించాల్సిందే’’ అని కల్పలతారెడ్డి అన్నారు. -
అచ్చెన్నాయుడుకు ఇచ్చిపడేసిన బొత్స.. బొత్స VS అచ్చం
-
ఇందాపూర్ వెనుక హెరిటేజ్.. మండలిలో దడదడలాడించిన బోత్సా
-
ఎంత రెచ్చిపోతే అంత నాశనమే! TDP మొత్తాన్ని ఏకిపారేసిన బొత్స
-
Botsa : దమ్ముంటే చర్చకు రా..
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్‌గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు...బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్‌ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
కాలమే సమాధానం చెప్తుంది.. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన బొత్స
-
Botsa : మీకు నచ్చినట్లు రాసుకోండి కానీ ఫోటో మాత్రం మంచిది వేయండి....
-
Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?
-
‘మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?’
విజయవాడ: కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టడానికా? అని ప్రశ్నించారు శాసన మండలివ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) శాసనమండలిలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స. ‘ అంబటి రాంబాబు పై దాడి చేస్తే...ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తరువాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యల పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విజ్ఞత కలిగిన వ్యక్తి...అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజా స్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా..??, మరోమాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. రాజకీయాల్లో మహిళలను తీసుకు వచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారు. అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా...??, అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా...?, తల్లి ఎవరికైనా తల్లే. మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?, మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు బొత్స. -
మంత్రి లోకేష్‌కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైఎస్సార్సీపీ సభ్యులు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని సభ్యులు నిలదీశారు. దీంతో, వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, డోలా బాల వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు.ఈ క్రమంలో మంత్రి లోకేష్.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కూల్స్‌లో మౌళిక సదుపాయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్‌కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.అనంతరం, మండలిలో బొత్స మాట్లాడుతూ..‘మేం మీలాగా ఈనాడు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి.. ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్స్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో 8500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 7800 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో బకాయిలున్నాయి పేరుకుపోయాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు, నేడుతో రూపరేఖలు మార్చాం. అధునాతన స్థాయిలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు ఎక్కడివి అక్కడే ఆపివేశారు. కొత్త స్కీమ్స్ ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేయాలి అని డిమాండ్ చేశారు. -
రూ.5 వేల కోట్ల భూమి ‘గీతం’కు ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడు, ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ ఆక్రమణలోని రూ.5 వేల కోట్లు విలువచేసే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా క్రమబద్ధీకరిస్తారని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సంస్థలకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. లులు, సత్వా, ఉర్సా తదితర కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రాసిచ్చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే కేటాయించిన భూముల వివరాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. ఐదు సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయించినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం తీసుకొచ్చేందుకే ఈ కేటాయింపులు చేశామన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్న లేవనెత్తిన మాధవరావు, వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ఐటీ కంపెనీల పేరుతో విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకు 27 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థకు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఇచ్చేశారు. వాస్తవానికి భూములను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించి.. పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలో ఏపీఐఐసీ ఉంది. కానీ వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకిస్తున్నారు? ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ సంస్థలు మెరుగైన అభివృద్ధి చేస్తాయా? 99 పైసలకే భూములు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చా? ఈ విధానం ఎక్కడైనా ఉందా? ఐటీ పార్కుల అభివృద్ధి నుంచి ఏపీఐఐసీని తప్పిస్తున్నారా? ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని కూడా ప్రైవేటు కంపెనీలకు ఎందుకిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.లోపాయికారీ లావాదేవీలే..విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం, డేటా సెంటర్ అని చెబుతూ లోపాయికారీగా వాళ్లకున్న లావాదేవీలతో, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం అతి కారుచౌకగా భూ కేటాయింపులు చేస్తుందని బొత్స మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా 99 పైసలకు భూములు ఇచ్చుకోవచ్చని మంత్రి చెబుతున్నారు. విశాఖలోని విలీన భూములను 99 పైసలకే ఇస్తున్నారు. ఇందులో పారదర్శకత లేదు. వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. పక్క రాష్ట్రాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. అక్కడ మార్కెట్ ధరలకు భూములు కొంటుంటే ఇక్కడ మాత్రం 99 పైసలకే ఇచ్చేస్తున్నారెందుకు? విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఇప్పుడిది కాదు. 2004లోనే ప్రారంభించాం. అప్పుడు ఆ శాఖ మంత్రిని నేనే. 2014–19 మధ్య మీరేం చేశారో మీ తండ్రి (చంద్రబాబు)ని చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎకో సిస్టం, డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారో వాటిని 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక (విశాఖలో అదాని డేటా సెంటర్) తెచ్చింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ భూ దోపిడీకి, లాలూచీలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల వైఎస్సార్సీపీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో ఐదు సంస్థలకు 99 పైసల చొప్పున భూములు కేటాయించడం వాస్తవం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు 13.29 ఎకరాలు, రహేజా రియల్ ఎస్టేట్‌కు 27.1 ఎకరాలు, సంవర్ధన మదర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు 3.55 ఎకరాలను 99 పైసలకే ఇచ్చాం. ఎకరం 99 పైసలకు కాదు. ఆయా సంస్థల్లో ఒక్కో సంస్థకు ఇచ్చిన మొత్తం భూమి 99 పైసలే. – శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానంఏడాది క్రితం రిజిస్టరైన సంస్థలకు రూ.వేల కోట్ల భూములా?గత 20 నెలల కాలంలో 99 పైసలకు ఐదు కంపెనీలకు భూములు ఇచ్చినట్టు చెబుతున్నారని, అయితే గత సంవత్సరంలో రిజిస్టర్ అయిన కంపెనీకి కూడా వేల కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారంటూ ఎమ్మెల్సీ మాధవరావు నిలదీశారు. ‘విశాఖ నడిబొడ్డున లులూ సంస్థకు 13.74 ఎకరాలు 99 ఏళ్లకు లీజుకిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్ల భూమిని లీజుకిచ్చారు. ఇంత తక్కువ పెట్టుబడికి ఎంతో విలువైన భూమి ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం రూ.లక్ష కోట్లు పెట్టి టెండర్లు పిలిచి రాజధాని కడుతోంది. అదే 4.15 ఎకరాలకు టెండర్లు పిలిచి భవనం ఎందుకు కట్టడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘ఇంకా పునాది దశలో ఉన్న అమరావతిలో భూముల ధరల కంటే విశాఖలో ఇంకా తక్కువకు ఇస్తున్నారు. వాస్తవానికి మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తక్కువ ధరకు భూములిస్తారు. కానీ విశాఖలో ఎంతో విలువైన భూమిని ఇంత తక్కువకు ఎందుకిస్తున్నారో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడులు జవాబిస్తూ 1994 నుంచి 2004 మధ్య నాటి సీఎం చంద్రబాబు తక్కువ ధరకు హైదరాబాద్‌లో భూములు కేటాయించబట్టే అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. -
బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి
-
బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి పార్థసారధి
సాక్షి, విజయవాడ: తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ.. ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారధి ఎదురుదాడికి దిగారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా? అంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80 శాతం మందికి పైగా విద్యార్థులకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఇచ్చారని.. రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన మాటలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించండి. నేను చెప్పింది వాస్తవమోకాదో మీ అధికారులతో విచారణ చేయించండి. తప్పు నాదైతే సభకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం’’ అంటూ బొత్స సవాల్ విసిరారు.తానూ 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. మీరు మాకు సభా సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదని బొత్స పేర్కొన్నారు. బొత్స ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి కొలుసు పార్ధసారధి నీళ్లు నమిలారు. బొత్సపై మంత్రి ఎదురుదాడికి దిగారు.సభ అనంతరం బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల్లో రెండు అంశాల పై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలుకే ఇవ్వడం పై ప్రశ్నించామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖలో ఐటీని అభివృద్ధి చేశాం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలుకే భూములిస్తానంటోంది.. ఎందుకు కంపెనీలతో లాలూచీ పడి భూములివ్వాలంటూ బొత్స ప్రశ్నించారు.వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చింది. సీఎం కుటుంబ సభ్యులు 5 వేల కోట్ల భూములు కబ్జా చేశారు. 5 వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని గీతం సంస్థ చెబుతోంది. వేల కోట్ల భూములు కబ్జా చేయడమేంటి?. పెన్షన్లపై ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగంపై అధికారపార్టీ సభ్యులు డబ్బాలు కొట్టారు. ప్రతీ ఒక్కరికీ 15 వేలు తల్లికం వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందరికీ ఇచ్చారా అని ప్రశ్నిస్తే సమాధానం లేదుతల్లికివందనం డబ్బులో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. చాలామంది ఖాతాల్లో ఏడెనిమిది వేలే జమ అయ్యాయి. మేం చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపిస్తే మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పా. మేం వేసిన ప్రశ్నకు అడ్డగోలుగా మంత్రి సమాధానం చెబుతున్నారు. 15 ఏళ్లు నేను కూడా మంత్రిగా చేశా. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు చేతనైతే మీ అధికారులతో ఎంక్వైరీ చేయించండి. మేం చెప్పింది అసత్యమని నిరూపించండి. ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలి.ప్రతిపక్షం చెప్పిన విషయాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తదా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ శాసనమండలి సమావేశంలో మాటలతో రఫ్ఫాడించిన బొత్స
-
మేము అడిగింది చెప్పు.. కౌన్సిల్ లో అచ్చెన్నాయుడికి బొత్సా కౌంటర్
-
‘రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రస్టేషనలో ఉన్నారని, ఆయన ఏదోదో చేద్దామనుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు( మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని. రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స. ‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాలేవు. ప్రజలు అర్ధాకలితో ఉంటే పట్టించుకోవటం లేదు. రాష్ర్టంలో పాలన గాలికి వదిలేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబిఐ చెప్పింది. ఇక దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు?, సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు?, అసలు ఆ కమిషన్‌కి చట్టబద్ధత ఉంటుందా?, చంద్రబాబు సిట్ నివేదికను బయట పెట్టాలి. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బొత్స తెలిపారు. -
జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స
-
చిప్ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘ఒక మాజీ మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి?. పెట్రోల్ బాంబులు వేయడాన్ని జై ఆంధ్ర ఉద్యమం సమయంలో చూశా. పోలీసులు ఉంది దేనికి అసలు?. పోలీసులంటే దాడులు ఆపాలి. అదీ పోలీసింగ్ అంటే. కానీ, ఇక్కడ పోలీసులు గూండాలకు ఎస్కార్టులుగా, రక్షణగా ఉంటున్నారు. పోలీసులు, గూండాలు కలిసి దాడికి వస్తారా?. ఇదెక్కడైనా చూశామా?. 30 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి?. ఏ సెక్షన్లు పెట్టాలి?. దాడులు చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారా?..304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు...కారణమేంటి?. .. జోగి రమేష్ ఇంటిపై దాడి హేయమైన చర్య. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదు. ఇది పక్కా ఆర్గనైజ్డ్ దాడి. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబూ.. అసలు మీ ఆలోచన ఏంటి ?. జోగి రమేష్ అన్నదాంట్లో తప్పేముంది?. ఆయన చెప్పినట్లు మంత్రి లోకేష్‌కే కాదు చంద్రబాబుకి కూడా చిప్ పోయినట్లు ఉంది. చిప్ పోతేనే ఇలాంటి పనులు చేస్తారు. రాజకీయాల్లో సంమయనం పాటించాలి కానీ.. ప్రతీకారాలకు పాల్పడకూడదు. జోగి రమేష్ కు కూడా నేను ఇదే సూచించా. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకోవద్దని జోగి రమేష్ చెప్పా. ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం....చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?. రాష్ట్రంలో అసలు పాలన ఉందా?. శాంతి భద్రతలు అసలు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి దాడులు రాజకీయంగా చాలా తప్పు. ప్రజాస్వామ్యం గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. తాను ఏం మాట్లాడుతున్నారో .. తాను చెప్పిన సనాతన ధర్మమేంటో పవన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నా దాడులు ...ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు పవన్‌కు కనిపించడం లేదా?. .. రాజకీయంగా మీరు తప్ప వేరే ఎవరూ బ్రతక కూడదా?. చంద్రబాబూ.. ఏమైంది మీ జ్ఞానం?. మీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. ఈ దాడుల పై న్యాయపోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలిపించడం ధర్మమేనా ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం ప్రమాదకరం’’ అని బొత్స అన్నారు. ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచన ఉందా... ప్రతీదీ డైవర్షన్ చేయడమేనా?. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పింది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయిస్తారా?. లడ్డూ వ్యవహారం పై సిట్ ఏమి చెప్పిందో మీరెందుకు చెప్పలేకపోతున్నారు. లడ్డూ అంశం పై ఏకసభ్య కమిషన్ వేయడం దేనికి?. పవన్ ,లోకేష్ ,బీజేపీ నేతలను ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయొచ్చు కదా!. ఆ దేవదేవుడిని ఎందుకు రోజూ కించపరుస్తున్నారు?. దేవుడితో రాజకీయాలెందుకు?.. దేవుడే అన్నీ చూస్తున్నాడు. తప్పు చేస్తే..తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది...అంతే కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన వారిని ఎవరినీ వదలం. చట్టముందు దోషులుగా నిలబెడదాం..ఈ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడ మాదిరి ఉంది. చంద్రబాబు తనను విశ్వామిత్రుడు, వశిష్టమహర్షిగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందని ఎన్ని కేసులైనా పెడుతుంది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. మా నేతల పై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఇది అని బొత్స మండిపడ్డారు. -
Botsa: అంబటి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు మొదట బూతులు తిట్టింది వాళ్లే
-
Botsa : రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?
