మీ మైండ్ రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది..! | Health Tips: Programming and Parenting: Starting a career while | Sakshi
Sakshi News home page

Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?

Feb 22 2026 1:52 PM | Updated on Feb 22 2026 2:50 PM

Health Tips: Programming and Parenting: Starting a career while

మనం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు అందులో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి (Pre-installed apps). మనం వాటిని వాడకపోయినా అవి మెమరీని ఆక్యుపై చేస్తూనే ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజం మన చిన్నతనంలో మన మనసులో కొన్ని 'ప్రోగ్రామ్స్' ఇన్‌స్టాల్ చేస్తారు.

మనకు తెలియకుండానే మనం ఆ ప్రోగ్రామ్స్ ప్రకారమే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. దీనినే సైకాలజీలో 'Social & Parental Conditioning' అంటారు. మరి ఈ ప్రోగ్రామింగ్‌ను మార్చడం సాధ్యమేనా?

1. పేరెంటింగ్ ఎలా ప్రోగ్రామింగ్‌గా మారుతుంది?
సైకాలజీ ప్రకారం, తల్లిదండ్రుల ప్రవర్తన బిడ్డ మనసులో 'బిలీఫ్ సిస్టమ్' (Belief System) గా మారుతుంది. ఇది మూడు రకాలుగా జరుగుతుంది.

Direct Commands: "నువ్వు ఎందుకూ పనికిరావు", "అమ్మాయిలు ఇలాగే ఉండాలి", "డబ్బు సంపాదించడం చాలా కష్టం". ఇలాంటి మాటలు పదే పదే విన్నప్పుడు అవి మెదడులో నిజాలుగా రికార్డ్ అయిపోతాయి.

Observation: మీ నాన్న కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేస్తే.. మీరు పెద్దయ్యాక మీకు తెలియకుండానే అదే చేస్తారు. ఎందుకంటే మీ మైండ్ "కోపాన్ని ఇలాగే వ్యక్తపరచాలి" అని ప్రోగ్రామ్ అయ్యింది.

Emotional Anchoring: మీరు ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటే.. "నేను ఏదైనా సక్సెస్ సాధిస్తేనే నాకు విలువ ఉంటుంది" అనే ప్రోగ్రామ్ మీలో రన్ అవుతుంది. దీన్నే 'Conditional Love' అంటారు.

2. మార్కెట్ మోటివేటర్ల పొరపాటు: "Update" vs "Format"
సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు "ఈ రోజు నుంచి కొత్తగా ఆలోచించు, సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది పాత సాఫ్ట్‌వేర్ మీద కొత్త స్టిక్కర్ వేసినట్లు ఉంటుంది.

ట్రైనర్స్ బాహ్య ప్రవర్తనను మార్చమంటారు. సైకాలజీ అసలు ఆ సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ను మార్చమంటుంది (Rewiring).

మీరు లోపల "నేను దేనికీ పనికిరాను" అనే ప్రోగ్రామ్‌ను రన్ చేస్తూ, పైన "నేను గొప్పవాడిని" అని అరిస్తే.. ఆ రెండింటి మధ్య ఘర్షణ మొదలై మీలో ఒత్తిడి (Stress) పెరుగుతుంది తప్ప వ్యక్తిత్వం మారదు.

3. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా? (The Science of Change)
దీనికి సైన్స్ ఇచ్చే సమాధానం.. ఎస్!ఖచ్చితంగా మార్చుకోవచ్చు! మన మెదడు ఒక రాయిలాంటిది కాదు, అది ఒక ప్లాస్టిక్ లాంటిది. మనం అనుకుంటే కొత్త న్యూరల్ పాత్‌వేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పాత ప్రోగ్రామింగ్‌ను డిలీట్ చేసి కొత్త కోడింగ్ రాసుకోవచ్చు. దీన్నే Neuroplasticity అంటారు.

4. Real Personality Development: రీ-ప్రోగ్రామింగ్ ప్రాసెస్
Genius Matrix Model ఉపయోగించి మిమ్మల్ని మీరు ఎలా రీ-డిజైన్ చేసుకోవాలో చూద్దాం.

STEP 1: BREAK (డీ-కోడింగ్)
ముందుగా మీలో ఉన్న బగ్స్ (Bugs) ఏంటో గుర్తించాలి.

* "నేను ఎందుకు భయపడుతున్నాను? ఇది నా భయమా లేక మా అమ్మ భయమా?"

* "ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నానా లేక నా ప్రోగ్రామింగ్ తీసుకుంటోందా?"

మీరు ఆలోచించే ప్రతి నెగటివ్ ఆలోచన వెనుక ఉన్న 'మూలాన్ని' వెతకండి. ఆ మూలాన్ని గుర్తించడమే పాత ప్రోగ్రామ్‌ను 'బ్రేక్' చేయడం.

STEP 2: BUILD (రీ-కోడింగ్)
ఇక్కడ మీరు కొత్త అలవాట్లను, కొత్త ఆలోచనా విధానాలను ఇన్‌స్టాల్ చేయాలి.

* Cognitive Re-structuring: "నేను ఓడిపోతాను" అనే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు, వెంటనే దాన్ని మ్యాన్యువల్ గా ఆపి.. "నేను నేర్చుకుంటున్నాను" అనే కొత్త లైన్ యాడ్ చేయాలి.

* ఇది ఒక్క రోజులో జరగదు. పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల పాత ప్రోగ్రామ్ వీక్ అయి, కొత్త ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతుంది.

STEP 3: BEYOND (మాస్టరీ)
ఒక్కసారి మీరు మీ మైండ్ సాఫ్ట్‌వేర్‌ను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే, మీరు కేవలం ఒక 'వ్యక్తి'గా మిగిలిపోరు. మీరు ఒక 'Creator' గా మారుతారు. మీ గతం మీ భవిష్యత్తును శాసించదు. మీరు మీ సొంత లెగసీని క్రియేట్ చేస్తారు.

5. Self-Reflection: మీ కోడింగ్‌ని చెక్ చేసుకోండి. అందుకోసం ఈ రోజు ఈ చిన్న ఎక్సర్‌సైజ్ చేయండి.
* మీరు తరచుగా వాడే ఒక నెగటివ్ వాక్యాన్ని రాసుకోండి (ఉదా: "నాకు అదృష్టం లేదు").
* ఈ మాట మీ మనసులోకి ఎప్పుడు వచ్చింది? మీ ఇంట్లో ఎవరైనా ఇలా అనేవారా?
* ఈ మాట నిజమేనా? దీనికి వ్యతిరేకంగా జరిగిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.
* ఇప్పుడు ఆ పాత వాక్యాన్ని కొట్టేసి.. ఒక కొత్త పవర్‌ఫుల్ వాక్యాన్ని రాయండి.

రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది!
బ్రో, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. అది వారి తప్పు కాదు, వారికి తెలిసింది వారు చేశారు. కానీ ఇప్పుడు మీరు పెద్దయ్యారు. మీ మైండ్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పాత ప్రోగ్రామింగ్ ని సాకుగా చూపిస్తూ అలాగే ఉండిపోతారా? లేక దాన్ని రీ-రైట్ చేసి ఒక Real Personality గా ఎదుగుతారా? ఛాయిస్ మీదే!

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
www.psyvisesh.com
8019 000066

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement