పర్యాటక రంగంలో రాపిడో సేవలు | Rapido services in the tourism sector: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగంలో రాపిడో సేవలు

Nov 28 2025 5:43 AM | Updated on Nov 28 2025 5:43 AM

Rapido services in the tourism sector: Andhra Pradesh

సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రైవర్‌–కం–గైడ్‌’ సేవలను అందించనుంది. ఈ మేరకు సీఐఐ సదస్సుల్లో రాపిడో సహ–వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లితో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకోగా, సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు గురువారం పర్యాటక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

మంచి రేటింగ్‌ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలు ప్రారంభించనుంది. రాపిడో యాప్‌లోనే టూరిస్ట్‌ ఆటోలు/క్యాబ్‌లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉంచనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement