తెలంగాణలో మరో స్కాం?.. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్! | KTR Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో స్కాం?.. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్!

Feb 4 2026 2:33 PM | Updated on Feb 4 2026 7:12 PM

KTR Sensational Comments On CM Revanth Reddy

సాక్షి,తెలంగాణ భవన్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దివాళా తీసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని అన్నారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్కాం లు బయట పెడుతున్నాం. మూసి పేరిట లక్ష యాభై వేల కోట్ల స్కాంను, లగచర్ల స్కాం, హిల్ట్ పాలసీ స్కాంను బయట పెట్టాం. అలాగే అమృత్ స్కాంను కూడా బయట పెట్టాం. సింగరేణిలో భారీ కుంభకోణం తెరలేపితే బయట పెట్టాము.

 గత వారం రోజులుగా మమ్ముల్ని వరుసగా విచారణకు పిలుస్తుంటే మాకు డౌట్ వచ్చింది  కానీ తవ్వితే ఒక స్కాం బయటకు వచ్చింది. దివాళా తీసిన ఓ ఇన్‌ఫ్రా సంస్థకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. ఇది ముఖ్యమంత్రి బినామీ కంపెనీ. ఈ బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు ఇస్తున్నారు. 2018 సెప్టెంబర్‌ 27 సదరు కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇన్‌ఫ్రా కంపెనీపై అనుమానం వచ్చింది

రేవంత్‌ సీఎం కాకముందు ఆ కంపెనీ పేరుతో రిజస్ట్రరయిన కారులోనే తిరిగారు. 2023లో ఆ కంపెనీ దివాళా తీసింది. రేవంత్‌ ముఖ్యమంత్రిగా అదే కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్ట్‌లు కట్టబెట్టారు. దివాళా తీసిన కంపెనీకి ప్రాజెక్ట్‌లు ఎలా ఇస్తారు? ఇది క్విడ్‌ ప్రో కాదు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని కంపెనీకి రూ.6వేల కోట్ల పప్రాజెక్ట్‌ పనులు ఇవ్వడం ఏంటి?. అదే కంపెనీ అవకతవకలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement