ఎమోషనల్‌ మగాడే అసలైన వాడు! | International Men's Day 2025 | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ మగాడే అసలైన వాడు!

Nov 19 2025 1:12 PM | Updated on Nov 21 2025 11:26 AM

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మనసారా ఏడ్చారా? 
మీ భయాలను ఓపెన్ గా చెప్పగలిగారా? 
మీ బలహీనతలను ఒప్పుకోగలిగారా? 
చాలామంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుందని తెలుసు. ఎందుకంటే మన సమాజంలో మగబిడ్డ పుట్టిన వెంటనే అతని చుట్టూ ఒక మేట్రిక్స్ నిర్మితమవుతుంది. మేట్రిక్స్ అంటే మరేదో అనుకోకండి, ఒక ఫ్రేమ్ వర్క్.

‘‘నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. బాధపడకూడదు, తట్టుకోవాలి’’ అని పుట్టినప్పటినుంచీ చెప్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కలిసి అతను  ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఒక ఫ్రేమ్ వర్క్ ను నిర్మిస్తాయి. అది కంటికి కనిపించని జైలులా మారుతుంది. దాని లోపల ఉన్నాడని కూడా తెలీదు. కానీ అతని డెసిషన్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ అది నియంత్రిస్తుంటుంది.

కానీ చాలామందికి అది తెలియదు. తెలిసిన వాళ్లు కూడా బయటకు రావడానికి భయపడతారు. కానీ నిజమేమిటంటే... దాన్ని బద్దలు కొట్టినప్పుడే మగాడు నిజమైన మనిషి అవుతాడు.

1. BREAK
మగాడు, మగతనం అనే మేట్రిక్స్‌ను బద్దలుకొట్టకపోతే పురుషుడు సంపూర్ణంగా జీవించలేడు. జస్ట్ మగాడిగా తన పాత్రను పోషిస్తుంటాడంతే. ఈ మేట్రిక్స్ మగాడి మనసుకు మూడు పెద్ద నష్టాలు చేస్తుంది:

1. ఏమైనా జరిగినప్పుడు ‘ఇది చిన్నవిషయమే’ బాధపడకూడదు అనిపిస్తుంది. ఏడవాలనిపించినా... ‘అలా చేస్తే ఏమనుకుంటారో?’ ‘బలహీనంగా కనిపిస్తానేమో?’ అని ఏడుపును మనసులోనే నొక్కేసుకుంటారు. తమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేరు. భావాలను చెప్పడం నేరం అనిపిస్తుంది.

2. ఒక పురుషుడు ‘I need help’ అని ఓపెన్ గా అడగలేడు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ అతనికి నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పారు. అందుకే సహాయం అడగడానికి సిగ్గనిపిస్తుంది. 

3. చుట్టూ జనాలు ఉన్నా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుంది. ఇది depression, anger issues, burnout, relationship breakdowns కి నేరుగా దారి తీస్తుంది.

ఇది బలం కాదు బ్రో, ఇదో కనిపించని జైలు. ఇదే మగాడు అనే మేట్రిక్స్.

2. BUILD
ఈ మేట్రిక్స్ నుంచి బయటపడినప్పుడు పురుషుడు తనను తానే తిరిగి నిర్మించుకుంటాడు. ఒక పురుషుడు మేట్రిక్స్‌ను ప్రశ్నించే రోజే అతని అసలు వ్యక్తిత్వం పుట్టే రోజు. అప్పుడే అతను మొదటిసారి తనతో నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడతాడు.
“నాకు కూడా బాధ ఉంటుంది.”
“నాకు కూడా భయం ఉంటుంది.”
“నాకు కూడా ప్రేమ, వినేవాళ్లు కావాలి.”
అని ఒప్పుకోవడం మొదలుపెడతాడు. ఇది బలహీనత కాదు. ఇది అవగాహనా స్థాయి పెరగటం. దీనివల్ల మగాడిలో కొత్త వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది.

1. Emotion Awareness: ఏం ఫీల్ అవుతున్నాను? ఎందుకు? అని ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రశ్న ఒక వ్యక్తిని బలంగా మారుస్తుంది, బలహీనంగా కాదు.
2. Healthy Expression: బాధను చెప్పగలగడం అనేది మానసిక బలమని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదని గుర్తిస్తాడు. 
3. Boundaries: నేను మగాణ్ని కాబట్టి ప్రతి పని నేనే చేయాలి అనే మేట్రిక్స్ నుండి బయటపడతాడు. 
4. Genuine Relationships: జస్ట్ మగాడనే పాత్రను పోషించడం కాకుండా, నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వల్ల నటించే బంధాలు కాకుండా నిజమన బంధాలు మొదలవుతాయి.

3. BEYOND
మేట్రిక్స్ బద్దలైనప్పుడు మగాడు లిమిట్స్‌ దాటి వెళ్తాడు. మగతనం కొత్తరూపు తీసుకుంటుంది. ఈ కొత్త మగాడు Emotionally Intelligent. 
అతను మాట్లాడతాడు.
అతను వింటాడు.
అతను పంచుకుంటాడు.
ఈ కొత్త పురుషుడు Strong + Soft
అతని బలం అరవడం కాదు.
అతని సున్నితత్వం బలహీనత కాదు.
కొత్త మగాడు Balanced.
అతను తనను తాను కోల్పోకుండా కుటుంబం, పని, సంబంధాలను నడపగలడు.
కొత్త పురుషుడు Human. ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్ అన్నీ అతని భాగమే అని అంగీకరిస్తాడు.
అతను మగాడనే ఒక మూసలో కాకుండా పూర్తి మనిషిగా జీవిస్తాడు.

Break the ‘Man’ Matrix.
Build your true self.
Go Beyond your limits.

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
www.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement