యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్‌తో గానవికి వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరువాసులే. ఇటీవల శ్రీలంకకు హనుమూన్‌కు వెళ్లాగా అక్కడే గొడవపడి తిరిగి వచ్చారు. మూడురోజుల కిందట ఆమె భర్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. బ్రెయిన్‌డెడ్ అయి చివరకు మరణించింది.
అతడు మగాడు కాదు
గానవి పెద్దమ్మ మాట్లాడుతూ భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని గానవి తొలి రాత్రిరోజే తనకు చెప్పి బాధపడిందన్నారు. పెద్దమొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త వేధించేవాడని బంధువులు అరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు నమోదుచేశారు.


