ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ (కల్వకుంట్ల కవిత) సిద్దిపేట నుంచే పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆదిత్య తెలిపారు.


