Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు | woman allegations against Railway Koduru MLA Arava Sreedhar | Sakshi
Sakshi News home page

Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు

Feb 4 2026 6:46 PM | Updated on Feb 5 2026 10:02 AM

woman allegations against Railway Koduru MLA Arava Sreedhar

సాక్షి,హైదరాబాద్‌: జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ చూట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేశారు. అయితే, అరవ శ్రీధర్‌ అసెంబ్లీలో ఉండగా తనకు వీడియో కాల్స్‌ చేశారు. ఇదే అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. 

పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిపై బెదిరింపులు, అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు. అరవ శ్రీధర్‌ స్త్రీ లోలుడు. ఆయన బాధితుల్లో నేనే కాదు. నాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు

రూ.25 కోట్లు నేను అడగలేదు. డబ్బులు డిమాండ్‌ చేసినట్లు నాపై వస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలే. అరవ శ్రీధర్‌ ప్రతిసారి  అసెంబ్లీ నుండి  కాల్ చేసేవాడు. అక్కడ జరిగే అన్ని విషయాలు చూపించేవాడు. ఇదే అంశంపై ఏపీ  అసెంబ్లీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తాం. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్‌ అయ్యింది. అతను నాతోనే కాదు. మరో ఐదుగురితో ఇలాగే చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆయన మోసాలన్నీ నాకు తెలిసి ఇదంతా ఆపేద్దాం అన్నాను. అందుకే సేఫ్ సైడ్‌గా అన్ని ఆధారాలు ఉంచుకున్నాను

నన్ను అతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇల్లు మొత్తానికి తెలుసు. శ్రీధర్‌కు రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ముక్క రూపానంద్ రెడ్డి అండదండలున్నాయి. అతనే వెనక ఉంది శ్రీధర్‌ను నడిపిస్తున్నారు’అని ఆరోపించారు.  

ఈ సందర్భంగా అరవ శ్రీధర్‌ అరాచకాల్ని బయటపెట్టినందుకు బాధితురాలిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని ఆమె తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.

మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను  కోరుతున్నాము. బాధిత మహిళ రూ.25 కోట్లు మహిళా డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్రమే అని అఫిడవిట్‌లో ఉంది. అలాంటిది రూ. 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారు. అక్రమంగా సంపాదిస్తే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాము. కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ పైన స్పీకర్ చర్యలు ఉండవా?? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement