సాక్షి, కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా ఇటీవల నమోదైన పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్ ఎదురైంది. పిల్లల విక్రయంలో కీలక సూత్రధారి జనసేన నేత తల్లిగా గుర్తించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. గర్భిణీగా రిజిస్టర్ కాకుండా పిల్లలను తెచ్చి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై ఆరా తీశారు.
ఇద్దరు పిల్లల్ని విక్రయించినట్లు విచారణలో ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డెమ్మ, ఫరీనా పిల్లల విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ (@వీరాకుమారి, @ఈడేపల్లి ఆంటీ) ఉన్నారు. 2024లో ఇద్దరు పిల్లల్ని అబ్బిశెట్టి వీరమ్మ విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పది రోజుల క్రితం ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన ఆకేటి మోక్షిత్ (రెండున్నరేళ్లు) అదృశ్యమయ్యాడు. ఆకేటి మోక్షిత్ అదృశ్యం వెనుక అబ్బిశెట్టి వీరమ్మ ముఠా హస్తం ఉందేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


