లంబోర్గిని కారు అనేది సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. మరి అలాంటి అతి ఖరీదైన కారులో రయ్ రయ్‌మని రోడ్డుపై దూసుకుపోతున్నాడు జార్ఖండ్‌లోని చండిల్ అనే చిన్న గ్రామానికి చెందిన మెకానిక్. అతడికి లాటరీలో కోట్ల రూ΄ాయలు ఏమైనా వచ్చాయా? అబ్బే... అంత సీన్ లేదు. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఆరీఫ్ అనే మెకానిక్ మారుతి 800 కారును అచ్చం లంబోర్గిని కారులా తీర్చిదిద్దాడు. అది పూర్వజన్మలో మారుతి 800 అంటే నమ్మడానికి సంకోచించేంతగా మాయ చేశాడు. కటింగ్, వెల్డింగ్, ప్యానెల్ డిజైన్ చేసిన అతడి సాంకేతిక చాతుర్యానికి నెటిజనులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు.


