అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan consoled Ambati Rambabu family members | Sakshi
Sakshi News home page

అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Feb 4 2026 5:03 PM | Updated on Feb 4 2026 5:32 PM

YS Jagan consoled Ambati Rambabu family members

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 

బుధవారం వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్‌ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు.

నేనున్నా తల్లీ.. బాధపడకు.. అంబటి కుటుంబానికి జగన్ ఓదార్పు

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement