సాక్షి,న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హాస్యనటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. సమయ్‌తో పాటుమరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం, రైనాతదితరులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడాన్ని గమనించి, వారిపై ఉన్న అన్ని కేసులను కొట్టి వేసింది.
ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో చేసిన వ్యాఖ్యలక గాను, రైనాతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అసభ్యకరమైన జోకులపై గతంలోనే రైనాను మందలించిన కోర్టు, దివ్యాంగుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నిధులు సేకరించాలని రైనాను ఆదేశించింది. గత విచారణ సందర్భంగా, చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని ఇచ్చిన హామీలను పాటించకుండా రైనా కోర్టును మోసం చేశారంటూ కోర్టు రైనా, మరో నలుగురిపై రూ. 3 లక్షల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్
కాగా ఈ షోలో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చుపై రైనా సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేశారని, అలాగే అటువంటి వైకల్యం ఉన్న వ్యక్తిని ఎగతాళి చేశారని ఆరోపిస్తూ క్యూర్ SMA ఇండియా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన రైనాతో పాటు, ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లైన విపున్ గోయల్, బల్ రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్ , నిశాంత్ జగదీష్ తన్వర్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్


