రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి | YSRCP Leaders Supports Fishermen Protest Against Bulk Drug Park in Rajayyapeta | Sakshi
Sakshi News home page

రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి

Oct 23 2025 4:48 AM | Updated on Oct 23 2025 4:48 AM

YSRCP Leaders Supports Fishermen Protest Against Bulk Drug Park in Rajayyapeta

మత్స్యకారులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు తదితరులు

బల్క్‌డ్రగ్‌ పార్కు రానివ్వబోనని ఎన్నికలకు ముందు చెప్పింది తప్పని ఒప్పుకో

అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఊరుకోబోం 

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌పై రైతుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్ధతు

రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ బొత్స

పాల్గొన్న రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కన్నబాబు, మాజీ మంత్రులు గుడివాడ, ముత్యాలనాయుడు

సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేత­లు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామ­స్తులకు బల్క్‌ డ్రగ్‌ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడు­చు­గా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రా­గానే ఆందోళన చేస్తున్న వారిపై కేసు­లు పెట్టి ఉద్య­మాన్ని అణిచివే­యాలని కుయుక్తులు పన్ను­తు­న్నారంటూ మండిపడ్డారు.

బల్క్‌ డ్రగ్‌ పా­ర్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజ­య్యపేట ప్రజలకు క్షమా­పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నిక­లకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హిత­వు ç­³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణ­యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

మత్స్యకారులకు బాసట
రాజయ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్య­కా­రులకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, అన­కాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యా­ల­నాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగు­లు, జిల్లా పరి­షత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, పార్లమెంట్‌ సమన్వ­య­కర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమా­వతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమా­­శంకర్‌ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సా­ర్‌సీపీ నేతలు మత్స్యకా­రులను కలిసి బాస­టగా నిలిచారు.

వారి పోరాటానికి సంఘీభావం తెలి­పారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకా­రులు వివరించారు.మాజీ సీఎం వైఎస్‌ జగన్‌­తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.  దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్‌ కళా­శాల సందర్శనకు వచ్చిన వైఎస్‌ జగన్‌ దృష్టికి బల్క్‌ డ్రగ్‌ పార్కు సమ­స్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్‌­సీపీ అధికా­రంలోకి వచ్చిన వెంటనేమత్స్య­కారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసా­ని­చ్చారు.

‘‘ఏ ప్రాంతానికి పరిశ్ర­మ­లు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాల­న్నదే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పా­టు ఆ ప్రాంత ప్రజల మనో­భావాలకు, అభిప్రా­యాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాల­న్నదే మా పార్టీ అభి­మతం’’ అని చెప్పారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు­కు వ్యతి­రేకంగా పోరాడు­తున్న మత్స్యకా­రులపై ఎదురు­దాడి తగదన్నారు. రాజ­య్యపేటలో 3 వేల మంది పోలీసు­లను మోహరించడం కూటమి ప్రభుత్వ దు­ర్మార్గ చర్య అని నిరసి­ంచారు. రైతులు టెర్రరి­స్టులా అని ప్రశ్నించారు. అచ్యుతా­పురం సెజ్‌లో కూడా ప్రజ­లను ఒప్పి­ంచి భూసేక­రణ చేశామని, రణ­స్థలం, బొబ్బి­లి వంటి­ప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతుల­ను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.

మత్స్యకారులకు సమాధానం చెప్పాలి 
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లా­డుతూ బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుపై మత్స్య­కారులు చేస్తున్న ఉద్య­మాన్ని ఉక్కుపా­దంతో అణచివే­యాలని హోంమంత్రి అనిత యత్ని­స్తున్నారని విమర్శించారు. అనిత ప్రతి­పక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరి­కాదన్నా­రు. మత్స్యకారుల అ­భ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతి­స్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా  భయపడేది లేదన్నారు.  గుడివాడ అ­మర్‌­నాథ్‌ మాట్లా­డు­తూ ఈ ఉద్య­మా­నికి వైఎ­స్సార్‌సీపీ మద్దతుంటుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement