breaking news
bomber
-
ఉగ్రవాదుల మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేల్చిన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ, అతని ఉగ్రముఠా సభ్యుల మధ్య విభేదాలు మొదలు వాళ్ల గత వ్యూహరచనల దాకా ఎన్నో కొత్త అంశాలు దర్యాప్తువేళ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రభావజాలం, నిధుల సమీకరణ, పేలుళ్లను అమలుచేసే వ్యూహాలపై డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, మౌల్వీ ముఫ్తీ ఇర్ఫాన్ వాగయ్ల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయని వెల్లడైంది. గొడవ కారణంగా అక్టోబర్‌లో డాక్టర్ రాఠర్ వివాహవేడుకకు డాక్టర్ ఉమర్ హాజరుకాలేదు. వైద్యురాలు షాహీన్ సయీద్ నుంచి నిధులను ఉమర్ విచ్చలవిడిగా ఖర్చుచేసేవాడని తోటి ముఠా సభ్యులు ఆరోపించేవారు. అయితే కశ్మీర్ లోయలో మతబోధకుడు వాగయ్ను అరెస్ట్‌చేశారని తెలియగానే ఉమర్ అప్రమత్తమయ్యాడు. అక్టోబర్ 18వ తేదీన ఖ్వాజీగండ్కు వెళ్లి తోటి ఉగ్రవాదులతో సయోధ్య కుదుర్చుకున్నాడు. గొడవలు పక్కనబెట్టి కలిసి పనిచేద్దామని ఒప్పించాడు. అయితే ఘనీ, రాఠర్, వాగయ్లు అల్‌ఖైదా అంతర్జాతీయ ఉగ్రసంస్థ తరహాలో కార్యకలాపాలు చేయాలని ఆశించేవారు. ఉమర్ మాత్రం ఐసిసి ఉగ్రసంస్థ తరహాలో పనిచేయాలని పట్టుబట్టేవాడు. 2023 నుంచే శక్తివంతమైన పేలుడుపదార్థాల తయారీకోసం పలు రసాయనాలపై ఉమర్ ప్రయోగాలు చేసేవాడని విచారణ సందర్బంగా తోటి ఉగ్రవాదులు చెప్పారు. అల్‌ఖైదా అనేది పశ్చిమదేశాల సంస్కృతులను తప్పుబడుతూ శత్రుదేశాలపై దాడులు చేసేది. ఐసిస్ మాత్రం మతఛాందసవాదాన్ని ఎగదోస్తూ తమ ఉనికి ఉన్న దేశాల్లో ఇస్లామిక్ రాజ్యం(ఖలీఫేట్) స్థాపనకు ఉబలాటపడేది.ఆరేళ్ల క్రితమే ఉగ్రభావజాలం మొదలుడాక్టర్ ఉమర్, డాక్టర్ ఘనీ, డాక్టర్ రాఠార్, డాక్టర్ ముజఫర్లే 2019లో తొలిసారిగా విదేశీ హ్యాండ్లర్లయిన ఉకాసా, ఫైజాన్, హష్మీల దృష్టిలో పడ్డారు. 2019లో ఫేస్బుక్, ఎక్స్ సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ జరిగే చర్చాకార్యక్రమాల్లో వీళ్లంతా పాల్గొనేవారు. అలా తొలిసారిగా విదేశీ హ్యాండ్లర్లు వీళ్లను గుర్తించారు. తర్వాత వెంటనే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్‌లోకి మారారు. ఆనాటి నుంచే ఉగ్రభావజాలాన్ని విదేశీ హ్యాండర్లు వీళ్లకు నూరిపోయడం మొదలైంది. ఎర్రకోట ఘటనలో ఘనీ, అదిల్‌లను ఎన్ఐఏ అరెస్ట్‌చేయగా అంతకుముందే ఆగస్ట్‌లో ముజఫర్ అఫ్గానిస్తాన్‌కు పారిపోయాడు. ఉమర్ బృందం మొదట్నుంచీ యూట్యూబ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ)ల తయారీ వీడియోలను విపరీతంగా చూసి వాటి తయారీపై అవగాహన పెంచుకున్నారు. ఉమర్ బృందసభ్యులను సంక్షోభ సిరియా, అఫ్గానిస్తాన్‌లలో తమ తరఫున పోరా డాలని హ్యాండ్లర్లు తొలుత సూచించారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. భారత్‌లోనూ ఉంటూ విద్వంసం సృష్టించాలని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ముఠాసభ్యులు ఇక్కడే ఉండిపోయి పేలుళ్లకు పథకరచన చేశారు. -
ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబి.. పేలుడుకు వారం ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేస్తూ వచ్చాడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ 10న దాడి జరగగా, దానికి వారం రోజుల ముందు ఉమర్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గల తన ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే ముందు తన వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఒకదానిని తన సోదరునికి ఇచ్చాడు.శ్రీనగర్, ఫరీదాబాద్‌లలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఉమర్ సహచరులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు చేయడంతో ఉమర్ సోదరుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ మర్నాడు ఉమర్ మరో సహోద్యోగి డాక్టర్ షాహీన్ సయీద్ కూడా అరెస్టు అయినట్లు ఉమర్ సోదరునికి తెలిసింది. ఉమర్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న సోదరుడు భయంతో ఉమర్ ఇచ్చిన ఫోన్‌ను వారి ఇంటి సమీపంలోని ఒక చెరువులో పడేశాడు. దర్యాప్తు అధికారులు ఉమర్ ఫోన్ల కోసం గాలించారు. ఆ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని, వాటి చివరి స్థానాలు ఢిల్లీ, పుల్వామాలో ఉన్నట్లు గుర్తించారు.అధికారులు పుల్వామాలోని ఉమర్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిని విచారించగా, అతను చెరువులో పడేసిన ఫోన్ గురించి వెల్లడించాడు. నీటిలో పడి, పాడైపోయిన ఆ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ మదర్బోర్డ్ కూడా పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, అధికారులు అతి కష్టం మీద.. ఆ ఫోనులో.. ఉమర్ ఆత్మాహుతి బాంబు దాడులను సమర్థిస్తూ చేసిన కీలక వీడియోను రికవరీ చేయగలిగారు. మంగళవారం బహిర్గతమైన ఆ వీడియోలో.. ఇస్లాంలో ఆత్మహత్యను నిషేధించినప్పటికీ, ఉమర్ దానిని సమర్థిస్తూ బలిదాన చర్యలుగా అభివర్ణించాడు. అలాగే మరణానికి భయపడవద్దు అనే సందేశాన్ని వినిపించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్చిట్ -
దక్షిణా చైనా సముద్రంపై చైనా బాంబర్ పెట్రోలింగ్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఫైటర్ జెట్లు సముద్రంపై గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఫిలిప్పైన్స్కు హెచ్చరికగానే బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పైన్స్ నావికాదళం ఇటీవల అమెరికా, జపాన్ సైన్యంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామం చైనాకు రుచించడం లేదు. దక్షిణా చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఫిలిప్పైన్స్, వి యత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చైనా ఆధిపత్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
పాకిస్తాన్ మళ్లీ రక్తసిక్తం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కోర్టు కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ వెల్లడించారు.ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరితేరిందని పాక్ అధికారులు చెప్పారు. తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్ ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది.ఆత్మాహుతి దాడికి అఫ్గాన్‌లోని తాలిబన్ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది. -
మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది. మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
చైనీయులే లక్ష్యంగా మహిళ ఆత్మాహుతి దాడి.. బస్సు దగ్గరకు రాగానే..
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం కరాచీ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. కరాచీ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతో సహా నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్కు సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై పాకిస్థాన్ వేర్పాటువాద గ్రూపుకు చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ మిషన్‌ను తొలిసారిగా మహిళా మిలిటెంట్ నిర్వహించారని అధికారులు తెలిపారు. చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానికులకు చైనా భాషను నేర్పుతుంటారు. దీంతో చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బుర్ఖా ధరించి ఇన్స్టిట్యూట్ గేట్ వద్ద నిల్చున్న ఓ మహిళ.. వ్యాన్ దగ్గరకు రాగానే తనను తాను బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. BREAKING 🇵🇰 Pakistan🇵🇰 : Warning Graphic Content ‼️ ♦️Video footage shows the moment of suicide attack on Chinese national’s vehicle in Karachi university ♦️Footage shows the suicide bomber blew herself when the Van arrived #Karachi #Sindh #China #University #Blast #Explosion pic.twitter.com/7qLSDCS0vh — Zaid Ahmd (@realzaidzayn) April 26, 2022 -
ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్‌కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్‌లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. -
ఆప్ఘనిస్ధాన్‌లో విరుచుకుపడిన తాలిబన్లు
-
‘నేను చేసేది పాపం కాదు.. క్షమాపణ చెప్పను’
ఆస్టిన్ : ‘నేను చేసేది పాపం కాదు.. నేను క్షమాపణలు చెప్పాలి.. కానీ అలా ఎప్పటికీ చెప్పను’అంటూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పాడు. అతడు దాడికి పాల్పడటానికి ముందే తాను ఎందుకు దాడి చేస్తున్నానో అనే విషయాన్ని అతడి ఫోన్లో 25 నిమిషాలపాటు రికార్డింగ్ చేసి ముందే పెట్టుకున్నాడు. దీంతో అతడు ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు స్పష్టమైంది. మూడు వారాల కిందట ఆస్టిన్‌లో మార్క్ కాండిట్ అనే వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోనే తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో పోలీసులకు అతడి ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ 25 నిమిషాల నిడివితో వీడియో లభించింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం తాను చేసేది తప్పుకాదని అతడు చెప్పాడు. తన చర్యను ఓ సైకోపాథ్గా వర్ణించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా తాను ఎప్పటికీ చెప్పబోనని తెలిపాడు. బాల్యం నుంచే తన జీవితం చిందరవందరగా ఉందని, ఒక వేళ తనను బందించాలని వస్తే అప్పటికప్పుడే తనను పేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో రికార్డు చేసి పెట్టి ఉంచాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము అంతకంటే ఎక్కువ వివరాలు అందించలేమని పోలీసులు తెలిపారు. కాగా, మార్క్ రూమ్మేట్స్ను కొన్నిగంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. -
మ్యూజియంగా మారనున్న యుద్ధవిమానం
విశాఖపట్టణం: భారత నావికా దళంలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన యుద్ధవిమానం మ్యూజియంగా రూపుదాల్చనుంది. ఇండియన్ నేవీకి చెందిన లాంగ్ రేంజ్ మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ టీయూ-142 ఎం ను మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. తమిళనాడు నుంచి ఈ యుద్ధవిమానం శనివారం విశాఖపట్టణం చేరుకుంది. సోవియట్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్‌క్రాప్ట్ 1988లో నావికా దళంలో చేరింది. 29 ఏళ్ల అనంతరం మార్చి 29వ తేదీన ఈ విమానానికి సేవల నుంచి విరామం ప్రకటించారు. తమిళనాడులోని నేవల్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం స్థానిక ఐఎన్ఎస్ డేగ నౌకపై దిగిన యాంటి సబ్మెరీన్ యుద్ధవిమానానికి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, నావికా దళ అధికారులు పాల్గొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ, యుద్ధ విమానాన్ని అందజేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని మ్యూజియంగా మార్చుతామని చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపడతామని సీఎం తెలిపారు. -
ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!
బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి. విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది. ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు. ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు. 29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు.


