బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి..? | Congress Senior Leader Jeevan Reddy Likely To Join BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి..?

Mar 14 2026 7:34 PM | Updated on Mar 14 2026 7:52 PM

Congress Senior Leader Jeevan Reddy Likely To Join BRS

జగిత్యాల:  తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్‌ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్‌రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల  సోషల్‌ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్‌రెడ్డి సోషల్‌ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్‌ కూడా మారిపోతున్నాయి. 

తాను కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉండి కూడా  ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా  ఎమ్మెల్యే సంజయ్‌ వర్గానికి కాంగ్రెస్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చి..  ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్‌రెడ్డి వేరే స్టెప్‌ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా 

జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి  ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్‌పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా.   ఇదే జీవన్‌రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్‌రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement