జగన్‌ వెంట జనం.. గుంటూరులో జనసంద్రం | Huge Number Of YSRCP Supporters Attend YS Jagan Guntur Tour | Sakshi
Sakshi News home page

జగన్‌ వెంట జనం.. గుంటూరులో జనసంద్రం

Feb 4 2026 11:06 AM | Updated on Feb 4 2026 11:55 AM

Huge Number Of YSRCP Supporters Attend YS Jagan Guntur Tour

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రా​ంబాబు ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. కాసేపటి క్రితమే వైఎస్‌ జగన్‌.. అంబటి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ పర్యటనకు భారీగా జనం తరలివచ్చారు.

వైఎస్‌ జగన్‌ వెళ్తున్న సమయంలో భారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. జగన్‌ కాన్వాయ్‌ వెంట వారంతా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఆయన కారుపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో వైఎస్‌ జగన్‌ క్వానాయ్‌ నెమ్మెదిగా ముందుకు కదులుతోంది.

మరోవైపు.. వైఎస్ జగన్‌ పర్యటనకు భారీగా జనం తరలివచ్చారు. గుంటూరుకు వెళ్లే రోడ్డు జనసంద్రమైంది. వైఎస్‌ జగన్‌ వస్తున్న సందర్భంగా కూటమి సర్కార్‌ జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహంతో వైఎస్‌ జగన్‌కు గుంటూరు ప్రజలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ను వ్యతిరేకిస్తూ జనం రోడ్లపైకి వచ్చారు.

ఇదిలా ఉండగా.. వైఎస్‌ జగన్ పరామర్శ యాత్రకు వెళుతుంటే కూటమి సర్కార్‌ కుట్రలకు తెరలేపింది. అభిమానులను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్నటికీ అవన్నీ విఫలమయ్యాయి. జననేత జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన జనం ముందుండి వైఎస్ ‌జగన్‌ను నడిపించారు.  ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్‌ రాజ్‌ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement