వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు మాత్రం పూటకోమాట మారుస్తారు. రైతులతో అవసరం ఉంటే ఒకమాట.. గెలిచేందుకు వారి సాయం కావాలంటే ఒకమాట.. గెలిచాక ఇంకో మాట.. సేద్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఇంకోమాట.. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు .. ప్రజలకు మొహం చూపలేని పరిస్థితుల్లో ఇంకోమాట.. రైతుల పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి సమాధానం ఇవ్వలేని తరుణంలో ఇంకోమాట.. ఇలా గంటగంటకూ మాటలు మారుస్తూ మాయలు చేసే చంద్రబాబు పాలనలో రైతులు నిలువునా మునిగిపోయారు.
చేలకు పురుగుపడితే ఏదో మందు కొట్టి ఆపొచ్చు.. కానీ ప్రభుత్వమే పురుగులా మరి వ్యవసాయాన్ని తొలిచేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. .. కాపుగాయాల్సినవాళ్ళే కాల్చేస్తుంటే రైతు ఎవరికీ చెప్పుకుంటాడు.. యేమని చెప్పుకుంటాడు. వ్యవసాయం.. పంటలసాగుపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు..
ప్రాజెక్టులు కడితే డబ్బులు దండగ.. ఐటీని ప్రమోట్ చేయాలి..
వ్యవసాయం దండగ..
వరి పండిచొద్దు.. బియ్యం తింటే డయాబెటిస్ వస్తుంది..
ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి..
యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది..
ఎరువుల వినియోగం తగ్గించాలి.. దీని వల్ల భూసారం తగ్గుతోంది..
చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు( మాట తడబాటు )..
వ్యవసాయంలో ఉపాధి లేదు.. సేవా రంగమే భేష్
వ్యవసాయం వల్ల ఆదాయం అంతంత మాత్రమే..
1995-2004 (మొదటి ముఖ్యమంత్రి కాలం) వ్యవసాయం "భారం" (దండగ/శిక్ష) అని పేర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. తన పాలనలో రైతులను ప్రాధాన్యత ఇవ్వలేదని తర్వాత (2012) అంగీకరించారు. రైతులకు 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు కూడా చేయలేదు.
1999లో రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడం వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేసారు. తన పుస్తకం మనసులో మాటలో (Manasulo Maata) ఈ వ్యాఖ్య ఉంది. 1995-2004 మధ్య 25,000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలున్నాయి. 2012, జనవరి 21 నెల్లూరు, కందుకూరులో TDP సభలో మాట్లాడిన చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రైతులను "విస్మరించాను, తప్పు చేశాను" అని క్షమాపణ చెప్పారు..
తిరిగి.. 2014, డిసెంబర్ 24న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కేవలం కరువు కారణంగా కాదు, "ప్రేమ విషాదం, రుణాలు, కుటుంబ సమస్యలు" కారణం అన్నారు.. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 2025, సెప్టెంబర్ 15-16 న కేబినెట్ సమావేశంలో యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమయంలో యూరియా లభించక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తన చేతగాని తనాన్ని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడారు. 2025, నవంబర్ 12-13న "నీళ్లు ఉన్నందుకే వరి పండిస్తే, ఎవరూ మీ వరిని తినరు" అని చంద్రబాబు చెప్పారు. వరి పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని సూచించారు.
పైవన్నీ చంద్రబాబు నోటినుంచి వెలువడిన ముత్యాల మాటాలు కొన్ని మచ్చుకు. ఇక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచాక మొక్కజొన్న, మామిడి.. అరటి.. పొగాకు.. మిర్చి రైతులు నిట్టనిలువునా మునిగిపోయారు. పండిద్దాం అంటే ఎరువులు దొరకవు.. పంటలు పండించాక అమ్ముదాం అంటే ధర దక్కదు.. ఆనాడు మామిడి రైతులు కిలో ఐదారు రూపాయలకు సైతం అమ్ముకోలేక వీధుల్లో పళ్ళను పారబోశారు.. నేడు అరటి రైతులు గెలలను పశువులకు వేస్తున్నారు.. అవి కూడా సయించక తినకపోవడంతో కొందరు రైతులు ఏకంగా అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం సాగదు .. రైతు ఏడ్చిన రాష్టం ముందుకు నడవదు అనే సామెత ఏపీలో అక్షరాలా నిజమవుతోంది.
నేడు కిలో అరటి కాయలు అర్ధరూపాయికి అమ్మాలంటే కన్నీళ్లొస్తున్నాయంటూ రైతులు పొలం గట్టున కూర్చుని ఏడుస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా అకాల వర్షాలకు అరటి పంటను నష్టపోయిన దాదాపు 670 మంది రైతులకు వైయస్ జగన్ హెక్టారుకు రూ. 20 వేలు చొప్పున సొంత డబ్బులు అందించి వారిని నిలబెట్టారు.. నాయకుడికి నయవంచకుడికి ఉన్న తేడాను వైఎస్ జగన్ తన మంచి మనసుతో చాటుకున్నారు.. ప్రజలకు కష్టం వస్తే జగనన్న.. ఆపద వస్తే జగనన్న.. కన్నీరొస్తే తుడవడానికి జగనన్న ఉండాలి.. ఆయనే రావాలి.. అదీ ప్రజల ప్రస్తుత పరిస్థితి..
:::సిమ్మాదిరప్పన్న


