టీమిండియాలో అప్ కమింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్.. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు. సుందర్ తాజాగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు.
అలాగే కొందరు ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Washington Sundar looks like a proper gentleman, but his attitude is on another level — even more than big names like Virat Kohli, Rohit Sharma, and Hardik Pandya. 😅🙏 pic.twitter.com/7lVDBGz66K
— Jara (@JARA_Memer) January 2, 2026
ఇది చూసి నెటిజన్లు సుందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఏంటా బలుపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరేమో నువ్వేమైనా విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అనుకుంటున్నావా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
మొత్తానికి ఆన్ ఫీల్డ్ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.
ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్..త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే హోం టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన జట్టే టీ20 ప్రపంచకప్‌లో కూడా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానాన్ని పక్కా చేసుకున్న సుందర్.. ప్రపంచకప్‌లో ఆడటం లాంఛనమే.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఐదు టీ20లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి.
ఈ సిరీస్‌కు ముందే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచే మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.


