‘పుణ్యక్షేత్రంలో లాఠీలకు పని చెపుతారా?’ | YSRCP Leader Malladi Vishnu Condemns Lathi Charge at Srisailam | Sakshi
Sakshi News home page

‘పుణ్యక్షేత్రంలో లాఠీలకు పని చెపుతారా?’

Feb 10 2026 5:43 PM | Updated on Feb 10 2026 5:58 PM

YSRCP Leader Malladi Vishnu Condemns Lathi Charge at Srisailam

విజయవాడ: శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీఛార్జిని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. శ్రీశైలం లో నిన్న జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. వారం రోజుల క్రితం, రెవిన్యూ, హోమ్, ఇండోమెట్ మంత్రులు వెళ్ళి రద్దీ పై సమీక్ష చేసినా ఫలితం శూన్యమన్నారు. వేలాది మంది భక్తుల వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. 

క్యూ లైన్‌లు లేవు, వాటర్ లేదు కనీసం సౌకర్యాలు కల్పించలేదు. పోలీసు యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సింది పోయి శివ భక్తుల మీద లాఠీఛార్జ్ చేశారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది.  ఏపీలో దేవాలయాలకు వెళ్లిన భక్తులు వెనక్కి వస్తారా అనే భయం కలుగుతుంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు, సింహాచలం, కాశీబుగ్గలో భక్తులు చనిపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..

అరసవిల్లిలో రథ సప్తమిలో తొక్కిసలాట  జరిగింది. తప్పులు సరిచేసుకోవాలి అనే భావన ప్రభుత్వంలో కనిపించడం లేదు. హిందూ దేవుల్లో భద్రత గాలికొదిలేశారు. హిందూ ధర్మం పై కూటమి చిన్న చూపు చూస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: 

శ్రీశైలంలో ఉద్రిక్తత

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం..చరిత్రలో మొదటిసారి..

Advertisement
 
Advertisement
Advertisement