
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గ్యారేజ్‌లో మరో కొత్త కారు వచ్చి చేరింది. రోహిత్ ఎరుపు రంగు లాంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ లగ్జరీ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివరీ అయింది.
కాగా హిట్‌మ్యాన్ గతంలో కూడా నీలం రంగు లాంబోర్గిని ఉరుస్ కారు ఉండేది. అయితే ఆ కారును డ్రీమ్11 కాంటెస్ట్ విజేతకు అందజేయడంతో.. ఇప్పుడు కొత్త లాంబోర్గిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ కాస్ట్‌లీ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ క్రమంలో అతడి కారు నంబర్ 3015ను అభిమానులు డీకోడ్ చేశారు. '3015' అనే సంఖ్య హిట్‌మ్యాన్ ఇద్దరు పిల్లల పుట్టినరోజులను సూచిస్తుంది. డిసెంబర్ 30 రోహిత్ కుమార్తె సమీరా బర్త్‌డే కాగా.. నవంబర్ 15 హిట్‌మ్యాన్ కొడుకు అహాన్ పుట్టిన రోజు.
అంతేకాకుండా మొత్తం అంకెల్‌ను కలిపితే రోహిత్ జెర్సీ నంబర్ 45 వస్తోంది. రోహిత్ పాత కారుకు 264 నెంబర్ ఉండేది. ఆ నెంబర్ .. వన్డేల్లో రోహిత్ చేసిన అత్యధిక స్కోర్‌న్ సూచిస్తోంది. కాగా కొత్త ఉరుస్ ఎస్ఈ కారు ధర రూ. 4.57 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌ను అభిమానులు భారత జెర్సీలో చూసే అవకాశముంది.
చదవండి: Mohammed Shami: ‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’