కమిటీ విచారణకు రమ్మని నన్నెవరూ పిలవలేదు
పిలిస్తే వచ్చి అన్ని వివరాలూ చెప్పేందుకు సిద్ధం
కమిటీ సభ్యుడికి ఫోన్ చేసి తన వాదన వినాలని అభ్యర్ధించా: ఎమ్మెల్యే అరవ బాధితురాలు
సాక్షి, అమరావతి: భయపడి తానేమీ దాక్కోలేదని, ఎక్కడికీ పారిపోలేదని రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనపై పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను న్యాయపరంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన యత్నాలు చేస్తున్నానని వివరించారు.
అలాగే జనసేన నియమించిన కమిటీ విచారణకు రావాలని తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేశారు. తనకు తానుగా కమిటీ సభ్యుడు శివశంకర్‌కు ఫోన్ చేసి తన వాదన వినాల్సిందిగా అభ్యర్ధించి పెన్‌డ్రైవ్, లేఖ పంపించానని వెల్లడించారు. పిలిస్తే కమిటీ ముందుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.


