మ్యూజియంగా మారనున్న యుద్ధవిమానం | bomber is to become a Museum | Sakshi
Sakshi News home page

మ్యూజియంగా మారనున్న యుద్ధవిమానం

Apr 8 2017 4:33 PM | Updated on Sep 5 2017 8:17 AM

భారత నావికా దళంలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన యుద్ధవిమానం మ్యూజియంగా రూపుదాల్చనుంది.

విశాఖపట్టణం: భారత నావికా దళంలో దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన యుద్ధవిమానం మ్యూజియంగా రూపుదాల్చనుంది. ఇండియన్‌ నేవీకి చెందిన లాంగ్‌ రేంజ్‌ మారిటైం పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ టీయూ-142 ఎం ను మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. తమిళనాడు నుంచి ఈ యుద్ధవిమానం శనివారం విశాఖపట్టణం చేరుకుంది. సోవియట్‌ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్‌క్రాప్ట్‌ 1988లో నావికా దళంలో చేరింది. 29 ఏళ్ల అనంతరం మార్చి 29వ తేదీన ఈ విమానానికి సేవల నుంచి విరామం ప్రకటించారు.

తమిళనాడులోని నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి శనివారం ఉదయం స్థానిక ఐఎన్‌ఎస్‌ డేగ నౌకపై దిగిన యాంటి సబ్‌మెరీన్‌ యుద్ధవిమానానికి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, నావికా దళ అధికారులు పాల్గొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ, యుద్ధ విమానాన్ని అందజేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని మ్యూజియంగా మార్చుతామని చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపడతామని సీఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement