జనసేనకు బిగ్‌ షాక్‌ | Senior Janasena Leader Bolisetty Satyanarayana Resigns From Party Posts, More Details Inside | Sakshi
Sakshi News home page

జనసేనకు బిగ్‌ షాక్‌

Feb 4 2026 8:53 AM | Updated on Feb 4 2026 9:39 AM

Bolisetty Satyanarayana Resign To Janasena In AP

సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. జనసేన ఆవిర్భావం నుండి పవన్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా తన నిర్ణయం ప్రకటించారు.

అయితే, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బొలిశెట్టి కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement