శ్రీశైలం: శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో దర్శనం కోసం క్యూలైన్స్ , కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాములు ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు శివస్వాములు.
శివ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పి యుగంధర్ బాబు , జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు..లాఠీ తో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పి యుగంధర్ బాబు. ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా వెనుతిరుగుతున్న శివదీక్ష స్వామి భక్తులు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని శివ స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ భక్తులు, శివమాల దారులు పరిస్థితి గందరగోళంగా మారింది.
అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా శ్రీశైలం(ఫోటో గ్యాలరీ)


