దేశంలోనే ఏపీ రైతులపై అతి ఎక్కువ అప్పుల భారం | Andhra Pradesh Farmers Bear Indias Heaviest Debt Burden | Sakshi
Sakshi News home page

దేశంలోనే ఏపీ రైతులపై అతి ఎక్కువ అప్పుల భారం

Feb 10 2026 7:03 PM | Updated on Feb 10 2026 7:25 PM

Andhra Pradesh Farmers Bear Indias Heaviest Debt Burden

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎంత అప్పుల భారంలో ఉన్నారో పార్లమెంట్‌ సాక్షిగా బయటపడింది. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) లోక్‌సభలో ఏపీలో రైతుల అప్పుల భారంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌  చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ,. శివరాజ్‌సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో ఏపీలోని రైతుల అప్పుల పరిస్థితి ఎలా  ఉందనేది తేటతెల్లమైంది. ఇది దేశంలోనే ఏపీ రైతుల అతి ఎక్కువగా అప్పుల భారంగా శివరాజ్‌సింగ్‌ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. 

జూలై 2018- జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం  సగటు అప్పు రూ.2,35,554 రూపాయలుగా ఉన్నట్లు శివరాజ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇది తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం కంటే ఎక్కువగా నమోదైంది. తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం  రూ.1,52,113 ఉండగా, ఏపీ రైతుల సగటు అప్పుల భారం రూ.2,35,554 గా ఉంది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పుల భారం   74,121 రూపాయలు కాగా, ఏపీలో మాత్రం అత్యధికంగా ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement