అసెంబ్లీ బాత్రూంలో ‘అరవ’ వికృత చేష్టలు | MLA Arava Sreedhar Faces Backlash Over Video Call Allegations During Assembly Bathroom, More Details Inside | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ బాత్రూంలో ‘అరవ’ వికృత చేష్టలు

Feb 13 2026 4:56 AM | Updated on Feb 13 2026 11:46 AM

MLA Arava Sreedhar Video Call In Assembly Bathroom

రెస్ట్‌రూం నుంచి మహిళకు వీడియో కాల్‌ 

ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ మాట్లాడిన కూటమి ఎమ్మెల్యే 

శాసన సభా ప్రాంగణంలో ఉండి మహిళకు ముద్దులు 

రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే శ్రీధర్‌ మరో వీడియో వెలుగులోకి 

ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదనలో బాధితురాలు  

సాక్షి, అమరావతి: తాను శాసన సభ్యుడిననే కనీస స్పృహ కూడా లేకుండా కూటమికి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ చేసిన వికృత చేష్టల్లో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. చట్టసభలో ఉన్నానన్న విషయాన్నే మర్చిపోయి అరవ చేసిన అసభ్య వీడియో కాల్‌ బయటకు వచ్చింది. బాధిత మహిళ స్వయంగా విడుదల చేసిన ఆ వీడియోలో.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాలకు హాజరైన అరవ శ్రీధర్‌ అక్కడి నుంచే బాధిత మహిళకు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. 

యూరిన్‌ పోసుకుంటూ ఆ మహిళకు తన శరీరంలోని ప్రైవేట్‌ భాగాలను శ్రీధర్‌ చూపిస్తూ.. అసభ్యకరంగా సైగలు చేశారు. అభ్యంతరకర పదాలతో మహిళకు సందేశాలు పంపించారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలోని టాయిలెట్‌ నుంచే బాధిత మహిళకు వీడియో కాల్‌ ద్వారా ముద్దులు కూడా పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరోవైపు అరవ శ్రీధర్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ బాధిత మహిళ ప్రశ్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆమె గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్ధించారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ హాజరుకావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement