breaking news
kaikalur
-
CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)
-
ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది
కైకలూరు: ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో కైకలూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కైకలూరు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. కైకలూరు మండలం వరాహపట్నంకు చెందిన లక్ష్మినరసింహస్వామికి విజయలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం సూరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో దంపతుల మధ్య గొడవలు ఏర్పడి వారు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆమె సూరితో సహజీవనం చేస్తోంది. ఎలాగైనా భర్తను మట్టుబెట్టాలని పథకం పన్నిన విజయలక్ష్మి ప్రియుడు సూరి, మరో వ్యక్తి శ్రీనివాస్‌తో కలిసి లక్ష్మినరసింహస్వామిని వారం రోజుల క్రితం హతమార్చి చేపల చెరువులో పడేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.