ఓవర్ టూ గ్రౌండ్‌.. సినీతారల క్రికెట్ లీగ్‌ వచ్చేస్తోంది | Celebrity Cricket League Matches Schedule Announced | Sakshi
Sakshi News home page

CCL-2026: ఓవర్ టూ గ్రౌండ్‌.. సినీతారల క్రికెట్ లీగ్‌ వచ్చేస్తోంది

Jan 12 2026 7:37 PM | Updated on Jan 12 2026 7:49 PM

Celebrity Cricket League Matches Schedule Announced

ప్రతి ఏటా సినిమాలతో మాత్రమే కాదు.. క్రీడలతోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెరపై అలరించిన స్టార్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. సినీ హీరోస్ అంతా అలరించే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది సీజన్‌తో అభిమానులను అలరించనున్నారు.

ఈ ఏడాది సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. వైజాగ్  వేదికగా ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో తెలుగు వారియర్స్‌ తన తొలి మ్యాచ్‌ భోజ్‌పురి దబాంగ్స్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement