సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు.



