జగన్ వెంట జనం
విస్తుపోతున్న ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికిందంటున్న ఇంటలిజెన్స్ వర్గాలు!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు.
నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి.

తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్‌ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్‌సీపీని, జగన్‌ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.

కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత
ప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం.

జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.
::సిమ్మాదిరప్పన్న


