
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్‌లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్‌సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది.
ఇదీ చదవండి:
నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?