-
Botsa: రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకుంటున్నారా చంద్రబాబూ?
-
చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో దమనకాండపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో.. నారాలోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ సోమవారం (2-2-2026) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత మూడ్రోజులుగా కూటమి సర్కార్ విధ్వాంసానికి పాల్పడింది. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా? దాడుల్ని ప్రోత్సహించి అప్రతిష్టను మూటగట్టుకోవద్దు చంద్రబాబు. చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తారా? రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు స్పందించలేదు. కేంద్ర మంత్రే స్వయంగా తడాఖా చూపిస్తాం అని అంటున్నారు. కేంద్రమంత్రి హుందాగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. రాష్ట్రంలో జరిగే దాడులను ప్రజలు గమనిస్తున్నారు.ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి చంపాలని అనుకుంటున్నారా?.ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఆలోచించాలి. పోలీసులు వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. తప్పులు చేస్తుంటే దేవుడు క్షమించరు. సంక్షేమాన్ని గాలికొదిలేసి దాడులకు తెగబడతారా?. సంపద సృష్టి పేరుతో వైజాగ్‌లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. రాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఆరాచకాలు తారాస్థాయికి చేరి వైఎస్సార్సీపీ నేతలపై, నివాసాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలోనూ మరో సమావేశం నిర్వహించనుంది.కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ గూండాల హింసాకాండపై సజ్జల, బొత్స.. జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. యధేచ్చగా సాగుతున్న అరాచకాలను అహింసా మార్గంలో ఎదుర్కొవడం.. చట్టపరమైన ఫిర్యాదులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బ్రాహ్మణ నాయకులతోనూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ విష ప్రచారం ముదుతున్న వేళ.. బ్రహ్మణ నేతలతోనూ సజ్జల, బొత్స భేటీ కానున్నారు. తిరుమల మహా ప్రసాద అంశంతోపాటు కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైనంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. -
విశాఖ చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కౌన్సిల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారు. మహిళా కార్పొరేటర్లని కూడా చూడలేదు. డిప్యూటీ మేయర్‌పై పాశవికంగా దాడి చేశారు. అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి?.... కూటమి ప్రభుత్వంలో సిగ్గూ, శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే భూముల్ని గీతంకు కట్టబెట్టారు. గీతంకు భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్‌డే. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.అంతకు ముందు.. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ నేతలంతా నల్ల కండువాలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందన్నారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారాయన. గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో గీతం భూముల క్రమబద్దీకరణ చేసింది కూటమి ప్రభుత్వం. -
గీతం ల్యాండ్ స్కాం ఇష్యూపై పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
-
‘గీతం భూ కబ్జాపై పవన్ మాట్లాడాలి.. పచ్చ మీడియాకు కళ్లు లేవా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ స్టాండ్ ఏమిటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాటం లేదు. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు.విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. రుషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకునేతల పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు, మాజీ మంత్రి అమర్నాథ్ నియోజకవర్గ సమన్వయకర్తలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ వేయాలంటూ డిమాండ్ చేశారు.అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘చంద్రబాబు భూ దోపిడీని అడ్డుకోవడానికి గీతం యూనివర్సిటీకి వచ్చాము. చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదువేల కోట్ల భూమి ప్రభుత్వానికి చెందిందని గత వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో హెచ్చరిక బోర్డులు పెట్టాం. ప్రభుత్వ భూమిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారా?. చంద్రబాబు లెజెండరీ అని రోజూ సొల్లు కబుర్లు చెబుతారు. భూ కబ్జాలు చేయడమేనా మీ లెజెండరీ. ఏబీఎన్, టీవీ-5, ఈనాడులకు భూ దోపిడీ కనిపించడం లేదా?. భూ కబ్జాపై నోరూ విప్పాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌కు ఉంది. విశాఖలో ఉండి కూడా పవన్ గీతంపై ఎందుకు మాట్లాడలేదు?. గీతం భూ దోపిడీపై బీజేపీ, జనసేన మాట్లాడాలి. అవసరమైతే గీతం భూకబ్జా భూములను పరిశీలించడానికి వైఎస్ జగన్‌ను పిలుస్తాము. చంద్రబాబు భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలి. భూ దోపిడీని రేపు కౌన్సిల్లో అడ్డుకుంటాం అని హెచ్చరించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘గీతం సంస్థకు భూమి కట్టబెట్టడంలో ప్రభుత్వం బరితెగించింది. భూములను ధారాదత్తం చేస్తే అడిగే వారు లేరని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. మా ప్రభుత్వం టూరిజం భవనాలు కడితే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గీతం సంస్థకు 55 ఎకరాలు కట్టబెడుతుంది ప్రభుత్వం. గీతం భూ కబ్జాపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటి?. గతంలో ఇక్కడికి వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ఏం తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటమే మీ స్టాండా పవన్?. తిరుమల లడ్డు విషయం ఇప్పుడు పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.జీవీఎంసీ అజెండా నుంచి గీతం భూముల అంశం తీసేయ్యాలి. లేదంటే జీవీఎంసీ కౌన్సిల్ జరగనివ్వం. విశాఖలో భూ కేటాయింపులు దేశంలోనే పెద్ద స్కాం. గీతం సంస్థ కబ్జా చేసి కేటాయించమని అడుగుతుంది. ఈ కబ్జాను అంగీకరించిన రోజే ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రచ్చ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ నడుస్తోంది. ఎంపీ భరత్ మీద కేసు పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్న భూములను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘రుషికొండ ప్రభుత్వ భవనాలపై తప్పుడు ప్రచారం చేశారు. గీతం కబ్జాపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వేల కోట్లు విలువైన భూమి కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం. గీతంలో డబ్బున్న వారు చదువుతారని ఎంపీ చెప్పారు. చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని చట్టం ఏమైనా చేశారా?. కూటమి జమానాలో భూ కబ్జాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. గీతం కబ్జాపై కూటమి నేతలకు బాధ్యత లేదా?. ఈ భూమిని కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. -
Botsa: విశాఖ ప్రజలు కళ్లు తెరవకపోతే మొత్తం దోచేస్తారు..
-
‘ఎంపీ భరత్ భూ దోపిడీ.. పవన్, బీజేపీకి కనిపించట్లేదా?’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్‌గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.మరోవైపు.. విశాఖ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్‌కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
‘చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత’
విశాఖ: చంద్రబాబు బరితెగించి ప్రభుత్వ భూములను దోపీడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తామరని ధ్వజమెత్తారు. ప్రధానంగా గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈరోజు( మంగళవారం. జనవరి 27వ తేదీ)జీవీఎంసీ కార్పొరేటర్లతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, కన్నా బాబు, గుడివాడ అమరనాథ్, కేకే రాజు, వాసుపల్లిలు సమావేశమయ్యారు. 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎంపీ భరత్ యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 5 వేల కోట్ల విలువ చేసే భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 30వ తేదీన జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామని ఇప్పటికే వైఎస్సార్సీపీ హెచ్చరించగా, ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ భూములను కాపాడటం కోసం వైఎస్సార్సీపీ పార్లమెంట్ వరకూ పోరాటం చేస్తోంది. ప్రభుత్వ భూములను విశాఖ ఎంపీ భరత్ కబ్జా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తారు. గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. గీతం యూనివర్శిటీకి ఇచ్చిన భూములపై మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’’ అని బొత్స పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయం. ఆ మేరకు కేడర్ పని చేయాలి’’ అని బొత్స పిలుపునిచ్చారు. -
ఇది దివాళాకోరు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మూడు పార్టీల పొత్తుతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుపట్టిస్తోందని శాసనమండలిలో విపక్షనేత, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం నేడు పూర్తిగా దివాళా తీసిందన్నారు. విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో విలువైన భూములను చంద్రబాబు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఉత్తరాంధ్ర భూములను వారికి 99 పైసలకే ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రక్తం పారిస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీకి ఓటేశారన్న నెపంతో 200 కుటుంబాలను రెండేళ్లుగా గ్రామం నుంచి బహిష్కరించారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన సాల్మన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆయన అంత్యక్రియలకు వచ్చిన వారిని.. బంధువులను సైతం ఆధార్ కార్డులు చూపాలని పోలీసులు అడిగారు. ఇదేనా ప్రజాస్వామ్యం?. పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం’ అని టీడీపీ నేతలకు హితవు పలికారు. అట్టర్ ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా ? ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ విఫలమైన కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. పరిశ్రమలు రావాలంటే విశాఖలోనే భూములివ్వాలా? అమరావతిలో భూములు ఇవ్వవచ్చు కదా? ‘కేంద్రంలో భాగస్వామి అయిన చంద్రబాబు కేకే లైన్ వంటి కీలక భాగాన్ని ఒడిశాకు అప్పగించి.. ఆదాయం లేని ప్రాంతాలతో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం వలన ఎవరికి లాభం? ఇది పక్కా మోసం. హైదరాబాద్‌లో చిన్న అపార్టుమెంట్లో ఏర్పాటైన ఉర్సా రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖలో భూములు కట్టబెట్టారు. ఆ సంస్థ ఏర్పాటై మూన్నాళ్లే అయింది. వాళ్లు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం ఏమిటి. విశాఖ భూములు కేటాయించడం ఏమిటి.. ఇదంతా పెద్ద కుంభకోణం’ అని కన్నబాబు ఆరోపించారు. -
చంద్రబాబూ.. ఇదేం పాలన..?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండగ సంతోషం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పండగ ముందే మద్యం ధర పెంచారు.. భూముల విలువ కూడా పెంచేశారు.. భూములు కొనాలంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికీ యూరియా అధిక ధరకే దొరుకుతుంది’’ అంటూ మండిపడ్డారు.‘‘విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 5వేల 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కిపోయిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. గ్రీన్ కో కంపెనీకి అభినందనలు. మేము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేము భూములు ఇవ్వలేదు’’ అని బొత్స పేర్కొన్నారు...ఈ రెండేళ్లలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది?. ప్రభుత్వం నుంచి ఎవరైనా సమాధానం చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. గతంలో ఎప్పుడైనా గ్రామ బహిష్కరణ ఉందా..?. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?. ఊరిలోకి వస్తే మనుషుల్ని చంపేస్తారా..?. దహన సంస్కారాలకు వెళ్లాలంటే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాలా?. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా. ఇలాంటి ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదు...సాల్మన్ హత్య అత్యంత దారుణం. ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది అని ప్రధాని మోదీ అంటున్నారు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..?. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా స్పందించాలి. కూటమి పాలనలో ఏమి జరుగుతుందో ప్రధాని తెలుసుకోవాలి. సాల్మన్ హత్య అత్యంత దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నాం.. చంద్రబాబు.. ఇదేనా పరిపాలన..?..ఏం చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నావ్.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులకు ఎక్కడా మేలు చేయడం లేదు. వైఎస్సార్ సంక్షేమ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. సంక్రాతి మూడు రోజులు.. ఏ టీవీ చూసినా.. కోడి పందాలే. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. పరిశ్రమలతో మా హయాంలో జరిగిన ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి’’ అని బొత్స చెప్పారు. -
బొత్స ఇంటి వద్ద భోగి సంబరాలు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ పై బొత్స సత్యనారాయణ రియాక్షన్
-
రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గంగలో కలిపారు
ఎంవీపీ కాలనీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే తీరును మరోసారి బట్టబయలు చేశాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బొత్స విలేకరులతో మాట్లాడుతూ, ‘చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసిమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించినట్లు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం ఎలా తాకట్టుపెడుతున్నారో స్పష్టమవుతోంది. పైగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అబద్ధమంటూ ఏపీ ప్రభుత్వం లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. సూపర్ సిక్స్ హామీలు కొండెక్కడంతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చొరవతోనే వేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంసీఎంగా వైఎస్ జగన్ చొరవలు, విజ్ఞప్తి ప్రకారమే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా పూర్తిచేసిందన్నారు. ఇందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. శంకుస్థాపన సమయంలో తొలుత 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేస్తామని జీఎంఆర్ ప్రకటించారు. అయితే అప్పటి సీఎం జగన్ కలుగజేసుకుని మరింత త్వరగా పనులు పూర్తిచేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దానికి జీఎంఆర్ అంగీకారం తెలిపింది. ఎయిర్‌పోర్టు పనులు పూర్తిచేయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని బొత్స వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మేల్యే ధర్మశ్రీ, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?: ప్రభుత్వానికి బొత్స సూటి ప్రశ్నలు⇒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తానే పూర్తిచేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న బాబు ప్రభుత్వం గంగవరం ఎయిర్పోర్ట్ ఆధునీకరణ పనులను ఎందుకు చేయించలేకపోతోంది?⇒ భోగాపురం ఎయిర్పోర్ట్–విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ పనులు ఎందుకు వేగంగా జరగడంలేదు? పోర్ట్ టు ఎయిర్పోర్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం బీచ్‌రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు వేసింది. ఆ డీపీఆర్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ ఆమోదం తెలిపారు. అయినా ఆ పనులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు చేపట్టలేకపోయింది? ⇒ కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాలకెళ్లిన సీఎం దేశ చరిత్రలో చంద్రబాబు మినహా మరెవ్వరూలేరు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన రహస్య పర్యటనకు కారణమేమిటి?⇒ జగన్ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న పార్టీ కార్యకర్తలపై ‘జంతుబలి’ అంటూ కేసులు పెట్టి రోడ్డుపై నడిపించి చిత్రహింసలు పెట్టిన పోలీసు యంత్రాంగం, గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ పోస్టర్ల ఎదుట ఇదే తీరుగా వ్యవహరించిన వారిని ఎందుకు పట్టించుకోలేదు? -
‘‘భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కచ్చితంగా వైఎస్ జగన్‌దే’’
విశాఖపట్నం: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలనలో అనని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శంచారు. ఈరోజు(ఆదివారం, జనవరి 4వ తేదీ) విశాఖ నంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ..‘ కూటమి నేతలకుఉ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. కూటమి పాలనలో అంతా ఇబ్బందులు పాలవుతున్నారు.రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల దగ్గర మాత్రం యూరియా ఉంటుంది. దాన్ని వార బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారు.కూటమి నేతలు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడగా యూరియా అమ్ముతున్నారు. పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించింది తక్షణమే ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.ఆ క్రెడిట్ కచ్చితంగా వైఎస్ జగన్దేభోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు బొత్స సత్యనారాయణ. ‘ భూ సేకరణ జగన్ చేశారు. నిధులు కేటాయించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రారభోత్సవానికి నేను వెళ్లాను. అప్పుడు ప్రభుత్వ పెద్దలు జీఎంఆర్న అభినందించారు.ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు జీఎంఆర్ పేరు ఎందుకు చెప్పడం లేదు?, విశాఖ మాస్టర్ ప్లాన్ ఏమైంది..?, ఎందుకు ఫైనల్ చెయ్యడం లేదు..?. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే..కనెక్టింగ్ రోడ్స్ పూర్తయ్యేవి. రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ అని అన్నారు. ఒక్క అమ్మాయిని అయినా తీసుకొచ్చారా..?, ఉత్తరాంధ్ర ఎప్పుడూ సురక్షితమే. ఈ మధ్య కాలంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు. -
ప్రశ్నిస్తే బెదిరింపులా?.. మీ భాషేంటి?: బొత్స సీరియస్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్‌కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు. -
‘2 లక్షల 66 వేల కోట్లు అప్పులు.. ఒక్క కొత్త పెన్షనైనా ఇచ్చారా?’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్‌లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందిచంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదురాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారుచంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు.. -
కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
-
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ
-
18 నెలల్లో ఏపీలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి లేదు: బొత్స
సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు... గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు. -
మండలి ఛైర్మన్ నిర్ణయం సరైనదే .. ఎమ్మెల్సీల రాజీనామాలపై బొత్స రియాక్షన్
-
కేసులు ఎదుర్కొనే ధైర్యం లేక.. చంద్రబాబు అడ్డదారులు: బొత్స
సాక్షి, విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధికార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు. తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..కుట్రపూరితమే..‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌కు కూడా పంపింది.ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. ఇవికాక అసైన్డ్ ల్యాండ్ కేసు, అమరావతి రింగ్‌రోడ్డు అలైన్మెంట్ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్ నెట్లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు. -
సొల్లు కబుర్లు ఆపు.. నీకు చేతకాకపోతే బాబును రఫ్పాడించిన బొత్స
-
Botsa: తల దించుకుంటా మీకు దమ్ముంటే నిరూపించండి
-
విశాఖలో భూ దోపిడీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని, ఓపెన్ ఆక్షన్ లేకుండానే నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎకరం 99 పైసలు, రూ.100కే కట్టబెడుతూ భూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో గుడ్ గవర్నెన్స్ అర్థమే మార్చేశారని, ఏ కార్యాలయానికి వెళ్లినా లంచం లేకుండా పని జరగడం లేదన్నారు. ఈ అవినీతి వెనుక అధికార పార్టీ నేతల లావాదేవీలే కారణమన్నారు. ఆదివారం ఆయన విశాఖ లాసన్స్‌బే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.భూ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా రెండు జీవోలు జారీ చేయడంపై స్పందిస్తూ.. రహస్యంగా ఒప్పందాలు చేసుకుని, కోట్ల విలువైన భూములను పప్పుబెల్లాల్లా కేటాయిస్తుండటం దారుణం అని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. గిరిజన బాలింత మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించిన పాపాన పోలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా గాలికొదిలేశారని.. పిల్లలు కలుషి త ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ ఘనత వైఎస్సార్సీపీదే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్సార్సీపీదే అని, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున మండలి విపక్ష నేతకు ఆహా్వనం లేకుండా చేసి, ఈ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని, సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలును మార్క్ ఫెడ్ ద్వారా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు.‘ఉపాధి’ కూడా నీరుగారిపోయిందని చెప్పారు. భూసేకరణ పేరుతో అమరావతిలో జరుగుతున్న భూ దోపిడీ సహా అన్నీ త్వరలోనే ప్రజలకు అర్థమవుతాయని స్పష్టం చేశారు. భూ సేకరణపై అమరావతి రైతుల విధానమే తమ విధానం అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పడానికి కోటి సంతకాల కార్యక్రమానికి వస్తున్న స్పందనే నిదర్శనం అన్నారు. సిరిమాను జాతర సందర్భంగా వేదిక కూలడం, తన భద్రతపై ప్రభుత్వం అలసత్వం వహించడంపై గవర్నర్‌కు లేఖ రాశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణ రాజు, వైఎస్సార్సీపీ నేత మూగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మీకు అధికారం ఇచ్చినందుకు రైతులకు బాగా బుద్ది చెప్పారు..
-
‘రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు’
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారాయన. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వలన రైతులు నష్టపోయారని, రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదన్నారు బొత్స. ‘రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు..గత ప్రభుత్వ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల సమస్యలు తీవ్రంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంకు లేఖలు రాస్తారా.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు. క్వింటా రేటు రూ. 2300 నుంచి రూ. 1500 లకు పడిపోయింది.ప్రభుత్వ దృష్టి విశాఖ భూముల మీద ఉంది.ఎవరికి 99 పైసలకే భూములు కట్టబెట్టాలని చూస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇచ్చినప్పుడు ఎందుకు పారదర్శకత పాటించలేదు.కోట్లాది రూపాయల భూములను 99 పైసలకే ఎలా ఇస్తున్నారు.. విశాఖలో భూములను వేలం పెట్టి ఇవ్వాలి. భూములు పేరు చెప్పి దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ పథకాలకు ప్రభుత్వ పెద్దలు పేర్లు మార్చి పబ్బం. గడుపుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది.గతంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు తీరకుండానే అమరావతికి భూసేకరణ అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు భూసేకరణ చేయలేకపోయారు. కేజీహెచ్ పై ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదు. లులు ఒక పనికిమాలిన సంస్థ.అటువంటి సంస్థకు భూములు ఇచ్చారు.ఇనార్బిట్ మాల్ కు, లులు సంస్థకు పోలికలే లేదు’ అని మండిపడ్డారు.. -
Botsa: పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా సమన్వయ సమావేశం
-
ఉచితంగా విద్య, వైద్యం ప్రభుత్వం బాధ్యతే
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను అందజేసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరుతూ గురువారం విజయవాడలో ఆయన్ని కలిశారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులతో కలసి బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులతో పాటు ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి గవర్నర్‌కి సమర్పించనున్నట్లు బొత్స పేర్కొన్నారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.ప్రజారోగ్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలే గానీ ప్రైవేటు ఆధీనంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. ప్రజారోగ్యం కోసం పరితపించిన వ్యక్తిగా వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్‌కు పేరు వస్తుందన్న అక్కసుతోనే మిగిలిన వాటిని సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా ట్యాబులిస్తే గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశాం. ఈ క్రమంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించి, ప్రభుత్వ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంస్థలతో టై అప్ చేసి పనులు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించే ఏర్పాట్లు చేశాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం మారిన తర్వాత మెడికల్ కాలేజీలని్నంటినీ పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం పేదలకు చికిత్స చేయాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కాని పరిస్థితి నెలకొంది.వైఎస్సార్ పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా వైద్య చికిత్స పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 2 వేల వరకు అదనపు ప్రొసీజర్లను చేర్చడంతో పాటు ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షల వరకు విస్తరించారు. ఈ ప్రభుత్వానికి పేదలపై ఇంత కక్ష ఎందుకు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేయలేదా? బిల్లులు విడుదల కాకపోవడంతో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందని పరిస్థితి నెలకొంది. పథకాన్ని నీరుగార్చి బీమా పరిధిలోకి తెస్తామంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 60 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. రూ.14 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించాం. ఇంత డబ్బు ప్రైవేటు సంస్థలు అందిస్తాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజారోగ్యం నాశనం అయిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? ఇది దోపిడీ కాదా? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారు. ఏ పంటకూ మద్దతు ధర లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రాయలసీమలో అరటి పంట తీవ్ర సంక్షోభంలో పడింది. 18 నెలలుగా శాంతి భద్రతలు దిగజారాయి. సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతున్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పేరు ఉచ్ఛరించడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు. రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష నేతలను, వారి ఉనికిని కూడా భరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ గతంలో ఆయన చేసిన ప్రసంగాలను ఒక్కసారి మళ్లీ వింటే బాగుంటుంది. ఆయన బూతులు మాట్లాడితే ఒప్పా? కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత కూడా అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? -
Botsa : జగన్ కు మంచి పేరు వస్తుందనే బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు


