Sakshi Guest Column
-
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్‌క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్‌తో సీక్వెల్‌పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అలాగే నార్త్‌లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్‌పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్‌బ్లాక్‌గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్‌ను కొనసాగించగలిగితే, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్‌పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. స్వయాన ఎన్టీఆర్ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో హిందుపూర్ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ నాసిరకం పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి. ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్ ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట. ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
చట్టం.. కొందరికి చుట్టమైంది మరోసారి!
‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్‌నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది. మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా. ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది. సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది. వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది. చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి. కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది. గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు. రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీ20లు సరే.. గంభీర్‌కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్‌పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
బాలయ్య మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే..
మొన్న ఫేస్బుక్ బ్రౌజ్ చేసుంటే నందమూరి బాలకృష్ణ చేసిన ఒక ఉపన్యాసం కనిపించింది. ‘‘కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నాకెప్పుడూ అలంకారం కాదు’’ అనే మాటలు వినిపించాయి. వెంటనే ‘‘మేం వేరు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’’ అని గతంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. సరే ఈసారేం మాట్లాడాడో విందామని వీడియో చూసా. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మోడల్ గా ఉపయోగపడుతుందని విశ్లేషణ చేసి పోస్ట్ చేశా. రెండు నిమిషాల వీడియోతో మనస్తత్వాన్ని ఎలా విశ్లేషించగలరనే డౌట్ రావచ్చు. అలా రావడం సహజం కూడా. కానీ, ఆ రెండు నిమిషాలు మాట్లాడిన మాట్లాడిన ప్రతీ మాట వెనుక, ఆ మాటల ఎంపిక వెనుకనే అంతా దాగివుంది. ఈ ఉపన్యాసం, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూడే కోణాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తికరమైన అంశాలను అందిస్తుంది. ఈ ప్రసంగాన్ని సైకాలజికల్ అనాలిసిస్ చేస్తూ, అవసరమైన సందర్భాల్లో ఆయన గత ప్రవర్తనను ప్రస్తావిస్తూ విశ్లేషణను కొనసాగిద్దాం.👉కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నీకెప్పుడూ అలంకారం కాదుఇది సాధారణంగా ఒక వ్యక్తి అనగల మాటేనా? కాదు. సాధారణంగా, ఎవరికైనా పద్మభూషణ్ లాంటి పురస్కారం వస్తే, వారు కృతజ్ఞతా భావంతో సమాజం, ప్రభుత్వం, తాము పనిచేసిన రంగం మీద అఫర్మేషన్ ఇచ్చే అవకాశముంది. కానీ బాలకృష్ణ, పదవులకు తానే అలంకారం అన్న మాట ద్వారా, తన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను హైలైట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే వ్యక్తి గతంలో "మేము వేరు, మా బ్రీడ్ వేరు" అని చెప్పడం, ఆయనలో ఉన్న గ్రాండియోసిటీని (తాను సామాన్య ప్రజలకన్నా ఉన్నతుడని భావించడం) సూచిస్తుంది. ఇదంతా నార్సిసిస్టిక్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రకమైన అహంకార ధోరణులు, ప్రజాప్రతినిధుల్లో ప్రమాదకరమైన లక్షణాలు. 👉నా తండ్రి, గురువు, దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు..ఈ వ్యాఖ్యలో బాలకృష్ణ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన తండ్రి ద్వారా నిర్వచించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన సాధించినదంతా తన తండ్రి వారసత్వానికి సంబంధించినదేనని చెప్పడం, తాను నేడు ఉన్న స్థాయికి కారణం తన స్వీయ ప్రతిభ కాదన్న భావన కలగవచ్చు. కానీ.. గతంలో ఇదే బాలకృష్ణ తండ్రిని ముఖ్యమంత్రిపదవి నుంచి దింపడంలో కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వాఖ్యలు విరుద్ధంగా కనిపిస్తాయి. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రిని పక్కన పెట్టిన వ్యక్తి, ఇప్పుడు ఆయనను దేవుడిగా కీర్తించడం, తన ఐడెంటిటీని ప్రజల్లో తిరిగి బలపర్చుకునేందుకు ఉద్దేశించిన చర్యగా అనిపిస్తుంది. 👉నాకు జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంభూతుడు...ఇక్కడ తన తండ్రిని దేవుడితో పోలుస్తూనే, తాను ఆయన ప్రతిరూపమని చెప్పడం గమనార్హం. ఇక్కడ బాలకృష్ణ తన తండ్రి గొప్పతనాన్ని పొగుడుతూ, తాను కూడా అదే వారసత్వానికి చెందినవాడినని, తాను కూడా అంతే గొప్పవాడినని నిరూపించుకోవడానికి మాట్లాడడం కనిపిస్తోంది. ఇదే వ్యక్తి ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో తన అక్క ఇంటిముందు తొడ కొట్టడం, అభిమానులను కొట్టడం లాంటి చర్యలు చేసారు. ఇవన్నీ చూస్తే, ఆయన నిజమైన అహంకార రహిత వ్యక్తి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 👉షేక్స్పియర్ చెప్పినట్టు.. ఇదంతా ఒక నటనే. అంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు.. ఇదొక ఆసక్తికరమైన వ్యాఖ్య. ఈ వాఖ్యలో బాలకృష్ణ జీవితాన్ని ఒక రంగస్థలంగా చూస్తూ, దానిలో తన పాత్ర ఒక ప్రత్యేకమైనదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా, గొప్పతనం భావన (Grandiosity) కలిగిన వ్యక్తులు, ప్రపంచాన్ని ఒక నాటకంగా, తాము దానిలో ముఖ్య పాత్రధారులమని భావిస్తారు. అయితే, షేక్స్పియర్ చెప్పిన ఆలోచన మానవ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది, కానీ బాలకృష్ణ దాన్ని కేవలం తన ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఉపయోగించడం Selective Interpretation కు సంకేతం. 👉ఇదుగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్‌లు కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే.. ఇక్కడ ఆయన, అవార్డులు తనని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పడం, నార్సిసిజం యొక్క మరో స్పష్టమైన ఉదాహరణ. సాధారణంగా, నిజమైన అచీవర్స్ "ఈ అవార్డు నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను" అనే విధంగా స్పందిస్తారు. కానీ బాలకృష్ణ తనకి అవార్డులు రావడం సహజమే అనే ధోరణిలో మాట్లాడడం, తనలోని గొప్పతనం తానే హైలైట్ చేసుకోవాలనే మానసిక స్థితిని సూచిస్తుంది. 👉రేపు మీలో ఎవరికైనా రావచ్చు భవిష్యత్తులో. స్టేజ్ మీద ఉన్న వారిలో ఎవరికైనా రావొచ్చు. ఈ మాట ఒక ఫేక్ హంబుల్‌నెస్ (False Humility) కి ఉదాహరణ. అవార్డు తానే పొందాడు, కానీ మరెవరైనా పొందవచ్చని చెప్పడం, పైకి వినసొంపుగా ఉన్నా, లోపల మాత్రం "మీకు రాదు, నేనే గొప్ప" అనే అహంకారాన్ని బలపరిచే ప్రయత్నమే. ఇదే వ్యక్తి తన అభిమానులను కొట్టినప్పుడు, అవకాశాల కోసం తమను తాము తక్కువగా చూడాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ప్రజలను ఉపయోగించుకోవడం, అవసరమైనప్పుడు తమను సమానంగా చూడడం.. ఇది బాలకృష్ణ రాజకీయ మానసిక స్థితికి అద్దం పడుతుంది. 👉 ఈ ఉపన్యాసం మొత్తం బాలకృష్ణ వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధతలను (Contradictions) చూపిస్తోంది.తాను కష్టపడి సాధించానని చెబుతూనే, అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని చెప్పడం... గతంలో తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కొనసాగిస్తున్నానని చెప్పడం... గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు చేసి, ఇప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పడం.. ఇవన్నీ పరస్పర విరుద్ధతలను చూపిస్తున్నాయి. అందుకే, ఈ ఉపన్యాసం పూర్తిగా నిజాయితీతో నిండినదిగా అనిపించదు. ఆయన ఉపన్యాస శైలిని, గత ప్రవర్తనను తులనాత్మకంగా పరిశీలిస్తే, తన రాజకీయం, సినిమా, నందమూరి వారసత్వాన్ని ప్రజల్లో మరింత బలపరిచేందుకు చేసిన ఎమోషనల్ స్ట్రాటజీగా చెప్పవచ్చు. అయితే...✔ ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాదు, కేవలం ఆయన ప్రవర్తన ఆధారంగా మానసిక విశ్లేషణ మాత్రమే.✔ ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ మూడింటి కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే, అది వ్యక్తిత్వ రుగ్మతగా పరిగణించాలి.✔ రాజకీయ, సినీ ప్రపంచంలో ఉండే చాలా మందికి "Public Persona vs. Real Persona" మధ్య వ్యత్యాసం ఉంటుంది. ✔ బాలకృష్ణ ప్రవర్తనలో అతిశయమైన అహంకారం, నియంత్రించలేని కోపం, ఇంపల్సివ్ యాక్షన్స్, ఇతరులను మోసగించాలనే ధోరణి ఉన్నాయి. ఇవన్నీ తీవ్రంగా ఉంటే, అతనికి Narcissistic Personality Disorder (NPD) & Impulse Control Disorder (ICD) ఉన్నట్లు చెప్పొచ్చు.ఇది ఒక నటుడు, రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టు కాకుండా, ఒక మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే కోణంగానే చూడాలి. ఒక అధ్యయన విషయంగా చూస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం "Power & Narcissism" కి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు!:::PsyVishesh -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్‌కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్‌ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్‌పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్‌దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్‌సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో
ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్‌లాక్ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్‌లాక్‌కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్ సీన్లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్‌లో ప్రతీక్ గాంధీ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ విద్యాబాలన్(Vidya Balan) తో కలిసి లిప్‌లాక్ సన్నివేశం ఉంది. ప్రతీక్ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్... లిప్లాక్స్లోనూ సీనియరే. ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్ గాంధీ ఇటీవల లెహ్రెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్‌లాక్ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు. విద్య తన మొట్టమొదటి ఆన్–స్క్రీన్ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు. శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతీక్ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకి బాగా హెల్ప్ చేసిందని చెప్పాడు.‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్ చాలా బాగా వచ్చిందని అన్నాడు. అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది. సీనియర్ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్ కర్ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్ నేచర్‌ను ప్రతీక్ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్ ఫుల్ కో స్టార్ అని పేర్కొన్నాడు.లిప్‌లాక్స్‌తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్ దో ప్యార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది అయినప్పటికీ, విద్య ప్రతీక్ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్ దో ప్యార్ ఫెయిల్యూర్ అయినా, విద్యాబాలన్ భూల్ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది. -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్‌తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్‌గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా సల్మాన్‌ఖాన్‌తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్‌తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్‌తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్‌ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్‌ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్‌కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్‌ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్!
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 👉దావోస్తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్పేట్లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్ఎస్పై ఆరోపించారు. నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే దెబ్బతింటుందని రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది. ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు. చంద్రబాబు, లోకేష్‌ల దావోస్ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్‌లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్‌గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్‌టాప్ టెంట్‌కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్‌ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్‌కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్‌ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వలసలకు విఘాతం
ప్రపంచ నలుమూలల నుంచీ లక్షల మంది యువతీ యువకులు అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది.మంచి వేతనాలు, మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అగ్రరాజ్యానికి ప్రయాణం కట్టిస్తోంది. కుదిరితే చట్టబద్ధంగా, లేదంటే ఆక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడోర్ ప్రజల తరువాత పెద్ద యెత్తున అనధికారికంగా అక్కడికి వెళ్తున్నది భారతీ యులే. 2021 నాటికే అమెరికాలో అలాంటి భారతీయుల సంఖ్య 7,25,000 మించిందని అంచనా. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో 4.6 శాతం వరకు అనధికా రికంగా వచ్చినవారేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ లోగడ వెల్లడించింది.వలసలే అభివృద్ధికి మూలంసమాజ పరిణామం జాతుల, గణాల వలసల క్రమంలోనే జరిగిందని నిర్ధారిస్తారు తన ‘ఏన్షియంట్ సొసైటీ’ పుస్తకంలో ఆంత్రొపాలజిస్ట్ హెన్రీ మోర్గాన్. వలసలు ప్రపంచ వ్యాప్తంగా అనాది కాలం నుంచి జరుగుతూ వచ్చాయి. వలసలు ప్రపంచీకరణను, సరళీకరణను, ప్రైవేటీకరణను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా వలసదారుల వల్ల ఎంతో ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతిని పొందిందని చెప్పక తప్పదు. నిజానికి ట్రంప్ తండ్రి కూడా అమెరికాకు వలస వచ్చినవాడే! వలసల ప్రాధాన్యాన్ని గుర్తించని ఏ దేశమైనా కుదించుకుపోయే అవకాశం వుంది. ఏ నాగరి కత కూడా ఒంటరిగా అభివృద్ధి చెందదు. మతమూ, మౌలికమైన ప్రాపంచిక దృక్పథాల విషయంలో కూడా స్థానికమైన ఆలోచనా ధోరణులపై ఒక మేరకు బయటి ప్రభావాలు ఉంటాయి. ఆ విధంగా అవి మిశ్రమ నేపథ్యాలవుతాయి. అమెరికాను పాలించిన ఎంతోమంది మేధావులు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాద భావాల్ని, వైజ్ఞానిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లినవాళ్లే. జాన్ డ్యూయి వంటి ప్రజాస్వామిక తత్వవేత్త ఆవిర్భవించిన నేల అది. అబ్రహాం లింకన్ ఎన్నో సామాజిక సంస్కరణలను తీసుకువచ్చారు. అమెరికాలో అభివృద్ధి చెందుతున్న ఎంతో విజ్ఞాన శాస్త్ర ప్రభావం ట్రంప్ మీద కనిపించటం లేదు. ఆది నుంచీ వివాదాస్పదుడే!చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు చేస్తూ ట్రంప్ గతంలో కూడా వార్తల్లో నిలిచారు. చొరబాటుదారులను నియంత్రించడానికి అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి పూనుకున్నారు. విదేశాల నుండి అమెరికాకి వచ్చి పురుడు పోసుకున్నంత మాత్రాన పుట్టిన బిడ్డలు పౌరులుగా మారడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. తాను అధ్యక్షుడైతే, అక్రమ వలసదారులను తన్ని తరిమేయటానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడాలంటే విదేశీ ముస్లింలందరినీ యూఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని ప్రతిపాదన పెట్టి విమర్శల పాలయ్యారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి ట్రంప్ జీవితంలో. అమెరికాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేకపోతే 51వ యూఎస్ రాష్ట్రంగా కెనడా కలిసిపోతుందని కూడా అన్నారు.మేల్కోవాల్సిన సమయంఇదే క్రమంలో మనం కూడా అమెరికాపై మోజును తగ్గించుకోవలసి వుంది. మన మేధావులను, సాంకేతిక నిపుణులను మన దేశ అభివృద్ధికి ఉపయుక్తం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి మనకు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన సంపదను పెంచుకున్నట్లయితే మనలో వలస భావన తగ్గుతుంది. ఇవాళ అమెరికా గురించి ఆందోళన చెందుతున్న మనం, మన దేశంలో రద్దవుతున్న రాష్ట్రాల హక్కుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఇతర దేశాలకు విద్య కోసం పరుగెడుతున్నారు. దీనికి కారణం విద్యా హక్కును మనం దెబ్బతీశాం. మన విశ్వవిద్యాలయాల్లో తగినన్ని సాంకేతిక పరికరాలు లేవు. విస్తృతమైన ల్యాబ్‌లు, గ్రంథాలయాలు లేక పోవడం వల్ల మన పిల్లలు వలస బాట పడుతున్నారు. ఇది భారతదేశం మేల్కోవలసిన సమయం. భయభ్రాంతులకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవలసి వుంది. మన పాలకులు అమెరికా నుండి తిరిగి వచ్చే విద్యార్థు లను, ఉద్యోగులను, స్కిల్ వర్కర్స్‌ను సాదరంగా స్వాగతించి, వారికి తగిన పనిని కల్పించడానికి పూనుకోవాలి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చారు. అప్పుడే మనం సిద్ధపడవలసి ఉంది. కానీ మనం ఉదాసీనత వహించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం. కొన్ని సామాజిక తరగతులు భారతదేశంలో జీవించడానికి ఇష్టపడనంతగా దేశీయేతర భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. ఇప్పుడు ఆ భావాల నుండి బయటపడాలి. దేశంలో కుటీర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మించుకోవలసి ఉంది. దేశీయ పారి శ్రామిక విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంబేడ్కర్ చెప్పేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో అనేకసార్లు వచ్చాయి. మనం ఈ పరిస్థితుల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచంలో మానవులంతా ఏ దేశంలోనైనా జీవించవచ్చు, ఉపాధి పొందవచ్చు అనే ప్రపంచ పరిణామ సూత్రం మరోసారి చర్చలోకి వచ్చింది. మానవ జీవన వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకోవలసిన సమయమిది.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మొటిరోజే భారీ నష్టాలు.. మార్కెట్ల దిశా నిర్దేశి బడ్జెట్టే!
కొలంబియాపై టారిఫ్‌లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన పోరు ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాలేదు . గతవారం మొత్తం మీద దాదాపు అరశాతం నష్టపోయిన సూచీలు ఈవారం మొదటి రోజునే భారీ నష్టాలను చవిచూశాయి. కిందటి వారంనష్టాలకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. చమురు ధరలు కొంత శాంతిస్తున్నట్లు కనబడుతున్నా, బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడం, ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటం, రూపాయి బలహీనతలు కొనసాగడం మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి.గత వారం మొత్తానికి సెన్సెక్స్ 429 పాయింట్లు కోల్పోయి 76190 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 23092 పాయింట్ల వద్ద స్థిరపడగా.. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 75366 వద్ద, నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22829 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు సైతం భారీ నష్టాల్లోనే సాగాయి. ఈవారంఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణ సోమవారమే కనిపించింది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. మరోపక్క టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.దీనికంటే ముందు మన మార్కెట్ల దశ - దిశ మార్చేది మాత్రం బడ్జెట్టే. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను కిందకు లాగుతూనే ఉంటాయి.ఈవారం ఆర్ధిక ఫలితాల కంపెనీలుమార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో కోల్ ఇండియా, కెనరా బ్యాంకు, టాటా స్టీల్, ఏసీసీ, బజాజ్ ఆటో, సిప్లా, టీవీఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్, అదానీ పవర్, ఎల్ & టీ, బజాజ్ ఫిన్ సర్వ్, భెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, నెస్లే ల ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో పెట్రోనెట్, హిందుస్థాన్ జింక్, బాష్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్, ఎస్సారెఫ్ వోల్టాస్, రేమండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గెయిల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, జిందాల్ స్టీల్, బయోకాన్, డాక్టర్ లాల్ పాత్, అజంతా ఫార్మా, మారికో, బంధన్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్, జ్యోతి లాబ్స్ ల ఫలితాలపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) కు భారత్‌లో పెట్టుబడులపై వస్తున్న రిటర్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. మరోపక్క అమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉంది. దీంతో వారు మన మార్కెట్లో భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడుతూ, పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది.గత ఏడాది మొత్తం మీద అధిక స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. నెల మొత్తం మీద ఇప్పటిదాకా వీరు దాదాపు రూ.74,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.73,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 5,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేయగా, దేశీయ మదుపర్లు రూ. 6,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఇదే ధోరణి కొనసాగితే సూచీలు మరింత పడిపోవడం ఖాయం. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు ఏమాత్రం తేరుకునే ప్రయత్నం చేస్తున్నా వెంటనే బేర్స్ రంగంలోకి దిగి వాటిని పడగొడుతూనే ఉన్నారు. మార్కెట్‌కు 23050 వద్ద మద్దతు లభించాల్సి ఉన్నప్పటికీ, సోమవారం ఉదయమే ఇది బ్రేక్ అయిపొయింది. ఒకవేళ మార్కెట్లు తేరుకుంటే మాత్రం 23350 ప్రధాన నిరోధంగా భావించాలి. దానికంటే ముందు 22950, 23050, 23200, స్థాయిల వద్ద నిఫ్టీ కి నిరోధాలు ఉన్నాయి. పతనాన్ని కొనసాగిస్తే తదుపరి మద్దతు 22750 దగ్గర లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 22600, 22500 స్థాయిలను టెస్ట్ చేయవచ్చు. అది కూడా దాటుకుని పడిపోతే... 22200 వరకు భారీ పతనం తప్పదు. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నా సూచీలు మరింత పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా. మన మార్కెట్‌కు భవిష్యత్ దిశా నిర్దేశి మాత్రం బడ్జెట్టే. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఏమాత్రం తేడా జరిగినా భారీ పతనం తప్పదు. ప్రోత్సాహకరంగా ఉంటే మాత్రం ఇప్పటి స్థాయిల నుంచి తేరుకోవడమే కాక, సూచీలు పరుగులు పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 8.24 శాతంపెరిగి 18.13 దగ్గర ఉంది. భారీ ఒడుదొడుకులను ఇది తెలియజెబుతోంది.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వరుణ్ 'అందమైన మిస్టరీ స్పిన్నర్'.. వన్డేల్లో కూడా ఆడించాలి!
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.చెపాక్‌లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.కర్ణాటక నుంచి చెన్నై కి..వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్‌లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం? ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది. వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.భారత్ కి కొత్త ఆశలు వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం