తిరుపతి: కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హైడ్రామా కొనసాగుతోంది. రేపు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) మరోమారు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు కార్యకర్తలను సదరు కమిటీ విచారించింది. అయినా ఇంతవరకూ పార్టీకి నివేదిక ఇవ్వలేదు త్రిసభ్య కమిటీ.
ఇదిలా ఉంచితే,. నిన్నటి జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అంటూ లీకులిచ్చారు. అదే సమయంలో అరవ శ్రీధర్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప బాధిత మహిళపై పోలీసు కేసులతో పాటు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం చేసినదంతా చేసి పార్టీకి సంబంధం లేదంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు.


