నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్‌పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.
‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్‌లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.
ఆపరేషన్ సిందూర్‌లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.
కాగా, భారత్‌లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్‌ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు.


