సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేయిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడరు అని చెప్పుకొచ్చారు. అరెస్ట్‌లతో వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు అని అన్నారు.
కండలేరు డ్యామ్ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. సీమ లిఫ్ట్ నిలిపేసి నెల్లూరు జిల్లాకు బాబు ద్రోహం చేశారు. లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు భయపడేవాళ్లం కాదు. పోలీసులను అడ్డుకుని చంద్రబాబు.. దాడులు చేయిస్తున్నాడు. పోలీసు శాఖ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మొండి వైఖరి ప్రవర్తిస్తోంది.
కండలేరు డ్యామ్ పరిశీలనకు వెళ్ళకుండా అరెస్టులు చేస్తారా?. అరెస్టులతో మా పోరాటం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆశయాలు, ఆదేశాలతో పోరాడుతూ ముందుకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల వలన నెల్లూరు జిల్లాకు కూడా చంద్రబాబు తీరని లోటు తలపెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


