మహానటి హిరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటన అశేష ఆదరాభిమానాలు పొందిన ముద్దుగుమ్మ. విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న నటి. ఆమె తన చిరకాల స్నేహితుడు ఆంథోని థటిల్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడచక్కగా ఉండే ఈ జంట ఇల్లు కూడా వారిలానే ఆద్యంత అందంగా..అద్భుతాలకు నెలవుగా బహు సుందరంగా ఉంది. అది ఇల్లా లేక ఏదైనా టూర్‌కి వెళ్లామా అనేలా కళాకృతులకు నిలయంగా మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. మరీ హీరోయిన్ కీర్తి ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకుందో తిలకిద్దాం రండి..!.
"హౌస్ ఆఫ్ ఫన్"గా పిలచే కీర్తి ఇల్లు ఆధునికత, సంప్రదాయాల మేళవింపుగా అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఆరుబయట బ్యాక్ వాటర్స్ ఉత్కంఠభరిత దృశ్యాలు ఉత్సాహాన్ని అందిస్తే..లోపటి సుందర దృశ్యాలు సౌందర్యాలి ఆలవలంగా ఉంది. అందమైన చిన్న వంటగది, బ్యాక్‌వాటర్స్‌తో చుట్టబడిన బాల్కనీ, వాక్ ఇన్ వార్డ్‌రోబ్‌తో విశాలమైన బెడ్‌రూమ్ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక అక్కడే గోకు వేలాడిదీసిన చంద్రుడి కళలు..వారే డేటింగ్ ప్రారంభించిన రోజు, వివాహం చేసుకున్న రోజున చంద్రుని కళల దశల జాబితాను అందించే కళాకృతి కళ్లను పక్కకు తిప్పనివిధంగా కట్టిపడేస్తుంది. నటిగా తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మహానటి మూవీకి సంబంధించిన ఛాయచిత్రాలతో కూడిన ఫ్రేమ్ కీర్తి నటనను గుర్తు చేస్తోంది.
డైనింగ్‌టేబుల్ వద్ద వారి వివాహ ఫోటోలు, వెడ్డింగ్ కార్డ్ ఫ్రేమ్ స్పెషల్ ఎంట్రాక్షన్‌గా ఉంటుంది. ఇక బెడ్‌రూమ్ కేరళ శైలిలో బూడిద రంగు గోడలు నిండా వ్యక్తిగత ఫోటోలతో కనువిందు చేయగా, అక్కడ సమీపంలోని ఫలకంపై “ఎవరూ హుందాగా బయటకు రారు” అని రాసి ఉంది. దాన్ని చూపిస్తూ..ఈ దృశ్యం, అక్కడి వైబ్స్ చాలా మత్తునిస్తాయని హాయిగా నిద్రపట్టేస్తుందని అంటోంది కీర్తి.
లివింగ్ రూమ్‌లో మెత్తటి బూడిద రంగు సోఫాలు, రిలాక్స్డ్ వైబ్స్ అందిస్తున్నాయి. అక్కడ కూడా వాల్స్‌పై ఫోటోలు అలంకరించి ఉన్నాయి. అలాగే ఒక ప్రైవేట్ హోమ్ థియేటర్, టెర్రస్‌పై యోగా, సాధారణ ఫోటోషూట్‌లు, సూర్యాస్తమయాలను ఆస్వాదించేలా అందంగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ అందమైన ఇల్లు బిజీగా ఉండే ఆమె ప్రొఫెషనల్ జీవితానికి దూరంగా చక్కటి విశ్రాంతి అందించే ప్లేస్.
(చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!)


