భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరు. ఆమె వంట గ్యాస్, టాయిలెట్ లేదా విద్యుత్ సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తుండటం ఆసక్తికరం. పదండి మరి ఆమె ఎవరో? ఎక్కిడి వారో వివరాలు తెలుసుకుందాం.
భారతదేశంలో తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లి గ్రామ నివాసి. ఆధార్ కార్డు మహిళగా ప్రసిద్ధి చెందిన రంజనా సోనావానే. 2010న సెప్టెంబర్ 29,అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హాజరైన ఆధార్ కార్యక్రమం జాతీయ ప్రారంభోత్సవంలో ఈ కార్డు జారీ చేశారు. ఆధార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.
చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?

ఎవరీ రంజన సోనావానే?
మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో ఒక పూరిగుడిసెలో నివసించే మహిళ రంజనా. ఆమె భర్త సదాశివ్ దినసరి కూలీ.వీరికి ముగ్గురు పిల్లలు. ప్రత్యేక గుర్తింపు కార్డు పొందిన తొలి వ్యక్తి అయినప్పటికీ, వంట గ్యాస్, టాయిలెట్, విద్యుత్తు లాంటి కనీస సౌకర్యాలేవీ లేవు. అందుకే తొలి ఆధార్ కార్డు పొండదంలో గొప్ప ఏముంది? ఇదో గొప్ప విజయమా. లాటరీ గెలిచనట్టుగా కాదు కదా అని అప్పట్లోనే తన నిర్లిప్తతతను ప్రకటించింది. తమలాంటి పేదవాళ్లు, గిరిజనుల కోసం ఏ మీ చేయాలేదు, ఓట్లు మాత్రం అడుగుతారు అంటూ అప్పటి మంత్రులపై నిరసనను సోనావానే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించింది.
ఇదీ చదవండి: ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాప్యతకు అంత్యంత కీలకమైన ఈ కార్డు ద్వారా తనకు ఒరిగిందేమీ లేదని ఒక సందర్భంలో వాపోయింది. ఆధార్ కార్డు తనకు ఉద్యోగం పొందడానికి సహాయ పడుతుందని మొదట్లో భావించానని, కానీ తర్వాత తాను పొరబడ్డానని గ్రహించానని కూడా చెప్పింది. ఆధార్ కార్డు పొందిన తొలి భారతీయురాలిగా పదిహేను సంవత్సరాలు గడిచినా, 54 ఏళ్ల రంజనా సోనావానే తనకు ప్రభుత్వపరంగా ఉద్దేశించిన ప్రాథమిక సంక్షేమ ఫలాలేవీ అందలేదని తెలిపింది.


