railway kodooru
-
నేను దాక్కోలేదు
సాక్షి, అమరావతి: భయపడి తానేమీ దాక్కోలేదని, ఎక్కడికీ పారిపోలేదని రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనపై పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను న్యాయపరంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన యత్నాలు చేస్తున్నానని వివరించారు. అలాగే జనసేన నియమించిన కమిటీ విచారణకు రావాలని తనను ఎవరూ పిలవలేదని స్పష్టం చేశారు. తనకు తానుగా కమిటీ సభ్యుడు శివశంకర్‌కు ఫోన్ చేసి తన వాదన వినాల్సిందిగా అభ్యర్ధించి పెన్‌డ్రైవ్, లేఖ పంపించానని వెల్లడించారు. పిలిస్తే కమిటీ ముందుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. -
Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి,హైదరాబాద్: జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చూట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేశారు. అయితే, అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉండగా తనకు వీడియో కాల్స్ చేశారు. ఇదే అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిపై బెదిరింపులు, అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు. అరవ శ్రీధర్ స్త్రీ లోలుడు. ఆయన బాధితుల్లో నేనే కాదు. నాతో పాటు మరో ఐదుగురు ఉన్నారురూ.25 కోట్లు నేను అడగలేదు. డబ్బులు డిమాండ్ చేసినట్లు నాపై వస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలే. అరవ శ్రీధర్ ప్రతిసారి అసెంబ్లీ నుండి కాల్ చేసేవాడు. అక్కడ జరిగే అన్ని విషయాలు చూపించేవాడు. ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయ్యింది. అతను నాతోనే కాదు. మరో ఐదుగురితో ఇలాగే చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆయన మోసాలన్నీ నాకు తెలిసి ఇదంతా ఆపేద్దాం అన్నాను. అందుకే సేఫ్ సైడ్‌గా అన్ని ఆధారాలు ఉంచుకున్నానునన్ను అతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇల్లు మొత్తానికి తెలుసు. శ్రీధర్‌కు రైల్వేకోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానంద్ రెడ్డి అండదండలున్నాయి. అతనే వెనక ఉంది శ్రీధర్‌ను నడిపిస్తున్నారు’అని ఆరోపించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ అరాచకాల్ని బయటపెట్టినందుకు బాధితురాలిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని ఆమె తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను కోరుతున్నాము. బాధిత మహిళ రూ.25 కోట్లు మహిళా డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్రమే అని అఫిడవిట్లో ఉంది. అలాంటిది రూ. 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారు. అక్రమంగా సంపాదిస్తే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాము. కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ పైన స్పీకర్ చర్యలు ఉండవా?? అని ప్రశ్నించారు. -
ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు
సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేసింది. అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘చర్యలుండవ్’ అంటూలైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. -
MRO పై టీడీపీ నేత రౌడీయిజం
-
శుభం ప్రాప్తిరస్తు..
సాక్షి, రైల్వేకోడూరు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన బ్రాహ్మణులకు స్వర్ణయుగం లాగా ఉండేది. ఆయన హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. జిల్లాలో మొత్తం బ్రాహ్మణ కుటుంబాలు 18 వేలకు పైగా ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి కోసం వైఎస్సార్ 24 పథకాలు అమలు చేశారు. ఆయన అర్చకుల జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి వారి కుటుంబాల సంక్షేమం కోసం ఆ పథకాలు ప్రవేశ పెట్టారు. తండ్రి అడుగు జాడలలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంపై బ్రాహ్మణ సామాజిక వర్గం కృతజ్ఞతలు తెలుపుతోంది. వైఎస్సార్ ప్రభుత్వం బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకున్నదని.. అలాగే జగన్ కూడా మరో అడుగు ముందుకేసి సముచిత స్థానం కల్పించడంపై రాష్ట్రంలోని బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తానని ఇచ్చిన హామీపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం ప్రకటించడంపై అభినందనలు తెలుపుతున్నారు. వైఎస్సార్ అమలు చేసిన పథకాలు ఉపనయన గ్రాంటు కింద రూ.25 వేలు రూ.5 వేలలోపు ఆదాయం కలిగిన అర్చకుల పిల్లలకు విద్యా రుణం కింద రూ.35 వేల గ్రాంటు, 60 నెలల్లో తిరిగి చెల్లించే సౌకర్యం. 2 వేలలోపు ర్యాంకు వచ్చిన వైద్య విద్యార్థులకు, 5 వేల లోపు ర్యాంకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల చదువు, భోజనం, వసతి ఖర్చులన్నీ ప్రభుత్వం భరించింది. రూ. 5 వేల నుంచి 12,500లోపు జీతం తీసుకుంటున్న వారికి రూ.33 వేలు వడ్డీలేని రుణం అందించింది. అర్చకుని కుమారుడు, లేదా కుమార్తె వివాహం కోసం లక్ష రూపాయల రుణం ఇంటి మరమ్మతుల కోసం 4 శాతం వడ్డీకి లక్ష రూపాయల రుణం 65 ఏళ్ల వయసు దాటిన వారికి వృద్ధాప్య భృతిగా నెలకు రూ.1500 4 శాతం వడ్డీతో మోటారు సైకిల్‌కు రుణం సొంత ఇల్లు లేని అర్చకునికి ఇంటి అద్దె, సామాజిక జీవితం బీమా పథకం కింద లక్ష రూపాయల వరకు పాలసీ వైఎస్ జగన్ హామీలు రాజకీయ ఉనికి కోల్పోతున్న బ్రాహ్మణులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో బ్రాహ్మణ నిధి ద్వారా 500 కోట్లకు పైగా ఇస్తామని ప్రకటించారు. 60 ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నెలకు 5 వేల గౌరవ వేతనం నవరత్నాల ద్వారా పలు పథకాల వర్తింపు వెయ్యి కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ పేద బ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు సమకూర్చుతామని జగన్ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయితే పేద బ్రాహ్మణుల జీవితాలలో వెలుగులు వస్తాయి. –ఆర్సీ సురేష్‌బాబు, ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి చంద్రబాబు మోసం చేశారు టీడీపీ ప్రభుత్వం స్థాపించిన నాటి నుంచి అనాదిగా బ్రాహ్మణులను ఆ పార్టీ మోసం చేస్తూనే ఉంది. ప్రతి ఎన్నికలలో వాగ్దానం చేసి అమలు చేయడం లేదు. చట్టసభలలో ప్రాధాన్యం ఇవ్వరు. మొదటగా కరణీకాన్ని తొలగించి బ్రాహ్మణులకు గ్రామాల ప్రాధాన్యం లేకుండా చేసింది. అర్చక కులవృత్తిని కూడా తొలగించాలని కుట్ర చేస్తూ వయోపరిమితి తెచ్చింది. తరువాత వైఎస్సార్ మాత్రమే బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం ఇచ్చి వేల గుడులకు దూపదీప నైవేద్యాలు మంజూరు చేశారు. అదే కోవలో జగన్ బ్రాహ్మణులకు 4 అసెంబ్లీ సీట్లిచ్చి బ్రాహ్మణ జాతిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు. మేమంతా జగన్ వెంటే. –ఎంఎల్ఎన్ సురేష్‌బాబు, వైఎస్సార్ బ్రాహ్మణ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యుడు, కడప విద్యార్థులకు మేలు విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ సౌకర్యాలకు ప్రస్తుతం ఉన్న వార్షికాదాయం పరిమితి రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. –శ్రీధర వెంకటేష్, పురోహితుడు, కడప టీడీపీ హామీలు విస్మరించింది 2014 ఎన్నికలలో టీడీపీ మేనిఫెస్టోలో బ్రాహ్మణ డిక్లరేషన్ అంశాలలో శివార్చకులను బీసీ డీగా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. అయినా ఇప్పటికీ పట్టించుకోలేదు.–గుండ్లమూడి సత్యనారాయణశర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు అర్హులైన పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ హర్షణీయం. జగన్ పేదల కష్టాలు తెలిసిన, దక్షత కలిగిన నాయకుడు. ఆయనను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. – శివస్వామి, పుల్లంపేట రాజన్నపాలనలో అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బ్రాహ్మణుల అభివృద్ధికి మొదటి అడుగు పడింది. ఆలయాలలో దూప దీప నైవేద్యానికి కంకణం కట్టారు. నేడు చాలా ఆలయాలలో నిత్యం పూజలు జరుగుతున్నాయంటే ఆయన ఘనతే. జగన్ కూడా ఆయన అడుగుజాడలలో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయడం ఆనందించదగ్గ విషయం.–ఎస్.రవికుమార్‌శర్మ, నందలూరు మండలం -
రైల్వేకోడూరులో చోరీ
వైఎస్సార్ జిల్లా: గుర్తుతెలియని దుండగులు ఒక ఇంట్లో చొరబడి పెద్ద మొత్తంలో డబ్బు, నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని కామిశెట్టినగర్లో జరిగింది. వివరాలు..పట్టణానికి చెందిన అక్కిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబసభ్యులు వేసవి కావడంతో రాత్రిపూట ఇంటిపై నిద్రపోతున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటిలో చోరబడి రూ.1.80 లక్షల నగదు, 13 తులాల బంగారం దోచుకున్నారు. తెల్లవారిన తర్వాత వచ్చి చూసిన కుటుంబసభ్యులు దొంగతనం జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


