దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం | Malicious propaganda against Tirumala laddu | Sakshi
Sakshi News home page

దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం

Feb 4 2026 5:43 AM | Updated on Feb 4 2026 5:43 AM

Malicious propaganda against Tirumala laddu

అనంతపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టండి   

సీబీఐ సిట్‌ నివేదికను వక్రీకరించి బ్యానర్లతో దుష్ప్రచారం చేయిస్తున్నారు  

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫిర్యాదు

సాక్షి నెట్‌వర్క్‌: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ­లో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్‌ నివేదికను వక్రీకరించి బ్యానర్లతో దుష్ప్రచారం చేస్తూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

» మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందచేశారు. వైఎస్సార్‌ సీపీ ఎన్టీ ఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
»   అనంతపురం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్, ఉరవకొండ సర్కిల్‌ కార్యాలయంలో, కదిరి పట్టణ పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ నేత­లు ఫిర్యాదు చేశారు. మడకశిర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో ఎస్‌ఐ లావణ్యకు ఫిర్యాదు చేశారు.  
»   వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఫోర్తుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పెందుర్తి పీఎస్‌లో, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి న్యూపోర్టు పీఎస్‌లో, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఎంవీపీ పీఎస్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.  
» మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు నర్సీపట్నం టౌన్‌ సీఐకి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్‌ యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐకి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు నక్కపల్లి పీఎస్‌లో, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
»  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు ఫిర్యాదు చేశారు.  
»  పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్‌కు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్, కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తోట శ్రీరాంజీ, తదితరులు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రత్తిపాడులో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు తదితరులు సీఐ బి.సూర్య అప్పారావుకు ఫిర్యాదు చేశారు. 
» శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, జేఆర్‌పురం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.  
» మార్కాపురం జిల్లా గిద్దలూరులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, యర్రగొండపాలెంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు.  
» పశ్చిమగోదావరి జిల్లా ఆచంట పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్‌ తదితరులు  ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement