ఇండియన్‌ బ్యాంక్‌ మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ | Indian Bank Mega Credit Outreach Campaingn Loans Disbursed | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ బ్యాంక్‌ మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌

Mar 14 2026 1:53 PM | Updated on Mar 14 2026 2:13 PM

Indian Bank Mega Credit Outreach Campaingn Loans Disbursed

భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇండియన్‌ బ్యాంక్‌ విజయవాడ జోన్‌ ఆధ్వర్యాన మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ ఎం.రాజేష్, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ ఎం.శేషగిరిరావు లబి్ధదారులకు రూ.260 కోట్ల విలువైన రుణాల మంజూరు పత్రాలను అందజేశారు.

 అదేవిధంగా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పలువురు లబ్ధిదారులకు రూ.1,422 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వ్యవసాయం ఇతర రంగాలకు చెందిన లబి్ధదారులకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇండియన్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ జీఎంఓ పరిధిలో ఉన్న ఎనిమిది జోన్లలో ఈ మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించినట్లు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement