breaking news
Arava Sreedhar
-
Arava Sridhar : నా కోరిక తీర్చకపోతే నీ కొడుకుని చంపేస్తా..
-
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్‌కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది.


