విద్యుత్ చలనశక్తి వైపు పెద్ద ఎత్తున మళ్ళడం కేవలం వాంఛనీయం కాదు, తక్షణావశ్యకమని ఢిల్లీ వాయు కాలుష్యం హెచ్చరిస్తోంది. ప్రపంచ మోటారు వాహ నాల పరిశ్రమ ఇప్పటికే ఆ క్రమంలో ఉంది. ఈ శతాబ్దంలోని పరిస్థితులు దాన్ని అనివార్య పరిణామంగా మారుస్తు న్నాయి. ఇదేదో వాతావరణ మార్పునకు పరిష్కారంగా తీసుకుంటున్న చర్య కాదు. పారిశ్రామిక పోటీ సామర్థ్యానికి, సాంకే తిక నాయకత్వానికి, జాతీయ ఆర్థిక స్థితిస్థాపక శక్తికి బ్యాటరీలతో నడిచే వాహనాలు నిర్ణయాత్మక శక్తిగా మారాయి.
నేటి వ్యూహాత్మక అవసరం
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో గడచిన పదేళ్లలో మనం అడుగులు వేయడం ప్రారంభించాం. ఎక్కువ శక్తిని పొందుపరచు కునే కొత్త రకం బ్యాటరీల తయారీకి నడుం బిగించాం. కానీ, ఇతర దేశాలు నాటకీయంగా వేగం పుంజుకున్నాయి. పారిశ్రామిక ఆధిప త్యాన్ని చాటుకునేందుకు చైనా వీటిని కూడా ఒక వేదికగా చేసు
కుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈవీల సరఫరా క్రమంలో ప్రధాన విడి భాగాలపై అది పట్టు చేజిక్కించుకుంది. ఈవీలను వాడక తప్పని మార్పు ఎంత లోతైనదో అమెరికా, యూరోపియన్ యూనియన్ గ్రహించి, అసాధారణ పారిశ్రామిక విధానాలతో దానికనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, ఈయూ గ్రీన్ డీల్ ఆ కోవకు చెందినవే!
ఇపుడు కనుక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, ప్రపంచానికే నాయకత్వం వహించగల ఈవీ ఎకోసిస్టంను మనం నిర్మించుకో గలం. దేశంలో రోడ్లపై కనిపించే వాహనాల్లో ఈ రెండు విభాగాలవే దాదాపు 80 శాతం. పెట్రోలు వాహనం కన్నా ఈవీని కొనడం, నడపడం దాదాపు 30 శాతం చౌకతో కూడిన పని. పట్టణాలు, నగరాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిని విరివిగా వాడవచ్చు. ద్వి, త్రిచక్ర వాహనాలు విధిగా 2030 కల్లా బ్యాటరీలతో నడిచేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు కూడా స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. కంపెనీలు పరిశోధన–అభివృద్ధి, విడి భాగాల తయారీ, బ్యాటరీల ఉత్పత్తిపై సందేహించకుండా పెట్టుబడులు పెంచుకునేందుకు వీలవుతుంది. దేశంపై చమురు దిగుమతి భారం తగ్గుతుంది. నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. ఈయూ దేశాలతోపాటు, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్ వంటి పెక్కు దేశాలు ఈవీలను ఇప్పటికే తప్పనిసరి చేశాయి.
కార్ల వైపు కూడా దృష్టి!
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల వినియోగం వైపు మనం పూర్తిగా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పురోగతు లకు తగ్గట్లుగా మన కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య (కఫే) నిబంధనలను మార్చుకోవాలి. కిలోమీటరుకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 93.5 గ్రాములకు మించకూడదనే నియమాన్ని ఈయూ అమలుపరుస్తోంది. మన దేశంలో ఇది ఇప్పటికీ కిలోమీటరుకు 113 గ్రాములుగా ఉంది. కర్బన ఉద్గారాలు తగ్గించుకోవలసిందేనని నిబంధన తెస్తే వాహన తయారీ సంస్థలు ఇంధన సామర్థ్య లక్ష్యాల సాధనపై శ్రద్ధ పెడతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల (ఐసీఈ)లో క్రమానుగత మెరుగుదలకు ఉపక్రమిస్తాయి. ఆర్థికంగా ఎక్కువ భారం మోపని కార్ల తయారీ వైపు కంపెనీలను నడిపించాలి. లైట్–డ్యూటీ వాహన ‘కఫే’ ప్రమాణాల అమలుతో యూరప్‌లో ఈవీల వాటా ఒక్క ఏడాదిలోనే 3 నుంచి 11 శాతానికి పెరిగింది.
‘కఫే’ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మూడు ప్రయో జనాలున్నాయి. కంపెనీలు కాలం చెల్లిన ఐసీఈ టెక్నాలజీలపై ఆధారపడే బదులు తదుపరి తరం ఈవీల తయారీలపై పెట్టు బడులు పెడతాయి. ప్రపంచ రెగ్యులేటరీ ప్రమాణాలతో భారత్ సమతూకం సాధిస్తుంది. ఫలితంగా, దేశంలోని కార్ల తయారీ
సంస్థలు ఎగుమతి మార్కెట్లో పోటీ పడగలుగుతాయి. మూడవది– భారతీయ వినియోగదారులకు సరసమైన ఎలక్ట్రిక్ కార్లు అందు బాటులోకి రావడం వేగం పుంజుకుంటుంది.
ఛార్జింగ్ అడ్డంకులు
దేశంలో ఈవీల వాడకం ఆశించినంత పెరగకపోవడానికి కారణం వాటి ధర, లేదా పనితీరు కారణం కాదు. ఆధారపడదగిన రీఛార్జి సదుపాయాలు లేకపోవడం. ఇళ్లు, ఆఫీసులు రెండింటి వద్ద ఈ సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో నివసి స్తున్నారు. ఛార్జర్లను ఏర్పాటు చేసుకోవడం వారికి వ్యయ ప్రయాస లతో కూడిన పని. వాహనాలు ఛార్జి చేసుకోవడం భారతదేశంలో తక్షణం జాతీయ హక్కుగా మారాలి. వాహనాలను పార్కు చేసుకునే చోట ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోనివ్వాలి. ప్రాథమిక విద్యుత్, సురక్షితా నిబంధనలతో ఆ సదుపాయాలు అందుబాటు లోకి తేవచ్చు. లీగల్ ఫ్రేమ్ వర్కును కూడా మార్చుకోవాలి.
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తరహాలో రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు లేదా బిల్డింగ్ అసోసియేషన్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఏ పౌరుడైనా లీగల్ పార్కింగ్ స్పాట్ వద్ద ఛార్జర్ ఏర్పాటు చేసుకునేందుకు అధికారమివ్వాలి. వోల్టేజి తగ్గని విధంగా విద్యుత్ సరఫరా ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఈవీ–రెడీ
వైరింగు అమర్చాలి. స్లో, ఫాస్ట్ చార్జింగ్‌లకు వేర్వేరు ప్రదేశాలు నిర్ణ యించాలి. రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు సాముదాయిక రీఛార్జింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ప్రభుత్వం, పురపాలక సంస్థలు వివిధ కానుకల రూపంలో ప్రోత్సహించాలి.
దీన్ని కేవలం పర్యావరణపరమైన బాధ్యతగా భావించడం పొరపాటు. భారత్ బలమైన ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా అవత రించేందుకు ఇది ద్వారాలు తెరుస్తుంది. మనం శిలాజ ఇంధనాల దిగుమతిపై చాలా కాలంగా ఆధారపడుతూ వస్తున్నాం. దాన్ని తగ్గించుకోవచ్చు. ప్రజారోగ్య లక్ష్యాలను అందుకోవడంలో నగరాలకు సహాయపడినట్లు అవుతుంది. బ్యాటరీలు, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రిడ్ల అధునికీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా అధునా తన టెక్నాలజీలలో పెట్టుబడులను ఉద్దీపింపజేస్తుంది. ఈ రంగాన అగ్ర భాగాన నిలిచేందుకు భారత్ కృషి చేసి తీరాలి. ప్రపంచం గేరు మారుస్తున్నప్పుడు, ఇండియా కూడా యాక్సిలరేటర్ తొక్కాలి.
ఎలక్ట్రిక్ వాహనాలతో నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. 2030 కల్లా విధిగా ద్వి, త్రిచక్ర వాహనాలు బ్యాటరీలతో నడి చేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. అలాగే విస్తృతంగా ఛార్జింగ్ సదుపాయా లను అందుబాటులోకి తేవాలి.
అశోక్ ఝున్‌ఝున్‌వాలా
వ్యాసకర్త ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)


