పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం | Widow Exposes Pension Delay at Pawan’s Meeting | Sakshi
Sakshi News home page

పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం

Mar 14 2026 7:57 PM | Updated on Mar 14 2026 8:03 PM

 Widow Exposes Pension Delay at Pawan’s Meeting

అల్లూరి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో నిర్వహించిన మాటామంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడి మోసం బయటపడింది. వితంతువులకు భర్త చనిపోయిన నెల రోజుల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నట్లు వివిధ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమని మరోసారి స్పష్టమైంది. 

తనకు పెన్షన్‌ రాలేదని పవన్ కల్యాణ్ సభలో వితంతు మహిళ స్పష్టం చేసింది. తన భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్‌ అందలేదని ఓ గిరిజన మహిళ తెలిపింది. పెన్షన్‌ కోసం చాలా దూరం నడిచి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తనకు ఏ ఆధారమూ లేదని వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement